E-Paper
Advertisement

Buying Car: కారు కొనాలనుకునే వారికి ఆ మూడు రోజులు బెస్ట్, ఊహించని డిస్కౌంట్లు పొందవచ్చు!

Buying Car: కారు కొనాలనుకునే వారికి ఆ మూడు రోజులు బెస్ట్, ఊహించని డిస్కౌంట్లు పొందవచ్చు!
Advertisement

దసరా, దీపావళి లాంటి రోజుల్లో చాలా మంది కార్లు కొనాలనుకుంటారు. ఎందుకంటే, పండుగల సందర్భంగా ఆఫర్లు, డిస్కౌంట్లు లభిస్తాయని భావిస్తారు. అయితే, చాలా మందికి తెలియని ఓ ఆసక్తికర విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. సంవత్సరం మొత్తంలో ముఖ్యంగా మూడు డేట్స్ ఉంటాయి. ఆ రోజు కార్లు కొంటే భారీగా డిస్కౌంట్లు పొందే అవకాశం ఉంది. ఇంతకీ ఆ డేట్స్ కు ఉన్న ప్రత్యేకత ఏంటి? ఎందుకు డిస్కౌంట్లు లభిస్తాయనేది ఇప్పుడు తెలుసుకుందాం..

⦿ సెప్టెంబర్ 30

సెప్టెంబర్ 30న హాఫ్ ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ అవుతోంది. ఫైనాన్స్ రంగంలో ఉండే వారికి ఈ విషయం బాగా తెలుసు. ఈ రోజు వరకు అమ్మే కార్ల విలువ హాఫ్ ఇయర్ లోపల కౌంట్ అవుతుంది. ఆ రోజు చాలా మంది కార్లు కొనుగోలు చేస్తారు. ఈ రోజు కారు కొనుగోలు చేయడం వల్ల కారు డెప్రిషియేషన్ కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు. ఆ రోజు చాలా డిస్కౌంట్స్ కూడా వస్తాయి. కారు డీలర్స్ కూడా టార్గెట్స్ ఉంటాయి. వాటిని పూర్తి చేసేందుకు డిస్కౌంట్స్ అందిస్తారు. తక్కువ ధరకే కారు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది.

⦿ డిసెంబర్ 31

Advertisement

ఏడాదిలో ఎక్కువ డిస్కౌంట్ పొందే మరో డేట్ ఉంది. అదీ ప్లాట్ డిస్కౌంట్ లభిస్తుంది. అదే డిసెంబర్ 31. ఏడాదిలో అత్యంత ఎక్కువ డిస్కౌంట్ ఈ రోజున లభిస్తుంది. దానికి కారణం, 31 డిసెంబర్ లోగా ఆ కారు సేల్ కాకపోతే,  జనవరి 1 నుంచి పాతకారు అవుతుంది. కొత్త సంవత్సరంలో చాలా మంది న్యూ మానుఫ్యాక్చరింగ్ కార్లు అడుగుతారు. అందుకే, 31 డిసెంబర్ లోగా ఆ ఏడాది కార్లను పూర్తిగా అమ్మేందుకు ప్రయత్నిస్తారు. పాత స్టాక్ అంతా ఖాళీ చేసేందుకు ఆయా కంపెనీలు డిస్కౌంట్లు, ఆఫర్లు అందుబాటులో ఉంచుతాయి. ఆసక్తి ఉన్న వాళ్లు తక్కువ ధరలకే కార్లు కొనుగోలు చేస్తారు.

⦿ మార్చి 31

ఎక్కువ డిస్కౌంట్లు పొందే మరో డేట్ మార్చి 31.  ఈ రోజుతో ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ అవుతుంది. అన్ని కంపెనీలు, వారి ప్రాఫిట్స్, సేల్స్ ను ఎక్కువగా చూపించాలని భావిస్తారు. అందుకే, ఎక్కువ డిస్కౌంట్స్, ఆఫర్లు అందించి ఎక్కువ కార్లు అమ్మేందుకు ప్రయత్నిస్తారు. ఎక్కువ ప్రాఫిట్, సేల్స్ చూపించడం వల్ల ఆయా కంపెనీల షేర్లు లాభాల బాటలో పయనించేందుకు ఉపయోగపడుతాయి. ఈ నేపథ్యంలోనే ఆకర్షణీయమైన తగ్గింపులు అందిస్తాయి.

Advertisement

Read Also: సిటీలో చదివే విద్యార్థులకు గుడ్ న్యూస్, ముగ్గురు కలిసి ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ కొనేయొచ్చు!

సో, ఇంకెందుకు ఆలస్యం, ఇకపై దసరా, దీపావళి, సంక్రాంతి ఆఫర్లు కాకుండా, ఈ మూడు డేట్స్ రోజు కొత్త కార్లు కొనే ప్రయత్నం చేయండి. మంచి ఆఫర్లు, డిస్కౌంట్లు పొందే ప్రయత్నం చేయండి. తక్కువ ధరలో మంచి కార్లను ఇంటికి తెచ్చుకోండి.

Read Also: సరుకులు తీసుకెళ్లొచ్చు, లాంగ్ ట్రిప్ ఎంజాయ్ చెయ్యొచ్చు.. హోండా ఎలక్ట్రిక్ వ్యాన్ భలే ఉంది గురూ!

Related News

2027లో కొత్త నెక్సాన్.. డిజైన్ నుంచి ఇంజిన్ వరకు అన్నీ మారనున్నాయా?

5 ఏళ్ల తర్వాత పజెరో రీఎంట్రీ.. కొత్త లుక్‌తో మిత్సుబిషి బిగ్ సర్‌ప్రైజ్!

EV కొనేముందు ఈ విషయం చెక్ చేశారా? లేదంటే ఇబ్బందులు తప్పవు!

టాటా దూకుడు.. మహీంద్రా జోరు! ఆగస్టు అమ్మకాల్లో ఎవరు టాప్?

హోండా కొత్త ఈ-స్కూటర్‌కు పేటెంట్.. స్పీడ్ ఎంతో తెలిస్తే వావ్ అనాల్సిందే!

100 కి.మీ స్పీడ్.. 200 కి.మీ రేంజ్.. ఆంపియర్ కొత్త ఎలక్ట్రిక్ బైక్‌కు పేటెంట్!

బజాజ్ బిగ్ రికార్డ్.. 3 లక్షల EV అమ్మకాలు దాటేసింది!

8 నెలల్లోనే 10 లక్షలు.. ఎలక్ట్రిక్ స్కూటర్ల సేల్ లో అదిరిపోయే రికార్డ్!

Big Stories

Advertisement
×