E-Paper
Advertisement

తక్కువ ధరలో.. అదిరిపోయే ఫీచర్లు.. ఫోర్స్ అర్బానియా డీలక్స్ వచ్చేసింది!

తక్కువ ధరలో.. అదిరిపోయే ఫీచర్లు.. ఫోర్స్ అర్బానియా డీలక్స్ వచ్చేసింది!
Advertisement

Force Urbania Deluxe Launched: ఫోర్స్ మోటార్స్.. పాపులర్ ట్రావెల్ వెహికల్ అర్బానియాను సరికొత్తగా మార్కెట్ లోకి తీసుకొచ్చింది. అర్బానియా డీలక్స్ పేరుతో వినియోగదారులకు పరిచయం చేసింది. ఈ కొత్త మోడల్‌ లో మెరుగైన ఇంటీరియర్, అత్యాధునిక ఫీచర్లు, పవర్ ఫుల్ డీజిల్ ఇంజిన్‌ ను అందించింది. దీని ప్రారంభ ధర రూ. 28.70 లక్షలుగా(ఎక్స్ షోరూమ్) నిర్ణయించింది.

ప్రీమియం ప్రయాణాలకు అనుగుణంగా..   

కొత్త అర్బానియా డీలక్స్‌ ను ప్రీమియం ప్రయాణ అనుభవాన్ని కోరుకునే కస్టమర్లను దృష్టిలో పెట్టుకుని రూపొందించారు. బయట డిజైన్‌ తో పాటు లోపల కూడా మరింత లగ్జరీ ఫీలింగ్ వచ్చేలా కీలక మార్పులు చేశారు. దీంతో ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణం అందించడమే కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఇంటీరియర్‌ లో లెదరెట్ సీట్లు ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి. ప్రతి సీటుకు 3 పాయింట్ సీట్‌ బెల్ట్‌ ను అందించారు. సీట్లకు సరిపోయే అప్‌హోల్స్టరీతో పాటు వుడ్ ఫినిష్ ఫ్లోరింగ్‌ ను కూడా అమర్చారు. దీంతో క్యాబిన్‌కు ప్రీమియం లుక్ వచ్చింది. అలాగే 16 అంగుళాల అల్లాయ్ వీల్స్ వెహికల్ కు మరింత క్రేజీ లుక్ తీసుకొచ్చాయి. పవర్‌ తో పనిచేసే స్లైడింగ్ ఫుట్‌ స్టెప్‌ ను అందించడం వల్ల ప్రయాణికులు ఎక్కడం, దిగడం మరింత సులభంగా ఉంటుంది.

అత్యాధునిక ఫీచర్లు

Advertisement

టెక్నాలజీ పరంగా కూడా అర్బానియా డీలక్స్‌ లో పలు కొత్త ఫీచర్లు ఉన్నాయి. ఇందులో 9 అంగుళాల టచ్‌ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ ను అందించారు. ఇది స్మార్ట్‌ ఫోన్ కనెక్టివిటీకి సపోర్ట్ చేస్తుంది. అలాగే డిజిటల్ TFT ఇన్‌ స్ట్రుమెంట్ క్లస్టర్‌ ను కూడా ఏర్పాటు చేశారు. మ్యూజిక్ ను ఇష్టపడే వారి కోసం 8 స్పీకర్ ఆడియో సిస్టమ్‌ ను అందించారు. ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని అన్ని సీట్ల దగ్గర  USB టైప్ A, USB టైప్ C ఛార్జింగ్ పోర్ట్‌ లను కూడా ఏర్పాటు చేశారు. దీంతో ప్రయాణ సమయంలో మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను ఈజీగా ఛార్జ్ చేసుకోవచ్చు.

పవర్ ఫుల్ ఇంజిన్

ఈ వెహికల్ లో 2.6 లీటర్ల, 4-సిలిండర్ టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజిన్‌ ను ఉపయోగించారు. ఈ ఇంజిన్ గరిష్టంగా 134 BHP పవర్‌ తో పాటు 350 Nm టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. శక్తివంతమైన ఈ ఇంజిన్‌కు 5 స్పీడ్ మాన్యువల్ గేర్‌ బాక్స్‌ ను యాడ్ చేశారు. అన్ని రకాల రోడ్లపై మెరుగైన పనితీరు అందించేలా దీనిని రూపొందించారు. ఈ వెహికల్ ను టూరిజం, కార్పొరేట్ ట్రాన్స్‌ పోర్ట్, స్కూల్, ఎంప్లాయీస్ ట్రాన్స్ ఫోర్ట్ లాంటి అవసరాలకు వాడుకునేలా రూపొందించారు.

Advertisement

కొత్త ఫోర్స్ అర్బానియా డీలక్స్ మెరుగైన ఫీచర్లు, లగ్జరీ ఇంటీరియర్, శక్తివంతమైన డీజిల్ ఇంజిన్, అదిరిపోయే వీల్‌ బేస్, సీటింగ్ ఆప్షన్స్ తో మార్కెట్లోకి అడుగుపెట్టింది. ప్రీమియం ప్యాసింజర్ వాహనం కోసం చూస్తున్న వారికి ఇదో బెస్ట్ ఆప్షన్ గా నిలువనుంది.

Read Also: పవర్‌ ఫుల్ ఇంజిన్‌.. అదిరిపోయే ఫీచర్లు.. కొత్త బ్రెజ్జా వచ్చేసింది!

Related News

సింపుల్ ఎనర్జీ సూపర్ జోష్.. ఏడాదిలో 10 వేలకుపైగా ఈవీ స్కూటర్ల సేల్!

ఈవీ రంగంలో హీరో దూకుడు.. నంబర్ వన్ కోసం అదిరిపోయే ప్లాన్!

నల్లగొండ జిల్లాలో ఎలక్ట్రిక్ వెహికల్స్ జోరు, ఏడాదిలో 11 వేలకు పైగా కొనుగోళ్లు!

432 కి.మీ రేంజ్.. అరగంటలో ఛార్జింగ్.. 11 వేల కి.మీ నడిపిన తర్వాత క్రెటా EV రివ్యూ!

జావా 42 బాబర్‌కు అదిరిపోయే లుక్.. ఆల్ స్టార్స్ ఎడిషన్ ఏముంది భయ్యా!

ఆగస్టులో అదరగొట్టిన టాప్ 5 కార్లు.. నంబర్ వన్‌ ఏదంటే?

టాటా ఈవీలపై కళ్లు చెదిరే ఆఫర్లు.. హారియర్ పై ఏకంగా రూ.2.75 లక్షల తగ్గింపు!

మహీంద్రా పేరు వెనుక ఇంత పెద్ద కథ ఉందా? కంపెనీ అసలు పేరు ఏంటో తెలిస్తే షాకవ్వాల్సిందే!

Big Stories

Advertisement
×