E-Paper
Advertisement

Honda EV Van: సరుకులు తీసుకెళ్లొచ్చు, లాంగ్ ట్రిప్ ఎంజాయ్ చెయ్యొచ్చు.. హోండా ఎలక్ట్రిక్ వ్యాన్ భలే ఉంది గురూ!

Honda EV Van: సరుకులు తీసుకెళ్లొచ్చు, లాంగ్ ట్రిప్ ఎంజాయ్ చెయ్యొచ్చు.. హోండా ఎలక్ట్రిక్ వ్యాన్ భలే ఉంది గురూ!
Advertisement

ప్రముఖ వాహన తయారీ సంస్థ హోండా.. తీసుకొచ్చిన క్రేజీ ఎలక్ట్రిక్ వ్యాన్ N-వాన్. ప్రస్తుతం జపాన్ లో బాగా అమ్మకాలు జరుపుకుంటుంది. ఈ వ్యాన్ కాంపాక్ట్, యుటిలిటేరియన్ బాడీలో ఇంటీరియర్ స్పేస్‌ బాగా పెంచుకునే అవకాశం కల్పిస్తోంది. కమర్షియల్, ఎంటర్ టైన్మెంట్ కు అనుకూలంగా రూపొందించబడింది. పెద్ద కార్గో బే కోసం ఫోల్డ్ ఫ్లాట్ సీట్లను కలిగి ఉంది. ఈ  వ్యాన్ ఇప్పటి వరకు పెట్రోల్ వెర్షన్ అందుబాటులో ఉండగా, 2024లో ఎలక్ట్రిక్ వెర్షన్(N-VAN e:)ను అందుబాటుటోకి తీసుకొచ్చింది. N-సిరీస్ లో భాగంగా దీనిని పరిచయం చేసింది.

హోండా N-వాన్ ప్రత్యేకతలు

ఈ హోండా మినీ వ్యాన్ పెట్రోల్ వెర్షన్ లో 660cc ఇంజిన్ ను కలిగి ఉంది. మల్టీఫుల్ వినియోగానికి అనుగుణంగా కంపెనీ దీనిని తయారు చేసింది. చక్కటి ఇంటీరియర్ డిజైన్ తో తయారయ్యింది. ఎత్తైన పైకప్పును కలిగి ఉంటుంది.  అవసరం లేదు అనుకుంటే అన్ని అన్ని సీట్లను మడిచిపెట్టే అవకాశం ఉంటుంది. అవసరం అనుకుంటే డ్రైవర్ సీట్ ను కూడా మడతపెట్టి, వ్యాప్ లోపలి భాగాన్ని ఓ బెడ్ మాదిరిగా మార్చే అవకాశం ఉంటుంది. కార్గో అవసరానికి ఉపయోగించుకోవచ్చు. మరిన్ని వస్తువులను తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. వాణిజ్య పరంగా, వినోద  పరంగా దీనిని ఉపయోగించుకోవచ్చు.

అందుబాటులోకి ఎలక్ట్రిక్ వెర్షన్ (N-VAN e:)

Advertisement

2024 ఈ వ్యాన్ ఎలక్ట్రిక్ వెర్షన్ లో అందుబాటులోకి వచ్చింది.  ఈ వ్యాన్ ఒక్క చార్జ్ తో సుమారు 295 కిలో మీటర్ల మేర ప్రయాణిస్తుంది. ఇందులో బ్యాటరీ ఎలక్ట్రిక్ మోడల్ కోర్ ప్రాక్టికాలిటీని మెయింటెయిన్ చేస్తుంది. సైలెంట్ ఆపరేషన్, పవర్ అవుట్‌ పుట్ ఫంక్షన్ లాంటి ప్రయోజనాలను కలిగి ఉంటుంది. 50kW DC ఫాస్ట్ ఛార్జర్‌ని ఉపయోగించి 30 నిమిషాల్లో 80% ఛార్జ్‌ చేసుకుంటుంది.

డిజైన్,  ఫీచర్లు

ఇక ఈ కారుకు సంబంధించి బాక్సీ, ఫంక్షనల్ డిజైన్,  సులభమైన, మన్నికైన ఇంటీరియర్ ను కలిగి ఉంటుంది. ప్రయాణీకులు వెళ్లే సమయంలో సీట్లు యథావిధిగా ఉంచుకోవచ్చు. అవసరం లేదనుకుంటే మడతబెట్టే అవకాశం ఉంటుంది. ఈ వ్యాన్ లో ఆధునిక సాంకేతికతను కలిగి ఉంటుంది. హోండా సెన్సింగ్ (భద్రత), యాక్టివ్ క్రూయిజ్ కంట్రోల్ (ACC),  డిజిటల్ క్లైమేట్ కంట్రోల్ లాంటి ఫీచర్లను కలిగి ఉంటుంది. ప్రస్తుతం N-వాన్ జపాన్‌లో కార్గో అవసరాల కోసం ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.  దీని ధర పెట్రోల్ మోడల్‌కు  $14,000 (12.7 లక్షలు) ఉండగా, కొత్త ఎలక్ట్రిక్ వెర్షన్‌కు దాదాపు $16,000(14.5 లక్షలు) వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఇండియాలో ఈ మోడల్ ఇంకా అందుబాటులోకి రాలేదు. త్వరలో వస్తుందని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎప్పుడు, అనే విషయంలో హోండా కంపెనీ ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. ప్రస్తుతం జపాన్ లో మాత్రమే తయారవుతున్న ఈ కార్లు, కొన్ని దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. భారత్ కు కూడా అలాగే ఇంపోర్ట్ అవుతాయా? లేదంటే ఇక్కడే తయారు చేస్తారా? అనేది త్వరలో తెలియనుంది.

Advertisement

Read Also: అదిరిపోయే రంగుల్లో కొత్త సుజుకి బైక్స్, చూస్తే వావ్ అనాల్సిందే!

Related News

2027లో కొత్త నెక్సాన్.. డిజైన్ నుంచి ఇంజిన్ వరకు అన్నీ మారనున్నాయా?

5 ఏళ్ల తర్వాత పజెరో రీఎంట్రీ.. కొత్త లుక్‌తో మిత్సుబిషి బిగ్ సర్‌ప్రైజ్!

EV కొనేముందు ఈ విషయం చెక్ చేశారా? లేదంటే ఇబ్బందులు తప్పవు!

టాటా దూకుడు.. మహీంద్రా జోరు! ఆగస్టు అమ్మకాల్లో ఎవరు టాప్?

హోండా కొత్త ఈ-స్కూటర్‌కు పేటెంట్.. స్పీడ్ ఎంతో తెలిస్తే వావ్ అనాల్సిందే!

100 కి.మీ స్పీడ్.. 200 కి.మీ రేంజ్.. ఆంపియర్ కొత్త ఎలక్ట్రిక్ బైక్‌కు పేటెంట్!

బజాజ్ బిగ్ రికార్డ్.. 3 లక్షల EV అమ్మకాలు దాటేసింది!

8 నెలల్లోనే 10 లక్షలు.. ఎలక్ట్రిక్ స్కూటర్ల సేల్ లో అదిరిపోయే రికార్డ్!

Big Stories

Advertisement
×