E-Paper
Advertisement

టాటా మోటార్స్ సర్ప్రైజ్.. 7 సీటర్ ఎలక్ట్రిక్ సఫారీ వచ్చేస్తోంది!

టాటా మోటార్స్ సర్ప్రైజ్.. 7 సీటర్ ఎలక్ట్రిక్ సఫారీ వచ్చేస్తోంది!
Advertisement

Tata to Launch Safari EV Soon: టాటా మోటార్స్ త్వరలోనే భారతీయ మార్కెట్లో పెద్ద ఎలక్ట్రిక్ కారును తీసుకురానుంది. ఈసారి కంపెనీ పూర్తి కుటుంబానికి సరిపోయే 7-సీటర్ SUVపై ఫోకస్ పెట్టింది. పండుగ సీజన్‌ ను దృష్టిలో పెట్టుకుని టాటా సఫారీ ఈవీని విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మోడల్, టాటా నుంచి వచ్చే మొదటి 7-సీటర్ ఎలక్ట్రిక్ SUVగా నిలవబోతోంది.

ఎలక్ట్రిక్ విభాగంలో సత్తా చాటుతున్న టాటా మోటార్స్

ఇప్పటికే టాటా ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో మంచి స్థానం సంపాదించుకుంది. నెక్సాన్ EV, టిగోర్ EV లాంటి మోడళ్లతో వినియోగదారుల నమ్మకాన్ని పొందిన ఈ కంపెనీ, ఇప్పుడు మరింత ప్రీమియం సెగ్మెంట్‌ లోకి అడుగుపెడుతోంది. సఫారీ ఈవీ ద్వారా పెద్ద కుటుంబాల కోసం, ఎక్కువ స్పేస్, కంఫర్ట్ కోరుకునే వారికి  కొత్త ఆప్షన్ ఇవ్వాలని భావిస్తోంది.

యాక్టి.ఈవీ+ ప్లాట్‌ ఫారమ్‌ కొత్త సఫారీ ఈవీ రెడీ

Advertisement

కొత్త సఫారీ ఈవీ.. యాక్టి.ఈవీ+ ప్లాట్‌ఫారమ్‌పై తయారుకానుంది. ఇదే ప్లాట్‌ ఫారమ్ హారియర్ ఈవీకి కూడా ఉపయోగించారు. సో, ఈ రెండు మోడళ్ల మధ్య కొన్ని పోలికలు ఉండే అవకాశం ఉంది. అయితే, సఫారీ పెద్ద వాహనం కావడంతో.. మరింత విశాలమైన క్యాబిన్, మూడు వరుసల సీట్లతో రానుంది.

సఫారీ ఈవీ డిజైన్ గురించి..

డిజైన్ పరంగా చూస్తే..  సఫారీ ఈవీ చాలా వరకు దాని పెట్రోల్, డీజిల్ వెర్షన్‌లానే కనిపించే అవకాశం ఉంది. కానీ, ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రత్యేకంగా ఉండే కొన్ని మార్పులు ఉంటాయి.  ముందు భాగంలో గ్రిల్ అవసరం లేకపోవడం వల్ల అది క్లోజ్ చేసిన డిజైన్‌ లో ఉండవచ్చు. అలాగే కొత్త బంపర్లు, ఏరోడైనమిక్ అల్లాయ్ వీల్స్ వంటి చిన్న మార్పులతో రావచ్చు.

ఇంటీరియర్ గురించి..

Advertisement

ఇంటీరియర్ విషయానికి వస్తే, ఇందులో ప్రీమియం ఫీల్‌ ను కొనసాగించేలా డిజైన్ చేచేశారు. పెద్ద టచ్‌ స్క్రీన్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, మల్టీ ఫంక్షన్ స్టీరింగ్ వీల్ లాంటి ఫీచర్లు ఉండే అవకాశం ఉంది. మూడు వరుసల సీటింగ్ ఉండటం వల్ల, కుటుంబ ప్రయాణాలకు మరింత అనుకూలంగా ఉంటుంది.

బ్యాటరీ గురించి..

బ్యాటరీ, పనితీరు పరంగా కూడా సఫారీ ఈవీ మరింత పవర్ ఫుల్ గా ఉండనుంది. హారియర్ ఈవీ మాదిరిగానే 65 kWh,  75 kWh బ్యాటరీ ఆప్షన్లు అందించే అవకాశం ఉంది. ఇందులో పెద్ద బ్యాటరీ ఉన్న వేరియంట్‌ లో డ్యూయల్ మోటార్ సిస్టమ్ ఉండి, ఆల్ వీల్ డ్రైవ్ సపోర్ట్ కూడా ఉండొచ్చు. అయితే, సఫారీ బరువు ఎక్కువగా ఉండటం వల్ల, అదే బ్యాటరీతో వచ్చినా రేంజ్ కొద్దిగా తగ్గే అవకాశం ఉంది.

ఏ కార్లు పోటీ ఇస్తుందంటే?

సఫారీ ఈవీ మార్కెట్లోకి వచ్చిన తర్వాత,  మహీంద్రా లాంటి కంపెనీల నుంచి వచ్చే ఎలక్ట్రిక్ SUVలకు గట్టి పోటీ ఇవ్వనుంది. ముఖ్యంగా 7-సీటర్ ఎలక్ట్రిక్ SUV సెగ్మెంట్‌ లో ఇది ఒక కొత్త స్టాండర్డ్‌ ను సెట్ చేసే అవకాశం ఉంది.

Read Also: కార్ల ధరలు పెంచిన మహీంద్రా.. ఏ మోడళ్లపై ఎఫెక్ట్ ఉంటుందంటే?

Related News

వోక్స్‌ వ్యాగన్ కార్లపై కళ్లు ఆఫర్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ.6 లక్షల తగ్గింపు!

సింగిల్ ఛార్జ్ తో 243 కి.మీ రేంజ్.. సింపుల్ వేవ్ సూపర్ స్కూటర్ వచ్చేసింది!

2027లో కొత్త నెక్సాన్.. డిజైన్ నుంచి ఇంజిన్ వరకు అన్నీ మారనున్నాయా?

5 ఏళ్ల తర్వాత పజెరో రీఎంట్రీ.. కొత్త లుక్‌తో మిత్సుబిషి బిగ్ సర్‌ప్రైజ్!

EV కొనేముందు ఈ విషయం చెక్ చేశారా? లేదంటే ఇబ్బందులు తప్పవు!

టాటా దూకుడు.. మహీంద్రా జోరు! ఆగస్టు అమ్మకాల్లో ఎవరు టాప్?

హోండా కొత్త ఈ-స్కూటర్‌కు పేటెంట్.. స్పీడ్ ఎంతో తెలిస్తే వావ్ అనాల్సిందే!

100 కి.మీ స్పీడ్.. 200 కి.మీ రేంజ్.. ఆంపియర్ కొత్త ఎలక్ట్రిక్ బైక్‌కు పేటెంట్!

Big Stories

Advertisement
×