E-Paper
Advertisement

ఈ ప్రైస్‌లో ఇలాంటి TVs దొరకడం ఇంపాజిబుల్.. రూ.11 వేలకే గూగుల్ సాఫ్ట్‌వేర్, డాల్బీ సౌండ్‌తో థామ్సన్ కొత్త టీవీలు!

ఈ ప్రైస్‌లో ఇలాంటి TVs దొరకడం ఇంపాజిబుల్.. రూ.11 వేలకే గూగుల్ సాఫ్ట్‌వేర్, డాల్బీ సౌండ్‌తో థామ్సన్ కొత్త టీవీలు!
Advertisement

Thomson QLED TV: నేటి ఆధునిక యుగంలో ఒక మంచి స్మార్ట్‌ఫోన్ కొనాలంటేనే ధర రూ.20వేలు దాటిపోతుంది. అలాంటిది కేవలం రూ.11వేలకే 32 ఇంచుల టీవీ వస్తుందంటే టెక్ నిపుణులు అంతా ఆశ్చర్యపోతున్నారు. అవును.. మీరు విన్నది నిజమే! ప్రముఖ థామ్సన్ టీవీల సంస్థ తక్కువ ధరలో ప్రీమియం ఫీచర్లు ఇచ్చే సరికొత్త QLED స్మార్ట్ టీవీలను ఇండియాలో లాంచ్ చేసింది. గూగుల్ టీవీ సాఫ్ట్‌వేర్, అదిరిపోయే సౌండ్, పిక్చర్ క్వాలిటీతో వచ్చిన ఈ టీవీలు బడ్జెట్ ప్రియులను ఊరిస్తోంది.

అద్భుతమైన పిక్చర్ క్వాలిటీ:

థామ్సన్ తమ కొత్త సిరీస్‌లో 32, 40, 43 ఇంచుల సైజుల్లో టీవీలను తీసుకొచ్చింది. ఈ టీవీలకు అంచులు ఉండవు. దీనివల్ల సినిమా చూస్తున్నప్పుడు స్క్రీన్ చాలా పెద్దదిగా, రియలిస్టిక్‌గా కనిపిస్తుంది. పైగా దీనిలో వాడిన QLED టెక్నాలజీ వల్ల కలర్స్ చాలా నేచురల్‌గా, స్పష్టంగా ఉంటాయి. తక్కువ ధరలో కూడా మంచి క్వాలిటీ విజువల్స్ కావాలనుకునే వారికి ఈ టీవీలు ఉత్తమం.

స్మార్ట్ ఫీచర్లతో ఫుల్ ఎంటర్టైన్‌మెంట్:

Advertisement

ఇక స్మార్ట్ ఫీచర్ల విషయానికి వస్తే.. ఇవి లేటెస్ట్ గూగుల్ టీవీ 5.0 వెర్షన్‌తో పనిచేస్తాయి. అంతేకాదు.. నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, యూట్యూబ్ వంటి యాప్స్ అన్నీ దీనిలో ఆల్రెడీ ఉంటాయి. గూగుల్ ప్లే స్టోర్ నుంచి దాదాపు పదివేల యాప్స్, గేమ్స్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దీంతోపాటు మనకు నచ్చిన సినిమా చూడాలంటే టైప్ చేయాల్సిన పనిలేదు. వాయిస్ ద్వారా Google Assistantతో చెప్పొచ్చు. అదే మనకు కావాల్సినవి వెతికి పెడుతుంది. అలాగే మన ఫోన్‌లోని ఫొటోలు, వీడియోలను టీవీలో చూసుకోవడానికి క్రోమ్‌కాస్ట్ ఫీచర్ కూడా ఉంది.

Also Read: 200MP కెమెరా, 9000mAh బ్యాటరీ.. OnePlus 16 ఫీచర్లకు పిచ్చోళ్లు అయిపోయారు టెక్ ప్రియులంతా!

ఆడియో క్వాలిటీ నెక్ట్స్ లెవల్:

Advertisement

బొమ్మ ఎంత బాగున్నా సౌండ్ సరిగ్గా లేకపోతే ఎంత మంచి సినిమా చూసినా కిక్కు ఉండదు కదా. కాబట్టి.. ఈ టీవీల్లో 40W పవర్‌ఫుల్ స్పీకర్లను పెట్టారు. దీనికి డాల్బీ ఆడియో తోడవ్వడంతో సినిమా హాల్‌లాంటి అనుభూతి కలుగుతుంది. ఇక వై-ఫై, బ్లూటూత్ 5.0తో పాటు మూడు HDMI పోర్ట్స్, రెండు USB పోర్ట్స్ ఇచ్చారు. దీంతో గేమింగ్ కన్సోల్స్, సెట్ టాప్ బాక్స్‌లను ఈజీగా కనెక్ట్ చేసుకోవచ్చు. పర్ఫార్మెన్స్ స్మూత్‌గా ఉండటానికి 1GB RAM, 8GB స్టోరేజీని కూడా అందించారు.

మిడిల్‌క్లాస్ ఫ్యామిలీస్‌కు పండగే:

సాధారణంగా QLED టీవీలు అంటే ఖరీదైనవి అనుకుంటారు చాలామంది. కానీ ఈ థామ్సన్ 32 ఇంచుల టీవీ కేవలం రూ.10,999లకే లభిస్తోంది. అలాగే 40 ఇంచుల మోడల్ ధర రూ.15,999 కాగా, 43 ఇంచుల టీవీ ధర రూ.16,999గా ఉంది. ఫ్లిప్‌కార్ట్‌లో కొనేటప్పుడు కొన్ని బ్యాంక్ ఆఫర్లు కూడా వాడితే ఇంకా తక్కువకే వచ్చే అవకాశం ఉంది. తక్కువ బడ్జెట్‌లో గ్రాండ్ లుక్ ఉన్న టీవీ కావాలనుకునే వారు ఖచ్చితంగా వీటిపై ఒక లుక్కేయొచ్చు.

Also Read: రూ.40వేల లోపు బెస్ట్ LG ఫ్రిజ్‌లు.. అదిరిపోయే కూలింగ్, భారీగా కరెంటు ఆదా, ఎక్కడంటే?

Related News

అదే జరిగితే.. ఈ నగరాలన్నీ కనుమరుగు? వరద ఎన్ని ‘అంతస్తుల ఎత్తు’లో దూసుకెళ్తుందంటే?

స్టైలిష్ లుక్..అల్టిమేట్ సౌండ్,యూత్‌ను ఫిదా చేస్తున్న సౌండ్ బార్

పాకెట్ సైజ్ బడ్జెట్ పవర్ బ్యాంక్..రూ.898కే బెస్ట్ మోడల్

నీళ్లు, చెత్తను ఒకేసారి శుభ్రం చేసే..అద్భుతమైన టూల్!

రూ.10వేలకే.. శామ్‌సంగ్ వాషింగ్ మెషీన్,ఆఫర్ కొన్ని రోజులే!

రూ.5,290 ధరకే 30W బేస్ స్మార్ట్ టీవీ..ఇక ఇల్లు దద్దరిల్లిపోవాల్సిందే !

రూ.7,490 కే 7.5 కేజీల కెపాసిటీనా? ఇంతమంచి వాషింగ్ మెషీన్ అస్సలు మిస్సవ్వొద్దు

చార్జింగ్ టెన్షన్ లేదు, లుక్ అద్దిరిపోతుంది.. ఈ ట్రెండింగ్ స్మార్ట్‌వాచ్ మీకోసమే!

Big Stories

Advertisement
×