E-Paper
Advertisement

గ్రామీణ భారతంలో ఈవీ స్కూటర్ల హవా.. రోజు రోజుకు పెరుగుతున్న ఆదరణ!

గ్రామీణ భారతంలో ఈవీ స్కూటర్ల హవా.. రోజు రోజుకు పెరుగుతున్న ఆదరణ!
Advertisement

EV Adoption in Villages: దేశ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈవీ స్కూటర్లు, బైక్ లకు ఆదరణ పెరుగుతోంది. ఒకప్పుడు ఈవీలు ప్రధానంగా నగరాలకే పరిమితమయ్యాయి. కానీ, ఇప్పుడు గ్రామాలు, చిన్న పట్టణాల్లో కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. పెట్రోల్ ధరలు పెరుగుతుండటం, ప్రభుత్వ ప్రోత్సాహకాలు అందుబాటులో ఉండటం, పర్యావరణంపై అవగాహన పెరగడంతో ఈవీల కొనుగోలుకు ఆసక్తి చూపిస్తున్నారు.

రోజు వారీ ప్రయాణాలకు అనుకూలంగా…

గ్రామీణ ప్రాంతాల్లో ఈవీల వినియోగానికి ప్రధాన కారణం ఖర్చు తగ్గడం. రోజూ ప్రయాణం చేసే రైతులు, చిన్న వ్యాపారులు, డెలివరీ కార్మికులకు పెట్రోల్ ఖర్చు ఎక్కువ అవుతుంది. ఎలక్ట్రిక్ బైక్‌లు, స్కూటర్లు చాలా తక్కువ ఖర్చుతో నడుస్తాయి. ఒక సారి ఛార్జ్ చేస్తే మంచి రేంజ్ లభిస్తుంది. నెలవారీ ఖర్చు చాలా వరకు తగ్గించుకునే అవకాశం ఉంటుంది.

తక్కువ మెయింటెనెన్స్ ఖర్చు

Advertisement

మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. సాధారణ పెట్రోల్ బైక్‌ లలో ఉండే ఇంజిన్ భాగాలు, ఆయిల్ ఛేంజెస్ లాంటి అవసరాలు ఈవీలలో తక్కువగా ఉంటాయి. తరచూ సర్వీసింగ్ అవసరం ఉండదు. గ్రామాల్లో సర్వీస్ సెంటర్లు దూరంగా ఉన్నా, పెద్దగా ఇబ్బంలు కలగడం లేదు.

ఈవీలపై ప్రభుత్వ ప్రోత్సాహకాలు

ప్రభుత్వం కూడా ఈవీలను ప్రోత్సహించేందుకు పలు తగ్గింపులు అందిస్తుంది. ఫేమ్ ఇండియా స్కీమ్ లాంటి పథకాల ద్వారా సబ్సిడీలు అందిస్తున్నాయి. కొన్ని రాష్ట్రాలు పన్ను మినహాయింపులు, రిజిస్ట్రేషన్ ఫీజు రాయితీలు కూడా ఇస్తున్నాయి. దీని వల్ల ఈవీలు మరింత చౌకగా అందుబాటులోకి వస్తున్నాయి.

ఇళ్లలోనే ఛార్జింగ్ సౌకర్యం

Advertisement

ఛార్జింగ్ విషయంలో కొంత సమస్య ఉన్నప్పటికీ, దానికి కూడా పరిష్కారాలు కనిపిస్తున్నాయి. చాలా మంది తమ ఇళ్లలోనే సాధారణ విద్యుత్ కనెక్షన్‌ తో ఈవీలను ఛార్జ్ చేసుకుంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో సోలార్ పవర్ తో పనిచేసే ఛార్జింగ్ స్టేషన్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. అలాగే బ్యాటరీ రిమూవబుల్ విధానం కూడా కొంతమేర సమస్యను పరిష్కరిస్తుంది.

ఈవీల కొనుగోలుకు మొగ్గు చూపుతన్న గ్రామీణ ప్రజలు

ఇప్పుడిప్పుడే ఈవీలపై గ్రామీణ ప్రజల అభిప్రాయం కూడా మారుతోంది. ముందు ఇవి బలహీనంగా ఉంటాయని అనుకునేవారు. కానీ, ఇప్పుడు కొత్త మోడళ్లు మంచి వేగం, రేంజ్, స్మార్ట్ ఫీచర్లతో వస్తున్నాయి. మొదటగా ఉపయోగించిన వారి ఎక్స్ పీరియెన్స్ ఇతరులకు నమ్మకం కలిగిస్తున్నాయి. ఈ మార్పు వల్ల గ్రామీణ ప్రాంతాల్లో కొత్త అవకాశాలు  ఏర్పడుతున్నాయి. ఛార్జింగ్ స్టేషన్లు, రిపేర్ షాపులు, డీలర్‌షిప్‌లు లాంటి వ్యాపారాలు పెరుగుతున్నాయి. ఉపాధి అవకాశాలు కూడా విస్తరిస్తున్నాయి. రాబోయే రోజుల్లో గ్రామీణ రోడ్లపై ఎలక్ట్రిక్ స్కూటర్లు మరింతగా పెరిగే అవకాశం ఉంది.

Read Also: 3 సెకన్లలో 40 స్పీడ్.. ఏముంది భయ్యా ఈ కొత్త ఎలక్ట్రిక్ బైక్!

Related News

హోండా 0 ఆల్ఫా SUV లాంచ్ డేట్ ఫిక్స్.. రేంజ్, ఫీచర్లు చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

కారులో రాకెట్ టెక్నాలజీ.. స్పేస్‌ ఎక్స్‌ తో టెస్లా కొత్త ప్రయోగం చూస్తే మతిపోవాల్సిందే!

మహీంద్రా XUV 3XO సరికొత్త రికార్డు.. 5 లక్షలు దాటిన సేల్స్!

మారుతి కార్లపై అదిరిపోయే డిస్కౌంట్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ. 1.65 లక్షల తగ్గింపు!

హ్యుందాయ్ క్రెటా సరికొత్త రికార్డు.. 15 లక్షలు దాటిన అమ్మకాలు!

ట్రాక్షన్ కంట్రోల్, ఫాస్ట్ ఛార్జింగ్‌.. అప్ డేటెడ్ టీవీఎస్ రైడర్ లో అదిరిపోయే ఫీచర్లు!

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ డ్రైవర్ లేకుండానే నడుస్తుంది.. కొత్త టెక్నాలజీ చూస్తే పిచ్చెక్కాల్సిందే!

మైలేజ్‌లో గ్లాంజా.. బూట్ స్పేస్‌లో ఆల్ట్రోజ్.. ఏ CNG కారు కొంటే బెస్ట్?

Big Stories

Advertisement
×