Ashwin: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ (Indian Premier League 2026 Tournament) ఉత్కంఠ భరితంగా సాగుతున్న నేపథ్యంలో హార్దిక్ పాండ్యా (Hardik Pandya) గురించి సంచలన న్యూస్ వైరల్ గా మారింది. ఈ సీజన్ లో హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్ తరఫున కెప్టెన్ గా వ్యవహరించి అట్టర్ ఫ్లాఫ్ అయ్యాడు. దీంతో యాజమాన్యం అతన్ని కావాలనే తప్పించిందని, గాయం పేరుతో దూరం పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యంతో హార్దిక్ పాండ్యా చర్చలు జరుపుతున్నట్లు సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోకి హార్దిక్ పాండ్యాను తీసుకోకూడదని రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) సంచలన స్టేట్మెంట్ ఇచ్చారు. దీంతో అశ్విన్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
2027 ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ (Indian Premier League 2027 Tournament) నేపథ్యంలో ట్రేడింగ్ ద్వారా హార్దిక్ పాండ్యాను (Hardik Pandya) చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ( CSK Team) కొనుగోలు చేయబోతున్నట్లు గత నాలుగు రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. హార్దిక్ పాండ్యా కూడా దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ముంబై ఇండియన్స్ ( Mumbai Indians) ఓనర్లతో అతనికి అస్సలు పడడం లేదని.. అందుకే ఆ జట్టును వీడి బయటకు వచ్చేందుకు సిద్ధమయ్యారట. ఈ క్రమంలో చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం నుంచి బంపర్ ఆఫర్ కూడా తగిలినట్లు చెబుతున్నారు. తమ జట్టులోకి వస్తే కీలక ప్లేయర్ గా భావించడమే కాకుండా.. భవిష్యత్తులో కెప్టెన్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయని చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం స్పష్టం చేసిందట.
అయితే ఈ న్యూస్ బయటకు వచ్చిన నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ మాజీ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హార్దిక్ పాండ్యా చెన్నై సూపర్ కింగ్స్ లోకి రావడం పెద్ద తప్పిదమని, అలాంటోడిని అస్సలు తీసుకోకూడదని హెచ్చరించారు. ఒకవేళ చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోకి హార్దిక్ పాండ్యా వస్తే, జట్టులో చీలిక తీసుకువస్తాడని వార్నింగ్ ఇచ్చారు. హార్దిక్ పాండ్యా మనస్తత్వానికి.. చెన్నై సూపర్ కింగ్స్ ఎన్విరాన్మెంట్ ఏమాత్రం సరిపోదని స్పష్టం చేశారు. అలాంటోడు ముంబై ఇండియన్స్ లో మాత్రమే పనికి వస్తాడని తెలిపారు. లేకపోతే మళ్లీ గుజరాత్ వెళ్లిపోవాలని సూచనలు చేశారు. కానీ అనవసరంగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోకి వచ్చి అందరినీ నాశనం చేయకూడదని తెలిపారు. దీనిపై చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం కూడా దృష్టి పెట్టాలన్నారు. హార్దిక్ పాండ్యా కాకుండా వేరే ప్లేయర్ ను తీసుకుంటే బెటర్ అన్నారు అశ్విన్.