E-Paper
Advertisement

ఒకే ఛార్జ్‌ తో 240 కిమీ రేంజ్.. భారత్‌లో అత్యధిక రేంజ్ ఇచ్చే 5 ఎలక్ట్రిక్ స్కూటర్లు!

ఒకే ఛార్జ్‌ తో 240 కిమీ రేంజ్.. భారత్‌లో అత్యధిక రేంజ్ ఇచ్చే 5 ఎలక్ట్రిక్ స్కూటర్లు!
Advertisement

Top EV Scooters With Highest Range: భారత్ లో ఎలక్ట్రిక్ స్కూటర్లకు డిమాండ్ రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా ఒకే ఛార్జ్ తో ఎక్కువ దూరం వెళ్లే స్కూటర్లకు మంచి ఆదరణ లభిస్తోంది. రోజువారీ ఆఫీస్ ప్రయాణాలతో పాటు వీకెండ్ ట్రిప్‌ లకు కూడా ఉపయోగపడే లాంగ్ రేంజ్ స్కూటర్ల కోసం వినియోగదారులు ఎక్కువగా చూస్తున్నారు. ప్రస్తుతం భారత మార్కెట్లో ఎక్కువ రేంజ్ అందిస్తున్న కొన్ని టాప్ ఎలక్ట్రిక్ స్కూటర్ల గురించి ఇప్పుడు చూద్దాం..

⦿  సింపుల్ వన్

ప్రస్తుతం దేశంలో అత్యధిక రేంజ్ ఇచ్చే స్కూటర్లలో  సింపుల్ వన్ ఒకటి. ఒకే ఛార్జ్ తో 240 కిలోమీటర్లకు పైగా ప్రయాణిస్తుందని కంపెనీ వెల్లడించింది. స్పోర్టీ డిజైన్, పెద్ద టచ్‌ స్క్రీన్ డిస్‌ ప్లే, కనెక్టెడ్ ఫీచర్లు, వేగవంతమైన యాక్సిలరేషన్ దీని ప్రత్యేకతలు. ఈదీని ఎక్స్ షోరూమ్ ధర సుమారు రూ.1.66 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఎక్కువ రేంజ్‌ తో పాటు మంచి ఫర్ఫార్మెన్స్ కోరుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్.

⦿ ఓలా ఎస్1 ప్రో జెన్ 3

Advertisement

ఓలా ఎస్1 ప్రో జెన్ 3 కూడా మార్కెట్లో మంచి క్రేజ్ సంపాదించింది. కొత్త బ్యాటరీ టెక్నాలజీతో వచ్చిన ఈ స్కూటర్ సుమారు 242 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. ఇందులో పెద్ద టచ్‌ స్క్రీన్ డాష్‌ బోర్డ్, నావిగేషన్, క్రూయిజ్ కంట్రోల్, పలు రైడింగ్ మోడ్స్ ఉన్నాయి. దీని ధర వేరియంట్‌ను బట్టి సుమారు రూ.1.30 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.

⦿  టీవీఎస్ ఐక్యూబ్ ఎస్టీ

ఈ స్కూటర్ కుటుంబ ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుంది. పెద్ద బ్యాటరీ వెర్షన్ సుమారు 150 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని కంపెనీ వెల్లడించింది. సాఫ్ట్ రైడింగ్ ఎక్స్ పీరియెన్స్, కనెక్టెడ్ ఫీచర్లు, నావిగేషన్ సపోర్ట్, పెద్ద టీఎఫ్‌టీ డిస్‌ ప్లే  ఉన్నాయి. దీని ధర సుమారు రూ.1.28 లక్షల నుంచి మొదలవుతుంది.

⦿  ఏథర్ రిజ్టా

Advertisement

దీనిని కుటుంబ ప్రయాణాలకు అనుకూలంగా తయారు చేశారు. ఒకే ఛార్జ్ తో సుమారు 160 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని కంపెనీ వెల్లడించింది. పెద్ద సీటు, ఎక్కువ స్టోరేజ్ స్పేస్, స్మార్ట్ కనెక్టెడ్ ఫీచర్లు ఆకట్టుకుంటాయి. దీని ప్రారంభ ధర సుమారు రూ.1.10 లక్షలు.

⦿  బజాజ్ చేతక్ 3501

క్లాసిక్ రెట్రో లుక్‌తో వచ్చిన ఈ స్కూటర్ సుమారు 153 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. మెటల్ బాడీ, టచ్‌ స్క్రీన్ కన్సోల్, బలమైన నిర్మాణంతో ఆకట్టుకుంటుంది. దీని ధర సుమారు రూ.1.35 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.

వీటిలో ఎక్కువ రేంజ్, స్పోర్టీ పనితీరు కావాలనుకునే వారికి సింపుల్ వన్, ఓలా ఎస్1 ప్రో జెన్ 3 బెస్ట్ ఆప్షన్ గా చెప్పుకోవచ్చు. కుటుంబ అవసరాలు, సౌకర్యం, మంచి పనితీరును కోరుకునే వారికి టీవీఎస్ ఐక్యూబ్, ఏథర్ రిజ్టా, బజాజ్ చేతక్ తీసుకోవడం మంచిది.

Read Also: టీవీఎస్ స్మార్ట్ ఎలక్ట్రిక్ త్రీ వీలర్ వచ్చేసింది.. ఒకే ఛార్జ్‌ తో 179 కిమీ ప్రయాణం!

Related News

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

లాంచ్‌కు ముందే క్రేజీ డీటైల్స్ లీక్.. కొత్త బ్రెజ్జాలో ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

టీవీఎస్ నుంచి సూపర్ సర్‌ ప్రైజ్.. ఒకేసారి 3 మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

కొత్త బ్రెజ్జా To హిలక్స్.. 10 రోజుల్లో 3 క్రేజీ మోడల్స్ ఎంట్రీ!

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

EV బ్యాటరీల్లో ఏది సేఫ్? కొనుగోలు చేసే ముందు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

Big Stories

Advertisement
×