E-Paper
Advertisement

కారులోనే హోం థియేటర్, కళ్లు చెదిరే ఇంటీరియర్.. వారెవ్వా ఏముంది భయ్యా!

కారులోనే హోం థియేటర్, కళ్లు చెదిరే ఇంటీరియర్.. వారెవ్వా ఏముంది భయ్యా!
Advertisement

Huawei-JAC Launch Maextro S80: ప్రపంచ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ కార్ల వినియోగం పెరిగింది. పెట్రో కార్లకు బదులుగా పలు ఆటో మోబైల్ దిగ్గజాలు ఇప్పటికే ఎలక్ట్రిక్ కార్ల తయారీని విస్తరిస్తున్నాయి. అందులో భాగంగా తయారైన లగ్జరీ ఈవీ కారు మాక్స్‌ ట్రో S800. ఈ కారును  టెక్నాలజీ దిగ్గజం  హవాయి(Huawei), చైనా ఆటోమేకర్ JAC కలిసి అత్యంత విలాసవంతమైన ఎలక్ట్రిక్ సెడాన్ గా రూపొందించాయి. ప్రీమియం కార్ల విభాగాన్ని లక్ష్యంగా చేసుకుని తయారు చేసిన ఈ కారు, ధర పరంగా చాలా ఖరీదు ఉంటుంది. దీని ప్రారంభ ధర సుమారు 100,000 డాలర్లుగా ఉంటుంది. మెర్సిడెస్ మేబ్యాక్ ఎస్ క్లాస్ లాంటి లగ్జరీ కార్లకు ఇది గట్టి పోటీ ఇస్తుంది.

మాక్స్‌ ట్రో S800 ఇంజిన్ గురించి..

ఈ కారు పనితీరు అద్భుతంగా ఉంటుంది. మూడు ఎలక్ట్రిక్ మోటార్లతో పాటు 1.5-లీటర్ ఇంజన్‌ ను కలిగి ఉంటుంది. మొత్తం 850 హార్స్‌ పవర్ వరకు శక్తిని ఉత్పత్తి చేస్తుంది. హైబ్రిడ్ వెర్షన్‌ లో దాదాపు 1,200 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇస్తుంది. సుదూర ప్రయాణాలకు ఈ కారు అనుకూలంగా ఉంటుంది.

విలాసవంతమైన అనుభూతి

Advertisement

డిజైన్ పరంగా చూస్తే, మాక్స్‌ ట్రో S800 విలాసవంతమైన అనుభూతిని ఇస్తుంది. దాదాపు 5.5 మీటర్ల పొడవుతో, ఈ సెడాన్‌ లో ప్రతి అంశం కంఫర్ట్‌ ను దృష్టిలో ఉంచుకుని రూపొందించబడింది. లోపల నక్షత్రాల్లా మెరిసే సీలింగ్, ప్రీమియం సెమీ అనిలిన్ లెదర్ సీట్లు, క్రిస్టల్ అలంకరణ లాంటి ఫీచర్లు ఆకట్టుకుంటాయి. యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ సిస్టమ్ వల్ల ప్రయాణం నిశ్శబ్దంగా, ప్రశాంతంగా ఉంటుంది.

కారు లోపలే హోం థియేటర్

టెక్నాలజీ విషయంలో ఈ కారు ఫ్యూచరిస్టిక్ గా ఉంటుంది. హవాయి రూపొందించిన హార్మనీ ALPS స్మార్ట్ కాక్‌ పిట్‌ తో  పని చేస్తుంది. ఇందులో 43 స్పీకర్లతో కూడిన హైక్వాలిటీ సౌండ్ సిస్టమ్, 40 అంగుళాల పెద్ద ప్రైవసీ స్క్రీన్,  జీరో గ్రావిటీ సీట్ల లాంటి ఫీచర్లు ఉన్నాయి. ప్రయాణికులకు పూర్తి ఎంటర్‌ టైన్‌ మెంట్, సౌకర్యం అందించేలా అన్ని ఏర్పాట్లు ఉన్నాయి.

స్పెషల్ అట్రాక్షన్ గా క్రాబ్ వాక్  టెక్నాలజీ

Advertisement

ఈ కారులో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన మరో ఫీచర్ క్రాబ్ వాక్  టెక్నాలజీ. ఇంటెలిజెంట్ ఫోర్ వీల్ స్టీరింగ్ సహాయంతో వాహనం పక్కకు కూడా ప్రయాణిస్తుంది. క్లిష్టమైన పార్కింగ్ పరిస్థితుల్లో చాలా ఉపయోగపడుతుంది.  అంతేకాదు,  ఫింగర్‌ ప్రింట్ సేఫ్, చిన్న ఫ్రిజ్, వెనుక ప్రయాణికుల ప్రైవసీ కోసం వైట్ నాయిస్ సిస్టమ్ లాంటి సౌకర్యాలు కూడా ఉన్నాయి.

జస్ట్ 12 నిమిషాల్లో 80 శాతం ఛార్జింగ్

ఛార్జింగ్ పరంగా కూడా ఇది చాలా వేగంగా ఉంటుంది. కేవలం 12 నిమిషాల్లో 10% నుంచి 80% వరకు బ్యాటరీని ఛార్జ్ చేసుకునే సామర్థ్యం ఉంది. ఇది రోజువారీ వినియోగంలో సమయాన్ని బాగా ఆదా చేస్తుంది. మొత్తంగా ఈ కారు ఫ్యూచరిస్టిక్  కార్లకు ఒక కొత్త ప్రమాణాన్ని సెట్ చేస్తోంది.

Read Also: EV ఛార్జింగ్‌పై ఉన్న 7 అపోహలు.. అసలు నిజం ఏంటంటే?

Related News

వోక్స్‌ వ్యాగన్ కార్లపై కళ్లు ఆఫర్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ.6 లక్షల తగ్గింపు!

సింగిల్ ఛార్జ్ తో 243 కి.మీ రేంజ్.. సింపుల్ వేవ్ సూపర్ స్కూటర్ వచ్చేసింది!

2027లో కొత్త నెక్సాన్.. డిజైన్ నుంచి ఇంజిన్ వరకు అన్నీ మారనున్నాయా?

5 ఏళ్ల తర్వాత పజెరో రీఎంట్రీ.. కొత్త లుక్‌తో మిత్సుబిషి బిగ్ సర్‌ప్రైజ్!

EV కొనేముందు ఈ విషయం చెక్ చేశారా? లేదంటే ఇబ్బందులు తప్పవు!

టాటా దూకుడు.. మహీంద్రా జోరు! ఆగస్టు అమ్మకాల్లో ఎవరు టాప్?

హోండా కొత్త ఈ-స్కూటర్‌కు పేటెంట్.. స్పీడ్ ఎంతో తెలిస్తే వావ్ అనాల్సిందే!

100 కి.మీ స్పీడ్.. 200 కి.మీ రేంజ్.. ఆంపియర్ కొత్త ఎలక్ట్రిక్ బైక్‌కు పేటెంట్!

Big Stories

Advertisement
×