E-Paper
Advertisement

Auto9 Awards 2026: ఆటో9 అవార్డ్స్ 2026.. ఈవీ స్కూటర్ ఆఫ్ ది ఇయర్ గా సత్తా చాటిన టీవీఎస్ ఆర్బిటర్!

Auto9 Awards 2026: ఆటో9 అవార్డ్స్ 2026.. ఈవీ స్కూటర్ ఆఫ్ ది ఇయర్ గా సత్తా చాటిన టీవీఎస్ ఆర్బిటర్!
Advertisement

టీవీఎస్ కంపెనీ ఎప్పటికప్పుడు సరికొత్త మోటార్ సైకిళ్లను అందుబాటులోకి తీసుకొస్తుంది. ఈ ఏడాది కూడా కొత్త బైక్స్ తో పాటు స్కూటర్లను అందుబాటులోకి తీసుకురావాని భావిస్తోంది. ఇక ఈ కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ స్కూటర్ ఆర్బిటర్ మార్కెట్ లో సత్తా చాటుతోంది. మంచి అమ్మకాలతో దూసుకెళ్తుంది. ఈ స్కూటర్ ఆటో9 అవార్డ్స్ 2026 వేడుకలో సత్తా చాటింది. ఈవీ స్కూటర్ ఆఫ్ ది ఇయర్ గా అవార్డును దక్కించుకుంది.

గత ఏడాది ఆగస్టులో విడుదల

ఆగస్టు 2025లో ప్రారంభించబడిన టీవీఎస్ ఆర్బిటర్ రూ. 99,900 అందుబాటులో ఉంటుంది. పట్టణ ప్రయాణాలకు అనుగుణంగా కంపెనీ దీనిని తయారు చేసింది. ఈ స్కూటర్ యువ రైడర్లతో పాటు రోజువారీ ఉపయోగాలకు అనుగుణంగా ఉంటుంది. లుక్ పరంగా ఈ స్కూటర్ ఆకట్టుకుంటుంది.

Advertisement

టీవీఎస్ ఆర్బిటర్ పట్టణాలతో పాటు నగర వినియోగానికి అనువుగా తయారయ్యింది. అందమైన, ఆధునిక డిజైన్‌ను కలిగి ఉంది. ఇది పెద్ద LED లైటింగ్ ఎలిమెంట్స్, చక్కగా ఇంటిగ్రేటెడ్ విండ్‌ స్క్రీన్, సజావుగా మౌల్డ్ చేసిన బాడీ ప్యానెల్‌లను కలిగి ఉంటుంది. మొత్తం డిజైన్ చాలా నీట్ గా ఉంటుంది. ఇది అన్ని వయసుల రైడర్లకు అనుకూలంగా ఉంటుంది.

టీవీఎస్ ఆర్బిటర్ పరిధి, పనితీరు

టీవీఎస్ ఆర్బిటర్ మంచి రేంజ్ ను అందిస్తున్న ఒక ఛార్జ్ మీద 158 కి.మీ వరకు ప్రయాణించే అవకాశం ఉంటుంది. అత్యంత సామర్థ్యం గల ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఇది ఒకటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఈ స్కూటర్ 3.1 kWh బ్యాటరీ ప్యాక్ ద్వారా శక్తిని పొందుతుంది. మరిన్ని బ్యాటరీ ఎంపికలతో అందించబడే TVS iQube లా కాకుండా, ఒకే బ్యాటరీ ప్యాక్ ను కలిగి ఉంటుంది.  ఆర్బిటర్ రోజువారీ నగర ప్రయాణాలపై దృష్టి సారించిన ఒకే కాన్ఫిగరేషన్‌ తో కంపెనీ తీసుకొచ్చింది. ఈ స్కూటర్ బ్లూ టూత్ కనెక్టివిటీని కలిగి ఉన్న పూర్తి డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌తో వస్తుంది. రైడ్ డేటా, స్మార్ట్‌ ఫోన్ ఇంటిగ్రేషన్‌ను అందిస్తుంది.

TVS ఆర్బిటర్‌ ఫీచర్లు

Advertisement

TVS ఆర్బిటర్‌ను పలు సెగ్మెంట్ సంబంధిత ఫీచర్లతో లోడ్ చేయబడి ఉంది. క్రూయిజ్ కంట్రోల్, హిల్ హోల్డ్ అసిస్ట్, రివర్స్ పార్కింగ్ అసిస్ట్, USB ఛార్జింగ్ పోర్ట్, ఓవర్ ది ఎయిర్ అప్‌డేట్స్, స్మార్ట్‌ ఫోన్ యాప్ కనెక్టివిటీ లాంటి ఫీచర్లను కలిగి ఉంది. రోజువారీ పట్టణ వినియోగం కోసం స్కూటర్‌ను మరింత యూజర్ ఫ్రెండ్లీగా రూపొందించింది కంపెనీ.

కలర్ ఆప్షన్స్, పోటీ పడే మోడల్స్ 

టీవీఎస్ ఆర్బిటర్ ఆరు కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. నియాన్ సన్‌ బర్స్ట్, స్ట్రాటోస్ బ్లూ, లూనార్ గ్రే, స్టెల్లార్ సిల్వర్, కాస్మిక్ టైటానియం, మార్టిన్ కాపర్ కలర్స్ తో వస్తుంది. ఈ స్కూటర్ మార్కెట్లో ఏథర్ ఎనర్జీ రిజ్టా లాంటి ఎలక్ట్రిక్ ఫ్యామిలీ స్కూటర్లతో నేరుగా పోటీ పడుతుంది. ఎలక్ట్రిక్ స్కూటర్ విభాగంలో రేంజ్, ఫీచర్ల కోసం చూస్తున్న వినియోగదారులకు ఈ స్కూటర్ అనుకూలంగా ఉంటుంది.

Read Also: మహీంద్రా ట్రెయో జోర్ TO యూలర్ హైలోడ్ EV.. బెస్ట్ కార్గో ఎలక్ట్రిక్ ఆటోలు ఇవే!

Related News

హ్యుందాయ్ బౌల్డర్ కు పేటెంట్.. రగ్గడ్ లుక్‌ లో అదిరిపోయిందిగా!

విన్‌ ఫాస్ట్ డబుల్ సర్‌ ప్రైజ్.. కొత్త ఈ-స్కూటర్, ఈ-బైక్‌కు పేటెంట్!

టాటా అవిన్యా X టెస్టింగ్ షురూ.. నెట్టింట వైరల్ అవుతున్న స్పై షాట్స్!

థార్‌ కు నెక్స్ట్ లెవల్ అవతారం.. విజన్ T వచ్చేస్తోంది!

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

లాంచ్‌కు ముందే క్రేజీ డీటైల్స్ లీక్.. కొత్త బ్రెజ్జాలో ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

Big Stories

Advertisement
×