E-Paper
Advertisement

హ్యుండాయ్ To టాటా.. రూ. 25 లక్షల్లోపు టాప్ 5 పవర్ ఫుల్ కార్లు!

హ్యుండాయ్ To టాటా.. రూ. 25 లక్షల్లోపు టాప్ 5 పవర్ ఫుల్ కార్లు!
Advertisement

Most Powerful Cars Under Rs.25 Lakh: సాధారణంగా కారును కొనుగోలు చేసే సమయంలో కేవలం ఫీచర్లు మాత్రమే కాకుండా, మంచి పవర్, డ్రైవింగ్ ఎక్స్ పీరియెన్స్ ను కూడా కోరుకుంటారు. మీరు కూడా అలాంటి డ్రైవింగ్ ఎక్స్‌ పీరియన్స్ కోరుకునే వారిలో ఒకరైతే, రూ. 25 లక్షల బడ్జెట్‌ లో కూడా మంచి పని తీరు ఇచ్చే కార్లు అందుబాటులో ఉన్నాయి. వాటిలో 5 శక్తివంతమైన కార్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

⦿ హ్యుండాయ్ వెర్నా టర్బో: రూ.18.4 లక్షలు

రూ. 25 లక్షల్లోపు కార్లలో హ్యుండాయ్ వెర్నా టర్బో బెస్ట్ ఆప్షన్ గా చెప్పుకోవచ్చు. ఇది 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌ తో వస్తుంది. ఈ ఇంజన్ మంచి పవర్ ఇచ్చేలా రూపొందించబడింది. 7-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌ బాక్స్‌ తో కలిసి స్మూత్ డ్రైవింగ్ ఎక్స్ పీరియెన్స్ ను ఇస్తుంది. సిటీలో కూడా ఈజీగా నడిపే అవకాశం ఉంటుంది. హైవే మీద కూడా వేగంగా వెళ్లే అవకాశం ఉంటుంది. ఎక్కువ పవర్ ఉన్నప్పటికీ మంచి కంట్రోల్ లో ఉండటం దీని ప్రత్యేకత.

⦿ రెనాల్ట్ డస్టర్ టర్బో: ధర రూ.18.69 లక్షలు

Advertisement

రెనాల్ట్ డస్టర్ టర్బో ఇప్పుడు మరింత శక్తివంతంగా మారింది. 1.3 లీటర్ టర్బో ఇంజన్‌తో మంచి టార్క్‌ ను ఇస్తుంది. హైవేలో ఓవర్‌ టేక్ చేయడం చాలా సులభం అవుతుంది. అంతేకాదు, రఫ్ రోడ్లపై కూడా ఈ SUV బాగా పని చేస్తుంది. గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువగా ఉండటం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో ఉపయోగించవచ్చు.

⦿ మహీంద్రా XUV700: రూ.23.64 లక్షలు

మహీంద్రా XUV700 పెట్రోల్..  కుటుంబంతో ప్రయాణించేవారికి, మంచి పవర్ కోరుకునేవారికి బెస్ట్ కాంబినేషన్. 2.0 లీటర్ టర్బో ఇంజన్‌ తో ఇది చాలా శక్తివంతంగా ఉంటుంది. పెద్ద SUV అయినప్పటికీ వేగంగా యాక్సిలరేట్ అవుతుంది. సస్పెన్షన్ కూడా బాగా ట్యూన్ చేయబడింది. డ్రైవింగ్ సౌకర్యంగా ఉంటుంది.

⦿ మహీంద్రా BE 6: రూ. 25 లక్షలు 

Advertisement

ఎలక్ట్రిక్ సెగ్మెంట్‌లో మహీంద్రా BE 6 మరో బెస్ట్ ఆప్షన్. ఇది రియర్ వీల్ డ్రైవ్ సెటప్‌ తో వస్తుంది. సాధారణ EVలతో పోలిస్తే కొంచెం స్పోర్టీ ఫీలింగ్ ఇస్తుంది. వేగంగా పికప్ అందించడంతో పాటు డ్రైవర్‌ కు మంచి కంట్రోల్ కూడా ఇస్తుంది. అయితే, దీని సస్పెన్షన్ కొంచెం గట్టిగా ఉంటుంది. పెర్ఫార్మెన్స్ కోరుకునే వారికి అనుకూలంగా ఉంటుంది.

⦿ టాటా హారియర్ EV: ధర రూ. 24.99 లక్షలు   

టాటా హారియర్ EV ఈ లిస్టులో అత్యంత శక్తివంతమైన కారుగా గుర్తింపు తెచ్చుకుంది. పెద్ద బ్యాటరీ ప్యాక్‌ తో పాటు మంచి రేంజ్ కూడా అందిస్తుంది. డ్రైవింగ్ సమయంలో చాలా స్మూత్‌ గా ఉంటుంది. స్థిరత్వం ఎక్కువగా ఉంటుంది. దీని బరువు ఎక్కువగా ఉన్నప్పటికీ, హైవేలో కంఫర్టబుల్ క్రూజర్‌గా పనిచేస్తుంది.

Read Also: టియాగో EV To VF3.. త్వరలో విడుదల కాబోతున్న 7 క్రేజీ ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

Related News

మారుతి జిమ్నీ To మహీంద్రా థార్.. రూ.20 లక్షల లోపు పవర్‌ఫుల్ 4×4 SUVలు ఇవే!

రెడ్ అండ్ బ్లాక్ లుక్‌లో హ్యుందాయ్ బేయాన్.. ఫీచర్లు అదుర్స్!

క్లాసిక్ లుక్.. మోడ్రన్ టెక్నాలజీ.. ట్రయంఫ్ బోన్నెవిల్ T40 వచ్చేసింది!

టెస్లా రోడ్‌స్టర్‌లో ఎయిర్ థ్రస్టర్లు.. ఫెరారీకి ఈ ఆలోచన 2018లో వచ్చిందా?

రెనాల్ట్ డస్టర్ హైబ్రిడ్ vs గ్రాండ్ విటారా vs టయోటా హైరైడర్.. వీటిలో ఏది కొనాలంటే?

స్కోడా కార్లపై అదిరిపోయే ఆఫర్లు.. కైలాక్‌పై ఏకంగా రూ.90 వేల తగ్గింపు!

డౌన్ పేమెంట్ లేకుండానే బైక్ కొనేయండి.. జావా, యెజ్డీ అదిరిపోయే ఫెస్టివ్ ఆఫర్లు!

ఏకంగా 4 SUVలు, ఓ పికప్ ట్రక్.. జీప్ ప్లాన్ మామూలుగా లేదుగా!

Big Stories

Advertisement
×