E-Paper
Advertisement

ఇండియన్ ఫస్ట్ ఫ్లెక్స్ ఫ్యూయల్ కారు మోడల్ ఫిక్స్, ప్రత్యేకతలు తెలిస్తే పరేషాన్ కావాల్సిందే!

ఇండియన్ ఫస్ట్ ఫ్లెక్స్ ఫ్యూయల్ కారు మోడల్ ఫిక్స్, ప్రత్యేకతలు తెలిస్తే పరేషాన్ కావాల్సిందే!
Advertisement

భారత ఆటో రంగంలో మరో కీలక మార్పుకు మారుతి సుజుకి శ్రీకారం చుట్టింది. అతిపెద్ద కార్ల తయారీ సంస్థ అయిన మారుతి సుజుకి,  ఇండియన్ ఫస్ట్ ఫ్లెక్స్ ఫ్యూయల్ కారును ఈ నెలలో మార్కెట్లోకి తీసుకురావడానికి రెడీ అవుతోంది. ఈ కొత్త మోడల్ వాగన్ ఆర్ ఆధారంగా రూపొందించబడనుంది.

ఇంతకీ ఈ కారు ప్రత్యేకత ఏంటంటే?

Advertisement

ఫ్లెక్స్-ఫ్యూయల్ వాహనాలు పెట్రోల్‌ తో పాటు అధిక శాతం ఇథనాల్ కలిగిన ఇంధనంతో కూడా నడిచేలా రూపొందించబడతాయి. కొత్త వాగన్ ఆర్ E85 ఇంధనానికి అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. అంటే, ఇందులో 85 శాతం ఇథనాల్, 15 శాతం పెట్రోల్ మిశ్రమాన్ని ఉపయోగించవచ్చు. అయితే, ఇది పూర్తిగా ఇథనాల్‌తో కూడిన E100 ఇంధనంపై కూడా నడుస్తుందా? లేదా? అన్న విషయంపై ఇంకా స్పష్టత లేదు. ఇటీవల కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ వాహనాల పరీక్షలు, ధృవీకరణ ప్రమాణాల్లో E100 ఇంధనాన్ని చేర్చింది. భవిష్యత్తులో పూర్తిగా ఇథనాల్‌ తో నడిచే వాహనాల తయారీకి మార్గం సుగమమైంది. ఈ నేపథ్యంలోనే మారుతి సుజుకి ఫ్లెక్స్-ఫ్యూయల్ కారును తీసుకురావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇథనాల్ మిశ్రమ ఇంధనాలకు అనుగుణంగా వాహనాలను తయారు చేసే సాంకేతిక సామర్థ్యం తమ కంపెనీకి ఉందని మారుతి సుజుకి కార్పొరేట్ వ్యవహారాల సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాహుల్ భారతి  తెలిపారు. ప్రభుత్వం అవసరాన్ని బట్టి తమ మద్దతు ఎప్పుడూ ఉంటుందన్నారు. అయితే, ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఇథనాల్ ఇంధన పంపిణీ వ్యవస్థ పూర్తిస్థాయిలో అందుబాటులో లేకపోవడం సవాల్‌ గా మారింది. ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాల వినియోగం పెరగాలంటే మరిన్ని మోడళ్లు మార్కెట్లోకి రావడంతో పాటు, ఇథనాల్, పెట్రోల్ ధరల మధ్య సరైన సమతుల్యత ఉండాలని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

ధర కాస్త ఎక్కువే అయినప్పటికీ..

Advertisement

సాధారణ కార్లతో పోలిస్తే ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాల తయారీ ఖర్చు కొంత ఎక్కువగా ఉంటుంది. ఒక్కో వాహనంపై సుమారు రూ.40 వేల నుంచి రూ.50 వేల వరకు అదనపు వ్యయం అయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటి వరకు భారత్ మొబిలిటీ ఎక్స్‌ పోలో పలు కంపెనీలు ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాల మోడల్స్ ను ప్రదర్శించినప్పటికీ, కమర్షియల్ గా ఏ మోడల్ కూడా అందుబాటులోకి రాలేదు. ఈ పరిస్థితుల్లో మారుతి వాగన్ ఆర్ ఫ్లెక్స్ ఫ్యూయల్ వెర్షన్ విడుదలైతే దేశంలో ఈ విభాగంలో తొలి అడుగుగా నిలవనుంది.

ఇక ప్రభుత్వం కూడా ప్రస్తుతం అమలులో ఉన్న E20 ప్రమాణాన్ని మరింత పెంచే దిశగా ఆలోచిస్తోంది. భవిష్యత్తులో E21, E22, E25 స్థాయిల వరకు ఇథనాల్ మిశ్రమాన్ని పెంచే అవకాశాలపై చర్చలు జరుగుతున్నాయి. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే దేశంలోని కోట్లాది వాహనదారులపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఫ్లెక్స్ ఫ్యూయల్ వాగన్ ఆర్ విడుదల భారత ఆటోమొబైల్ రంగంలో ఒక కీలక మైలురాయిగా మారే అవకాశం కనిపిస్తోంది.

Read Also: ఈ కారును రెండేళ్లు వాడుకొని వెనక్కి ఇచ్చేయొచ్చు, ఇదీ కదా అదిరిపోయే ఆఫర్ అంటే!

Related News

100 కి.మీ స్పీడ్.. 200 కి.మీ రేంజ్.. ఆంపియర్ కొత్త ఎలక్ట్రిక్ బైక్‌కు పేటెంట్!

బజాజ్ బిగ్ రికార్డ్.. 3 లక్షల EV అమ్మకాలు దాటేసింది!

8 నెలల్లోనే 10 లక్షలు.. ఎలక్ట్రిక్ స్కూటర్ల సేల్ లో అదిరిపోయే రికార్డ్!

హ్యుందాయ్ కొత్త SUV ఇంటీరియర్ లీక్.. క్రెటాకు పోటీ తప్పదా?

మాన్యువల్ కార్ల కంటే ఆటోమేటిక్ కార్లే ఫాస్టా? ఇదీ అసలు కథ!

ఏంటీ.. మారుతీ, హుందాయ్‌లో 5 స్టార్ సేఫ్టీ కార్లు ఉన్నాయా? ఇదిగో లిస్టు!

యమహా R2 వచ్చేసింది.. ఈ బైక్‌ లో అదిరిపోయే 5 హైలైట్స్ ఇవే!

సింపుల్ ఫ్లిప్ అప్ కాదు.. ఈ హెల్మెట్ 180 డిగ్రీలు తిరుగుతుంది!

Big Stories

Advertisement
×