E-Paper
Advertisement

మాగ్నైట్ To ఫార్చ్యూనర్.. ఇండియన్ మార్కెట్లో హిట్ కొట్టిన టాప్ 5 జపనీస్ SUVలు ఇవే!

మాగ్నైట్ To ఫార్చ్యూనర్.. ఇండియన్ మార్కెట్లో హిట్ కొట్టిన టాప్ 5 జపనీస్ SUVలు ఇవే!
Advertisement

Best Japanese SUVs in India: భారత్ లో  SUVలకు డిమాండ్ రోజురోజుకు పెరుగుతోంది. ముఖ్యంగా జపనీస్ ఆటోమొబైల్ కంపెనీలకు చెందిన SUVలు ఇండియాలో సత్తా చాటుతున్నాయి. మంచి పర్ఫార్మెన్స్, సూపర్  మైలేజ్, తక్కువ మెయింటెనెన్స్ ఖర్చులతో వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. చిన్న ఫ్యామిలీ కార్ల నుంచి పెద్ద ప్రీమియం SUVల వరకు జపనీస్ బ్రాండ్లు భారత మార్కెట్లో బలమైన స్థానాన్ని సంపాదించాయి. ప్రస్తుతం రూ. 50 లక్షల లోపు బెస్ట్ జపనీస్ SUVల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

⦿ నిస్సాన్ మాగ్నైట్

నిస్సాన్ భారత్ లో తయారు చేస్తున్న అత్యంత చవకైన SUVలలో ఒకటి. చిన్న ఫ్యామిలీలకు, సిటీ డ్రైవింగ్‌కు  బాగా సరిపోతుంది. మాగ్నైట్ రెండు పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లతో అందుబాటులో ఉంది. ఒకటి సాధారణ నాచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజన్ కాగా, మరొకటి టర్బో పెట్రోల్ వెర్షన్. మాన్యువల్, AMT, CVT గేర్‌ బాక్స్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. తక్కువ ధరలో మంచి ఫీచర్లను కలిగి ఉంది. దీని ప్రారంభ ధర సుమారు రూ.5.65 లక్షలు.

⦿ మారుతి సుజుకి గ్రాండ్ విటారా

Advertisement

దేశంలో మారుతి సుజుకి బ్రాండ్ నుంచి అత్యంత ప్రజాదరణ పొందిన మోడల్స్ లో ఇది ఒకటి. గ్రాండ్ విటారా మంచి మైలేజ్‌ తో పాటు హైబ్రిడ్ టెక్నాలజీని అందిస్తుంది. ఇందులో రెండు ఇంజన్ ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి సాధారణ 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్ కాగా, మరొకటి స్ట్రాంగ్ హైబ్రిడ్ సిస్టమ్‌ తో వస్తుంది. ఈ హైబ్రిడ్ వెర్షన్ మంచి ఫ్యూయెల్ ఎఫిషియెన్సీ అందిస్తుంది. సిటీ ప్రయాణాలకు, లాంగ్ డ్రైవ్‌ లకు ఇది మంచి ఆప్షన్ గా చెప్పుకోవచ్చు.  దీని ప్రారంభ ధర రూ.10.76 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది.

⦿ హోండా ఎలివేట్

ఇండియాలో బెస్ట్ SUVలలో ఒకటి హోండా ఎలివేట్. ఇందులో 1.5 లీటర్ i-VTEC పెట్రోల్ ఇంజన్ ఉంటుంది.  పనితీరు పరంగా చాలా స్మూత్‌ గా ఉంటుంది. మాన్యువల్, CVT ఆటోమేటిక్ ట్రాన్స్‌ మిషన్ ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా దీని బూట్ స్పేస్ 458 లీటర్లు ఉంటుంది. కుటుంబ ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుంది. దీని ప్రారంభ ధర సుమారు రూ. 11.59 లక్షలు.

⦿ ఇసుజు MU-X

Advertisement

ఇది ఎక్కువగా ఆఫ్ రోడింగ్, లాంగ్ టూర్లను ఇష్టపడే వారికి అనుకూలంగా ఉంటుంది. మార్కెట్లో చాలా తక్కువగా కనిపించినా, మంచి డీజిల్ ఇంజన్ కారణంగా ప్రత్యేక గుర్తింపు పొందింది. 1.9 లీటర్ టర్బో డీజిల్ ఇంజన్‌ తో వచ్చే ఈ SUVలో ఆటోమేటిక్ ట్రాన్స్‌ మిషన్ ఉంటుంది. 4×2, 4×4 ఆప్షన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. గతుకుల రోడ్లపై కూడా MU-X మంచి పని తీరును ఇస్తుంది. దీని ప్రారంభ ధర రూ.34.53 లక్షలు.

⦿ టయోటా ఫార్చ్యూనర్

భారతదేశంలో ఫార్చ్యూనర్‌ కు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. దశాబ్దం నుంచి ఇది ప్రీమియం SUV సెగ్మెంట్‌ లో టాప్ మోడళ్లలో ఒకటిగా కొనసాగుతోంది. పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్స్ తో అందుబాటులో ఉంది. ముఖ్యంగా 2.8 లీటర్ డీజిల్ ఇంజన్ బలమైన పనితీరును అందిస్తుంది. భారీ రోడ్డు ప్రెజెన్స్, నమ్మకమైన ఇంజన్, మంచి రీసేల్ వ్యాల్యూ కారణంగా ఫార్చ్యూనర్ ఇప్పటికీ చాలామందికి ఫేవరెట్ SUVగా ఉంది. దీని ప్రారంభ ధర రూ.34.76 లక్షలు.

Read Also: MG విండ్సర్ EV, ZS EVపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఫ్రీ DC ఛార్జింగ్ కూడా!

Related News

తక్కువ ధర.. ఎక్కువ మైలేజ్.. మధ్యతరగతి కుటుంబాలకు బెస్ట్ కార్లు!

కార్ల కంపెనీల దగ్గరే చవకగా సెకండ్ హ్యాండ్ కార్లు కొనేయొచ్చు.. జస్ట్ ఇలా చేస్తే చాలు!

హ్యుందాయ్ బౌల్డర్ కు పేటెంట్.. రగ్గడ్ లుక్‌ లో అదిరిపోయిందిగా!

విన్‌ ఫాస్ట్ డబుల్ సర్‌ ప్రైజ్.. కొత్త ఈ-స్కూటర్, ఈ-బైక్‌కు పేటెంట్!

టాటా అవిన్యా X టెస్టింగ్ షురూ.. నెట్టింట వైరల్ అవుతున్న స్పై షాట్స్!

థార్‌ కు నెక్స్ట్ లెవల్ అవతారం.. విజన్ T వచ్చేస్తోంది!

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

Big Stories

Advertisement
×