E-Paper
Advertisement

కార్ల ధరలు పెంచిన మహీంద్రా.. ఏ మోడళ్లపై ఎఫెక్ట్ ఉంటుందంటే?

కార్ల ధరలు పెంచిన మహీంద్రా..  ఏ మోడళ్లపై ఎఫెక్ట్ ఉంటుందంటే?
Advertisement

Mahindra Hikes Vehicle Prices: మహీంద్రా కంపెనీ వాహనాలు మరింత ఖరీదు కానున్నాయి. తన వాహనాల ధరలను పెంచాలాని తాజాగా కంపెనీ నిర్ణయం తీసుకుంది. ఈ కొత్త ధరలు ఏప్రిల్ 6 నుంచి అమల్లోకి రానున్నాయి. కంపెనీ తెలిపిన ప్రకారం, మొత్తం SUVలు, కమర్షియల్ వాహనాలపై గరిష్టంగా 2.5 శాతం వరకు ధరలు పెరగనున్నాయి. అయితే, సగటున చూస్తే ఈ పెంపు సుమారు 1.6 శాతం వరకు ఉంటుంది.

ధరల పెంపునకు కారణం ఏంటి?

మహీంద్రా కార్ల ధరల పెంపుకు ప్రధాన కారణం ముడిసరుకు ఖర్చులు పెరగడం, తయారీ వ్యయాలు ఎక్కువ కావడం అని కంపెనీ వెల్లడించింది. ప్రస్తుతం ఆటోమొబైల్ రంగంలో ఉత్పత్తి ఖర్చులు పెరుగుతుండటంతో, ఈ భారాన్ని కొంతవరకు వినియోగదారులపై మోపాల్సి వచ్చిందని మహీంద్రా వివరణ ఇచ్చింది.

ఏ వాహనాలపై పెంపు ఎఫెక్ట్ ఉంటుందంటే?

Advertisement

ఈ కొత్త ధరలు కంపెనీకి చెందిన అన్ని వాహనాలకు వర్తిస్తాయి. అంటే, పెట్రోల్, డీజిల్ ఇంజిన్ వాహనాలే కాకుండా, ఎలక్ట్రిక్ కార్లపై కూడా ఈ పెంపు ప్రభావం ఉంటుంది. ముఖ్యంగా XUV 3XO EV, XEV 9S, BE 6, XEV 9e లాంటి ఎలక్ట్రిక్ మోడళ్ల ధరలు కూడా పెరగనున్నాయి. దీంతో కొత్తగా కారు కొనాలనుకునే వారికి కొంత అదనపు భారం పడే అవకాశం ఉంది.

ధరల పెంపు నుంచి వాటికి మినహాయింపు

ఇటీవల విడుదలైన XUV7XO విషయంలో కంపెనీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మోడల్‌కు సంబంధించిన మొదటి 40,000 బుకింగ్‌ లు ఇప్పటికే ప్రైస్ ప్రొటెక్షన్ లో ఉన్నాయి. అంటే, ఆ బుకింగ్‌లు పూర్తిగా డెలివరీ అయ్యే వరకు ఈ కొత్త ధరల పెంపు వాటికి వర్తించదు. తర్వాతి బుకింగ్‌లకు మాత్రమే కొత్త ధరలు అమల్లోకి వస్తాయి. ఈ ధరల పెంపు కేవలం ఖర్చుల కారణంగానే జరుగుతోంది. వాహనాల ఫీచర్లు, పనితీరు, మెకానికల్ అంశాల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. అంటే, తాజాగా కొనుగోలు చేసే కారు మునుపటిలాగే ఉంటుంది. కానీ, ధర మాత్రమే కొంచెం ఎక్కువ అవుతుంది.

Advertisement

ఇటీవల మహీంద్రా కొన్ని స్పెషల్ ఎడిషన్ మోడళ్లను కూడా మళ్లీ మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. BE 6 బ్యాట్‌మాన్ ఎడిషన్, XEV 9e సినీలక్స్ ఎడిషన్ వంటి వాహనాలు మళ్లీ అందుబాటులోకి వచ్చాయి. వీటి డెలివరీలను కూడా కంపెనీ ప్రారంభించింది. మున్ముందు విడుదల చేయబోయే కొత్త మోడళ్లపై కూడా కంపెనీ పని చేస్తోంది. విజన్ S, థార్ ఫేస్‌లిఫ్ట్, స్కార్పియో N ఫేస్‌లిఫ్ట్ వంటి వాహనాలను ప్రస్తుతం పరీక్షిస్తున్నారు. ఇవి త్వరలో మార్కెట్‌లోకి వచ్చే అవకాశం ఉంది.

అమ్మకాల్లో సత్తా చాటిన మహీంద్రా

అటు అమ్మకాల పరంగా కూడా మహీంద్రా సత్తా చాటుతోంది. మార్చి 2026లో కంపెనీ 61,000 కంటే ఎక్కువ కార్లను అమ్మింది. దేశంలో అత్యధిక వాహనాలు అమ్మే కంపెనీల జాబితాలో మారుతి సుజుకి, టాటా తర్వాత మూడవ స్థానంలో నిలిచింది.

Read Also: దేశీ మార్కెట్ లోకి క్రేజీ విన్ ఫాస్ట్ ఈవీ ఎంట్రీ, దీని ప్రత్యేకత ఏంటో తెలుసా?

Related News

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

లాంచ్‌కు ముందే క్రేజీ డీటైల్స్ లీక్.. కొత్త బ్రెజ్జాలో ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

టీవీఎస్ నుంచి సూపర్ సర్‌ ప్రైజ్.. ఒకేసారి 3 మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

కొత్త బ్రెజ్జా To హిలక్స్.. 10 రోజుల్లో 3 క్రేజీ మోడల్స్ ఎంట్రీ!

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

EV బ్యాటరీల్లో ఏది సేఫ్? కొనుగోలు చేసే ముందు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

Big Stories

Advertisement
×