E-Paper
Advertisement

Hero Xtreme 125R vs Honda CB 125 Hornet: హీరో ఎక్స్‌ ట్రీమ్ 125R VS హోండా CB 125.. ఏది కొంటే మంచిదంటే?

Hero Xtreme 125R vs Honda CB 125 Hornet: హీరో ఎక్స్‌ ట్రీమ్ 125R VS హోండా CB 125.. ఏది కొంటే మంచిదంటే?
Advertisement

Hero Xtreme 125R vs Honda CB 125 Hornet Comparison: ఒకప్పుడు ఒకే కంపెనీగా ఉన్న హీరో హోండా.. ఆ తర్వాత రెండుగా విడిపోయింది. ఇప్పుడు హీరో, హోండా కంపెనీలు అద్భుతమైన మోటార్ సైకిళ్లను మార్కెట్ లోకి తీసుకొస్తున్నాయి. అందులో భాగంగానే హీరో నుంచి ఎక్స్‌ ట్రీమ్ 125R, హోండా నుంచి CB 125 విడుదలయ్యాయి. వీటి ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయి? ఇంజిన్ పవర్ ఏంటి? ఏది ఎవరికి అనుకూలంగా ఉంటుంది? అనేది వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

హీరో ఎక్స్‌ ట్రీమ్ 125R ధర రూ.90,000 నుంచి రూ. 98,000 వరకు ఉంటుంది. ఇది చౌకైన, ఎక్కువ మైలేజ్ ఇచ్చే స్పోర్టీ మ్యూటర్ అవుతుంది. లీటర్ పెట్రోల్ తో 66 కిలో మీటర్లు ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది. ఇక దీనికి హోండా CB 125 హార్నెట్ ప్రీమియం, ఫీచర్ రిచ్ ప్రత్యర్థిగా కొనసాగుతోంది. దీని ధర రూ. 1.04 లక్షల నుంచి రూ. 1.15 లక్షల వరకు ఉంటుంది. USD ఫోర్కులు, TFT స్క్రీన్ మరింత మెరుగ్గా ఉంటాయి. స్పోర్టియర్ పని తీరును కలిగి ఉంది. ఈ రెండూ బైకులు 125cc ఇంజిన్‌లను కలిగి ఉన్నాయి. హీరో i3s సాంకేతికతతో మంచి సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.  హోండా యూత్ ను బాగా అట్రాక్ట్ చేస్తుంది.

హీరో ఎక్స్‌ట్రీమ్ 125R, హోండా CB 125 పోలికలు

Advertisement

హీరో ఎక్స్‌ ట్రీమ్ 125R తక్కువ ధరను కలిగి ఉంటుంది. రూ.89,000 నుంచి రూ. 1.05 లక్షలు ఉంటుంది. హోండా CB 125 హార్నెట్ ధర కాస్త ఎక్కువగా ఉంటుంది. రూ. 1.04 నుంచి రూ. 1.15 లక్షలు ఉంటుంది. ఇంజిన్, పవర్ విషయానికి వస్తే హీరో 124.7cc,  హోండా 123.94cc సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. హీరో ఎక్స్‌ ట్రీమ్ 125R  లీటర్ కు 66 కిలో మీటర్ల మైలేజ్ అందిస్తే,  హోండా CB 125 హార్నెట్ మీద లీటర్ పెట్రల్ కు 48 కిలో మీటర్లు ప్రయాణించే అవకాశం ఉంటుంది.

Read Also: ఇది ప్రపంచంలోనే కాస్లీయెస్ట్ ఎలక్ట్రిక్ కారు, ధర ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే!

Advertisement

ఇక ఫీచర్ల విషయానికి వస్తే హోండా 4.2-అంగుళాల TFT స్క్రీన్, USD ఫోర్కులు, హోండా రోడ్‌ సింక్‌ ను అందిస్తుంది. హీరో LCD డిస్ ప్లే, ప్రొజెక్టర్ LED హెడ్‌ ల్యాంప్, i3s టెక్‌ ను అందిస్తుంది. భద్రత విషయానికి వస్తే రెండూ ABS, IBS ఆప్షన్స్ ను కలిగి ఉంటుంది.

ఏ బైక్ బెస్ట్ అంటే?

ఒకవేళ మీరు మంచి ప్యూయెల్ ఎఫిషియెన్సీ, ​​తక్కువ ధర, మంచి స్టైలింగ్ కావాలనుకునే వినియోగదారులు హీరో ఎక్స్‌ ట్రీమ్ 125Rని తీసుకోవడం బెస్ట్. ఎక్కువ ధర, తక్కువ ఇంధన ఎఫిషియెన్సీ ఉన్నా, ప్రీమియం హార్డ్‌ వేర్,  మంచి డిస్ ప్లే,  బ్రాండ్ కోసం హోండా CB 125 హార్నెట్‌ను కొనుగోలు చేయడం మంచిది.

Read Also: మహీంద్రా ట్రెయో జోర్ TO యూలర్ హైలోడ్ EV.. బెస్ట్ కార్గో ఎలక్ట్రిక్ ఆటోలు ఇవే!

Related News

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

లాంచ్‌కు ముందే క్రేజీ డీటైల్స్ లీక్.. కొత్త బ్రెజ్జాలో ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

టీవీఎస్ నుంచి సూపర్ సర్‌ ప్రైజ్.. ఒకేసారి 3 మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

కొత్త బ్రెజ్జా To హిలక్స్.. 10 రోజుల్లో 3 క్రేజీ మోడల్స్ ఎంట్రీ!

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

EV బ్యాటరీల్లో ఏది సేఫ్? కొనుగోలు చేసే ముందు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

Big Stories

Advertisement
×