E-Paper
Advertisement

Women Bill: విపక్షాలు తప్పు చేశాయ్.. పర్యవసానాలు తప్పవు.. ప్రధాని మోదీ తీవ్ర హెచ్చరిక

Women Bill: విపక్షాలు తప్పు చేశాయ్.. పర్యవసానాలు తప్పవు.. ప్రధాని మోదీ తీవ్ర హెచ్చరిక
Advertisement

Women Bill: పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు ఇవ్వకుండా ప్రతిపక్ష పార్టీలు తప్పు చేశాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. నారీ శక్తి బిల్లును వ్యతిరేకించడం ద్వారా చారిత్రాత్మక తప్పిదం చేశాయని మోదీ వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో దీనికి సంబంధించి ఆయా పార్టీలు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని తీవ్రంగా హెచ్చరించారు.

మహిళా రిజర్వేషన్ తో లింకప్ చేసిన డీలిమిటేషన్ బిల్లు శుక్రవారం పార్లమెంటులో వీగిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భవిష్యత్తు కార్యచరణపై చర్చించేందుకు ప్రధాని మోదీ.. శనివారం దిల్లీలో కేబినేట్ భేటి నిర్వహించారు. ఈ సందర్భంగా బిల్లును విపక్షాలు అడ్డుకోవడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. బిల్లును అడ్డుకోవడం ద్వారా దేశంలోని మహిళలను ప్రతిపక్షాలు తీవ్ర నిరాశకు గురిచేశాయని ప్రధాని అన్నారు.

Advertisement

ప్రతిపక్షాలు మహిళలకు దక్కాల్సిన హక్కులను అడ్డుకున్నాయనే సందేశాన్ని ప్రతి గ్రామానికి, ప్రతి వ్యక్తికి తీసుకెళ్లాలని తన మంత్రివర్గ సహచరులకు ప్రధాని సూచించారు. దేశంలోని మహిళలు బిల్లును వ్యతిరేకించిన పార్టీలను క్షమించరని ఈ సందర్భంగా పేర్కొన్నారు. బిల్లును వ్యతిరేకించి విపక్షాలు తప్పుచేశాయని.. కోట్లాది మంది మహిళలకు వారు సమాధానం చెప్పాలని ఈ సందర్భంగా మోదీ అన్నారు. రాబోయే రోజుల్లో శిక్ష అనుభవించక తప్పదని చెప్పుకొచ్చారు.

మరోవైపు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ.. మహిళా రిజర్వేషన్ల బిల్లును పార్లమెంటులో అడ్డుకోవడం ఘోరమని అన్నారు. బిల్లును అడ్డుకోవడమే కాకుండా పండుగ చేసుకోవడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ బిల్లు ఏ విధంగా ప్రజాస్వామ్యానికి విరుద్దమో చెప్పాలని రాహుల్ గాంధీని నిలదీశారు. మరోవైపు మహిళల రిజర్వేషన్లకు తాము ఏమాత్రం వ్యతిరేకం కాదని విపక్షాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే మహిళా బిల్లు మాటున బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన నిబంధనలు అస్పష్టంగా ఉన్నాయని ఆరోపిస్తున్నాయి.

Advertisement

Also Read: ఎల్‌పీజీ కంటే చీప్.. సూపర్‌బ్లూ ఇథనాల్ స్టవ్.. కిచెన్‌లో అద్భుతాలు చేయెుచ్చు!

చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లను లింకప్ చేస్తూ లోక్ సభలో కేంద్రం ప్రవేశపెట్టిన డీలిమిటేషన్ (131 రాజ్యంగ సవరణ) బిల్లు వీగిపోయింది. కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి ఎంపీలు.. ఈ బిల్లును వ్యతిరేకించడంతో 2/3వ వంతు మెజారిటీ రాక.. బిల్లు కార్యరూపం దాల్చలేదు. ఈ బిల్లు కోసం నిర్వహించిన ఓటింగ్ లో 528 ఎంపీలు పాల్గొనగా.. అందులో 298 మంది అనుకూలంగా, 230 మంది వ్యతిరేకంగా ఓటు వేశారు. సాధారణ మెజారిటీ లభించినప్పటికీ రాజ్యాంగపరమైన ప్రత్యేక మెజారిటీ నిబంధనను ప్రభుత్వం అందుకోలేకపోయింది.

Also Read: సీఎం రేవంత్ ఇంటి వద్ద భారీ భద్రత.. 144 సెక్షన్ విధింపు.. బీజేపీ నిరసనలతో హై అలర్ట్!

Related News

సీఎం యోగి కాన్వాయ్ సమీపంలో పేలుడు, ఉలిక్కిపడిన అధికారులు, మధుర వెళ్లే దారిలో ఘటన

బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్ జాబ్స్.. కనీస వేతనం రూ.50,000.. పూర్తి వివరాలివిగో

ISRO: ఇస్రో ‘నాటీ బాయ్’ ప్రయోగం సక్సెస్.. చైనా-పాక్‌లపై నిఘా నేత్రం, ప్రతీ 10 నిమిషాలకు చుక్కలే

రైల్వే జాబ్స్.. RRB NTPCలో మొత్తం 5,165 ఖాళీలు.. డిగ్రీ ఉంటే చాలు

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

అయోధ్య రామ మందిరానికి తొలి సీఈవో‌గా జితేంద్ర మిశ్రా!

Big Stories

Advertisement
×