E-Paper
Advertisement

Best Bike With High Mileage: లో కాస్ట్, బెస్ట్ మైలేజ్.. హీరో HF డీలక్స్ సూపర్ ఆప్షన్ బ్రో!

Best Bike With High Mileage: లో కాస్ట్, బెస్ట్ మైలేజ్.. హీరో HF డీలక్స్ సూపర్ ఆప్షన్ బ్రో!
Advertisement

Hero HF Deluxe Bike: ప్యూయెల్ ఖర్చులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో చాలా మంది ఎక్కువ మైలేజ్ ఇచ్చే బైక్స్ ఎంచుకుంటున్నారు. అదే సమయంలో తక్కువ ధరకు వస్తే బాటుంటుందని అనుకుంటున్నారు. అలాంటి వారికి ఓ బెస్ట్ ఆప్షన్ హీరో HF డీలక్స్ గా చెప్పుకోవచ్చు. దానికి బోలెడు కారణాలు ఉన్నాయి. అవేంటి అనేది ఇప్పుడు చూద్దాం..

లీటర్ కు 70 కిలో మీటర్ల మైలేజ్

హీరో హెచ్‌ఎఫ్ డీలక్స్ అనేది హీరో మోటోకార్ప్ నుంచి  వచ్చిన పాపులర్ కమ్యూటర్ బైక్. ఇది అద్భుతమైన మైలేజీతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఒక లీటర్ పెట్రోల్ తో ఏకంగా 70 కిలో మీటర్లు ప్రయాణించే అవకాశం ఉంటుంది. పవర్ ఫుల్ ఇంజిన్, మంచి పనితీరుతో వినియోగదారులను ఆకట్టుకుంటుంది. ఈ మైక్ సిటీ ప్రయాణాలతో పాటు గ్రామీణ ప్రాంత అవసరాలకు అనుకూలంగా ఉంటుంది.  దీనిలో 4 స్పీడ్ ట్రాన్స్‌ మిషన్, టెలిస్కోపిక్ సస్పెన్షన్, i3S టెక్నాలజీ లాంటి లేటెస్ట్ ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. ఇది ముఖ్యంగా ఫ్యూయెల్ ఎఫిషియెన్సీని పెంచుతుంది.

హీరో హెచ్‌ఎఫ్ డీలక్స్ కీ ఫీచర్లు   

Advertisement

హీరో హెచ్‌ఎఫ్ డీలక్స్ 97.2cc ఎయిర్ కూల్డ్, సింగిల్ సిలిండర్ OHC ఇంజిన్ ను కలిగి ఉంటుంది. 7.91 bhp @ 8,000 rpm పవర్ ను ఉత్పత్తి చేస్తుంది. 8.05 Nm @ 6,000 rpm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. 4 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్ ను కలిగి ఉంటుంది. మైలేజీ 70 కిలో మీటర్లు ఇస్తుంది. ముందుభాగంలో టెలిస్కోపిక్ ఫోర్క్స్, వెనుకవైపు హైడ్రాలిక్ షాక్ అబ్జార్బర్స్ ఉన్నాయి. డ్రమ్ బ్రేక్ సిస్టమ్ తో వస్తుంది.

Read Also: ఆటో9 అవార్డ్స్ 2026.. ఈవీ స్కూటర్ ఆఫ్ ది ఇయర్ గా సత్తా చాటిన టీవీఎస్ ఆర్బిటర్!

Advertisement

హీరో హెచ్‌ఎఫ్ డీలక్స్ i3S టెక్నాలజీ, LED హెడ్‌ ల్యాంప్, డిజిటల్, అనలాగ్ కన్సోల్ ఉంటుంది. ఇక మోడల్స్ విషయానికి వస్తే HF Deluxe, HF Deluxe i3S, HF Deluxe Pro లాంటి వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం ఈ బైక్ దేశీ మార్కెట్ లో బజాజ్ CT100, TVS స్పోర్ట్, హోండా CD 110 డ్రీమ్‌లకు పోటీగా కొనసాగుతోంది.

ఈ బైక్ ఎవరికి అనుకూలంగా ఉంటుందంటే?  

హీరో హెచ్‌ఎఫ్ డీలక్స్ రోజువసర ప్రయాణాలకు, ఎక్కువ మైలేజీ కోరుకునే వారికి, తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో బైక్ కావాలనుకునే వారికి మంచి ఎంపికగా చెప్పుకోవచ్చు.  ప్రస్తుతం తక్కువ ధరలో మంచి మైలేజ్ ఇచ్చే బైక్ కావాలనుకునే వారు కూడా దీనిని ట్రై చెయ్యొచ్చు. అన్ని పరిస్థితులకు, అన్ని అవసరాలకు అనుగుణంగా ఈ బైక్ సర్వీసులు అందిస్తుంది.

Read Also: హీరో ఎక్స్‌ ట్రీమ్ 125R VS హోండా CB 125.. ఏది కొంటే మంచిదంటే?

Related News

తక్కువ ధర.. ఎక్కువ మైలేజ్.. మధ్యతరగతి కుటుంబాలకు బెస్ట్ కార్లు!

కార్ల కంపెనీల దగ్గరే చవకగా సెకండ్ హ్యాండ్ కార్లు కొనేయొచ్చు.. జస్ట్ ఇలా చేస్తే చాలు!

హ్యుందాయ్ బౌల్డర్ కు పేటెంట్.. రగ్గడ్ లుక్‌ లో అదిరిపోయిందిగా!

విన్‌ ఫాస్ట్ డబుల్ సర్‌ ప్రైజ్.. కొత్త ఈ-స్కూటర్, ఈ-బైక్‌కు పేటెంట్!

టాటా అవిన్యా X టెస్టింగ్ షురూ.. నెట్టింట వైరల్ అవుతున్న స్పై షాట్స్!

థార్‌ కు నెక్స్ట్ లెవల్ అవతారం.. విజన్ T వచ్చేస్తోంది!

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

Big Stories

Advertisement
×