E-Paper
Advertisement

హీరో To హోండా.. ఇండియన్ మార్కెట్ లో ఎంట్రీ ఇస్తున్న ఫ్లెక్స్ ఫ్యూయల్ బైక్స్ ఇవే!

హీరో To హోండా.. ఇండియన్ మార్కెట్ లో ఎంట్రీ ఇస్తున్న ఫ్లెక్స్ ఫ్యూయల్ బైక్స్ ఇవే!
Advertisement

ఇండియన్ టూ వీలర్ మార్కెట్ లో సరికొత్త విప్లవం మొదలు కాబోతోంది. పెట్రోల్ బైకులకు ప్రత్యామ్నాయ బైకులు విడుదల కాబోతున్నాయి. పెట్రోల్‌ వినియోగాన్ని తగ్గించి, పర్యావరణానికి మేలు చేసే ప్రత్యామ్నాయ ఇంధనాల వైపు కంపెనీలు దృష్టి సారిస్తున్నాయి. ఇందులో భాగంగా ఫ్లెక్స్ ఫ్యూయల్ టెక్నాలజీపై ఫుల్ ఫోకస్ పెడుతున్నాయి. ఇథనాల్ మిశ్రమాలతో నడిచే బైక్‌లను మార్కెట్లోకి తీసుకురావడానికి ప్రముఖ కంపెనీలు సన్నాహాలు చేస్తున్నాయి. వాటిలో టాప్ మోడల్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

⦿ హీరో మోటోకార్ప్

ఫ్లెక్స్ ఫ్యూయల్ వైపు హీరో మోటోకార్ప్ కీలక ముందడుగు వేసింది. దేశంలోనే తొలి మాస్ మార్కెట్ E100 బైక్‌ ను విడుదల చేయడానికి కంపెనీ సిద్ధమవుతోంది. ఈ బైక్ 100 శాతం ఇథనాల్‌ తో నడిచే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. దీంతో ప్రత్యామ్నాయ ఇంధనాల వినియోగంలో ఇది కీలక మైలురాయిగా నిలవనుంది. హీరో మోటోకార్ప్ స్ప్లెండర్ లేదంటే హెచ్‌ఎఫ్ డీలక్స్ ప్లాట్‌ ఫారమ్ ఆధారంగా ఈ E100 బైక్‌ను తీసుకురానున్నట్లు సమాచారం. సాధారణ వినియోగదారులకు అందుబాటులో ఉండే ధరలోనే దీనిని అందించే అవకాశముంది. ఇంధన వ్యయాన్ని తగ్గించడంతో పాటు కాలుష్య నియంత్రణలో ఈ బైక్ సాయపడుతుందని భావిస్తున్నారు.

⦿ హోండా CB300F

Advertisement

మరోవైపు హోండా కూడా ఫ్లెక్స్ ఫ్యూయల్ విభాగంలో అడుగుపెడుతోంది. హోండా CB300F ఫ్లెక్స్ ఫ్యూయల్ మోడల్ E85 ఇంధనంతో నడిచేలా రూపొందించబడింది. ఇందులో 293సీసీ ఇంజిన్ ఉండగా, 24.46 బీహెచ్‌పీ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. డ్యూయల్ ఛానల్ ABS, ట్రాక్షన్ కంట్రోల్ వంటి ఆధునిక ఫీచర్లు కూడా ఇందులో ఉంటాయి.

⦿ సుజుకి గిక్సర్ ఎస్ఎఫ్ 250

సుజుకి కూడా గిక్సర్ SF 250 ఫ్లెక్స్ ఫ్యూయల్ వెర్షన్‌ ను అభివృద్ధి చేస్తోంది. 249సీసీ ఇంజిన్‌తో వచ్చే ఈ బైక్ E85 ఇంధన మిశ్రమానికి అనుకూలంగా రూపొందించబడింది. భవిష్యత్తులో ఇథనాల్ వినియోగం పెరిగితే ఈ మోడల్‌కు మంచి డిమాండ్ ఉండే అవకాశం ఉంది.

⦿ రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350

Advertisement

పాపులర్ బ్రాండ్ రాయల్ ఎన్‌ ఫీల్డ్ కూడా ఈ రేసులో దూసుకొస్తోంది. క్లాసిక్ 350 ఫ్లెక్స్ ఫ్యూయల్ వెర్షన్‌ ను కంపెనీ పరీక్షిస్తున్నట్లు సమాచారం. E85 బ్యాడ్జింగ్‌తో కనిపించిన టెస్ట్ బైక్‌ లు ఇవే అని భావిస్తున్నారు. భవిష్యత్తులో క్లాసిక్ 350 కూడా ఇథనాల్ మిశ్రమ ఇంధనాలతో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

⦿  TVS రైడర్ 125

టీవీఎస్ కూడా రైడర్ 125 ఫ్లెక్స్ ఫ్యూయల్ మోడల్‌ పై పని చేస్తోంది. ఇప్పటికే అపాచీ RTR 200 Fi E100 కాన్సెప్ట్‌ ను ప్రదర్శించిన కంపెనీ, ఇప్పుడు 125సీసీ సెగ్మెంట్‌ లో కూడా ఇథనాల్ ఆధారిత మోడళ్లను తీసుకురావాలని చూస్తోంది. సాధారణ కమ్యూటర్ బైక్ కొనుగోలుదారులను లక్ష్యంగా చేసుకుని ఈ మోడల్‌ ను అభివృద్ధి చేస్తున్నట్లు తెలుస్తోంది. భారత టూ వీలర్ పరిశ్రమలో ఫ్లెక్స్ ఫ్యూయల్ టెక్నాలజీకి ప్రాధాన్యం వేగంగా పెరుగుతోంది. ప్రభుత్వం కూడా ఇథనాల్ వినియోగాన్ని ప్రోత్సహిస్తుండటంతో, రాబోయే సంవత్సరాల్లో ఇలాంటి బైక్‌లు భారత రోడ్లపై మరింత ఎక్కువగా కనిపించే అవకాశం ఉంది.

Read Also: ఇండియన్ ఫస్ట్ ఫ్లెక్స్ ఫ్యూయల్ కారు మోడల్ ఫిక్స్, ప్రత్యేకతలు తెలిస్తే పరేషాన్ కావాల్సిందే!

Related News

హోండా 0 ఆల్ఫా SUV లాంచ్ డేట్ ఫిక్స్.. రేంజ్, ఫీచర్లు చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

కారులో రాకెట్ టెక్నాలజీ.. స్పేస్‌ ఎక్స్‌ తో టెస్లా కొత్త ప్రయోగం చూస్తే మతిపోవాల్సిందే!

మహీంద్రా XUV 3XO సరికొత్త రికార్డు.. 5 లక్షలు దాటిన సేల్స్!

మారుతి కార్లపై అదిరిపోయే డిస్కౌంట్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ. 1.65 లక్షల తగ్గింపు!

హ్యుందాయ్ క్రెటా సరికొత్త రికార్డు.. 15 లక్షలు దాటిన అమ్మకాలు!

ట్రాక్షన్ కంట్రోల్, ఫాస్ట్ ఛార్జింగ్‌.. అప్ డేటెడ్ టీవీఎస్ రైడర్ లో అదిరిపోయే ఫీచర్లు!

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ డ్రైవర్ లేకుండానే నడుస్తుంది.. కొత్త టెక్నాలజీ చూస్తే పిచ్చెక్కాల్సిందే!

మైలేజ్‌లో గ్లాంజా.. బూట్ స్పేస్‌లో ఆల్ట్రోజ్.. ఏ CNG కారు కొంటే బెస్ట్?

Big Stories

Advertisement
×