E-Paper
Advertisement

ఆగ్రహంతో ఊగిపోయిన మల్లారెడ్డి.. నేను ఎమ్మెల్యేనా? కానా? అంటూ.. అధికారులపై ఫైర్!

ఆగ్రహంతో ఊగిపోయిన మల్లారెడ్డి.. నేను ఎమ్మెల్యేనా? కానా? అంటూ.. అధికారులపై ఫైర్!
Advertisement

Mallareddy: మేడ్చల్ నియోజకవర్గంలో నిర్వహించిన ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో చోటుచేసుకున్న పరిణామాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. స్థానిక ఎమ్మెల్యే చమకూర మల్లారెడ్డి అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ సమావేశాన్ని బహిష్కరించడం సంచలనం సృష్టించింది.

అధికారుల తీరుపై ఎమ్మెల్యే ఆగ్రహం

Advertisement

శనివారం కీసరలోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో నియోజకవర్గ స్థాయి ప్రజా పాలన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అయితే, ఉదయం 9:30 గంటలకే ప్రారంభం కావాల్సిన ఈ సమావేశం సకాలంలో మొదలుకాకపోవడంపై మల్లారెడ్డి అసహనం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులను పిలిచి, సమయ పాలన పాటించకపోవడంపై అధికారులను నిలదీశారు. తమకు కనీస గౌరవం ఇవ్వడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రజా పాలన కాదు.. కాంగ్రెస్ పాలన

Advertisement

ఈ సందర్భంగా మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది ‘ప్రజా పాలన కాదు, కేవలం కాంగ్రెస్ పాలన’ అంటూ ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాల్లో స్థానిక ఎమ్మెల్యేలను భాగస్వామ్యం చేయకుండా పక్కన పెట్టడం ఏంటని ప్రశ్నించారు. నియోజకవర్గ అభివృద్ధిలోనూ, లబ్ధిదారుల ఎంపికలోనూ ఎమ్మెల్యేల ప్రమేయం లేకుండా అధికారులే ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

చెక్కుల పంపిణీపై వివాదం

ముఖ్యంగా లబ్ధిదారులకు కనీసం నాలుగు లేదా ఐదు చెక్కులైనా తన చేతుల మీదుగా పంపిణీ చేయడానికి అనుమతించాలని అధికారులను కోరినట్లు మల్లారెడ్డి తెలిపారు. ‘నేను ఇక్కడి స్థానిక ఎమ్మెల్యేను, ప్రజల చేత ఎన్నుకోబడ్డ వాడిని. కనీసం ఆ మాత్రం ప్రాధాన్యత కూడా ఇవ్వరా?’ అని ఆయన ప్రశ్నించారు. తన అభ్యర్థనను అధికారులు పట్టించుకోకపోవడంతో తీవ్ర అవమానానికి గురయ్యానని భావించిన ఆయన, సమావేశం మధ్యలోనే అక్కడి నుంచి నిరసనగా వెళ్లిపోయారు.

ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రోటోకాల్ పాటించడం లేదని, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్న చోట ఉద్దేశపూర్వకంగానే ఇలాంటి ఇబ్బందులు సృష్టిస్తున్నారని మల్లారెడ్డి వర్గీయులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటన మేడ్చల్ రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

Also Read: రన్నింగ్ బైక్ పై అత్త, అల్లుడి మధ్య గొడవ..హెల్మెట్‌తో అత్తను చంపిన అల్లుడు

Related News

అనిరుధ్ – కావ్యా మారన్ పెళ్లి రిసెప్షన్.. సీఎం రేవంత్, కేటీఆర్‌కు ఆహ్వానం!

ఎల్‌నినో ఎఫెక్ట్‌.. తెలుగు రాష్ట్రాలకు రానున్న అతిపెద్ద గండం ఇదే?

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వింత దృశ్యం.. మిరప తోటల్లో సినీ తారల ఫ్లెక్సీలు!

కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు!

నకిలీ యూఎల్‌సీ పత్రాలతో రిజిస్ట్రేషన్లు దందా కలకలం

తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం.. మారనున్న ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు!

తెలంగాణలో హ్యుందాయ్ బిగ్ ప్లాన్.. రూ.8,528 కోట్లతో మెగా ప్రాజెక్ట్.. సీఎం రేవంత్ కీలక విజ్ఞప్తి!

నీ డేటా మొత్తం నా దగ్గర ఉంది పరేషాన్ కాకు.. కేటీఆర్‌ పై గజ్జెల కాంతం ఫైర్!

Big Stories

Advertisement
×