E-Paper
Advertisement

ఇండియాలో ఫస్ట్ పెట్రోల్ బంక్, వావ్.. ఆ రోజుల్లో ఇలా ఉండేదా?

ఇండియాలో ఫస్ట్ పెట్రోల్ బంక్, వావ్.. ఆ రోజుల్లో ఇలా ఉండేదా?
Advertisement

India’s First Petrol Pump Interesting Facts: భారత్ లో తొలి పెట్రోల్ బంక్ ప్రారంభం.. దేశంలో ఆటోమొబైల్ ఇండస్ట్రీ అభివృద్ధితో లింకై ఉంది. కార్లు తొలిసారి దేశంలోకి వచ్చిన కాలంలో ఫ్యూయెల్ అందుబాటులో ఉండటం పెద్ద సమస్యగా ఉండేది. ఆ సమయంలో పెట్రోల్‌ ను ప్రత్యేకంగా బంక్‌ లలో అమ్మే వ్యవస్థ ఇంకా ఏర్పడలేదు. కానీ, ఆ తర్వాత కొద్ది కాలానికి చిన్న చిన్న బంకులు వచ్చాయి. కానీ, అప్పట్లో ఇలా ఉండేవి కాదు.

1905లో తొలి పెట్రోల్ బంక్ ప్రారంభం

దేశంలో తొలి పెట్రోల్ బంక్‌ ను 20వ శతాబ్దం ప్రారంభంలో అందుబాటులోకి తీసుకొచ్చారు. సుమారు 1905 ప్రాంతంలో ఇప్పటి ముంబై, అప్పటి బాంబేలో ఏర్పాటు చేశారు. ఆ కాలంలో బర్మా-షెల్ ప్రస్తుతం భారత్ పెట్రోలియం, స్టాండర్డ్ ఆయిల్ లాంటి కంపెనీలు ఇంధన సరఫరా చేసేవి. మొదట్లో ఇవి పెద్ద పెట్రోల్ స్టేషన్లలా కాకుండా చిన్న స్థాయి ప్యూయెల్ స్టోరేజ్  కేంద్రాల్లా ఉండేవి.

మాన్యువల్ గా పెట్రోల్ పోసే వ్యవస్థ

Advertisement

ఆ రోజుల్లో పెట్రోల్ పంపులు ఇప్పటిలా ఆటోమేటిక్‌ గా ఉండేవి కావు. పెట్రోల్‌ ను పెద్ద డ్రమ్‌ లలో నిల్వ ఉంచి, చేతితో పని చేసే పంపుల ద్వారా కార్లలో నింపేవారు. కొన్నిసార్లు కస్టమర్లు బాటిళ్లు, కేన్లలో కూడా పెట్రోల్ కొనుక్కుని వెళ్లేవారు. అంటే, ఇప్పుడు మనం చూసే విధంగా ఫ్యూయల్ స్టేషన్‌ లో వాహనం నిలిపి నిమిషాల్లో ఫుల్ ట్యాంక్ చేయించుకునే సౌకర్యం అప్పట్లో ఉండేది కాదు.

అత్యంత సాధారణంగా..

Advertisement

అప్పటి పెట్రోల్ బంక్ లు పని విధానం చాలా సాధారణంగా ఉండేది. ఒక చిన్న గోడౌన్ లాంటి లాంటి ప్రదేశంలో ప్యూయెల్  నిల్వ చేసి, అవసరమైనప్పుడు చేతితో పంప్ చేసి ఇచ్చేవాళ్లు. కొలతల్లో ఏమాత్రం తేడా ఉండేది కాదు. అయితే, భద్రతా ప్రమాణాలు కూడా ఇప్పటిలా కఠినంగా ఉండేవి కావు. అందుకే ప్రమాదాల అవకాశాలు కూడా ఎక్కువగా ఉండేవి. కానీ, కాలక్రమేణా,  దేశంలో వాహనాల సంఖ్య పెరుగుతూ రావడంతో పెట్రోల్ బంక్‌ల అవసరం కూడా పెరిగింది. ఆధునిక ఫ్యూయల్ స్టేషన్లు ఏర్పడడం ప్రారంభమైంది. ఆటోమేటిక్ పంపులు, మీటర్లు, డిజిటల్ డిస్ ప్లేలు, భద్రతా నిబంధనలు మారుతూ వచ్చాయి. తర్వాత ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్తాన్ పెట్రోలియం లాంటి ప్రభుత్వ రంగ సంస్థలు కూడా ఈ రంగంలో కీలక పాత్ర పోషించాయి.

డ్రమ్‌ల నుంచి డిజిటల్ వరకూ..

దేశంలో మొదటి పెట్రోల్ బంక్ చాలా సాధారణంగా ప్రారంభమైనా, అది దేశంలో రవాణా రంగ అభివృద్ధికి పునాది వేసింది. చిన్న డ్రమ్‌ లతో ప్రారంభమైన ఈ వ్యవస్థ,  ఇప్పుడు అత్యాధునిక సదుపాయాలతో ఉన్న భారీ నెట్‌ వర్క్‌ గా మారింది.  దేశ అభివృద్ధి ప్రయాణంలో కీలక పాత్ర పోషించింది.

Read Also: కారులోనే హోం థియేటర్, కళ్లు చెదిరే ఇంటీరియర్.. వారెవ్వా ఏముంది భయ్యా!

Related News

క్లాసిక్ లుక్.. మోడ్రన్ టెక్నాలజీ.. ట్రయంఫ్ బోన్నెవిల్ T40 వచ్చేసింది!

టెస్లా రోడ్‌స్టర్‌లో ఎయిర్ థ్రస్టర్లు.. ఫెరారీకి ఈ ఆలోచన 2018లో వచ్చిందా?

రెనాల్ట్ డస్టర్ హైబ్రిడ్ vs గ్రాండ్ విటారా vs టయోటా హైరైడర్.. వీటిలో ఏది కొనాలంటే?

స్కోడా కార్లపై అదిరిపోయే ఆఫర్లు.. కైలాక్‌పై ఏకంగా రూ.90 వేల తగ్గింపు!

డౌన్ పేమెంట్ లేకుండానే బైక్ కొనేయండి.. జావా, యెజ్డీ అదిరిపోయే ఫెస్టివ్ ఆఫర్లు!

ఏకంగా 4 SUVలు, ఓ పికప్ ట్రక్.. జీప్ ప్లాన్ మామూలుగా లేదుగా!

విడా నుంచి కొత్త ఎలక్ట్రిక్ బైక్.. జస్ట్ 100 యూనిట్లే!

కొత్త రెనాల్ట్ డస్టర్ హైబ్రిడ్ వచ్చేసింది, మైలేజ్ ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

Big Stories

Advertisement
×