E-Paper
Advertisement

యూత్ ను కట్టిపడేసే సూపర్ బైక్స్.. 150-200cc బెస్ట్ మోడల్స్ ఇవే!

యూత్ ను కట్టిపడేసే సూపర్ బైక్స్.. 150-200cc బెస్ట్ మోడల్స్ ఇవే!
Advertisement

Best 150-200cc Bikes 2026: భారత్ లో 150–200cc మోటార్‌ సైకిల్ సెగ్మెంట్ ఇప్పుడు చాలా వేగంగా పెరుగుతోంది. సాధారణ 100–110cc కమ్యూటర్ బైక్‌ లతో పోలిస్తే ఎక్కువ పవర్‌, మంచి హైవే స్టెబిలిటీ, మెరుగైన బ్రేకింగ్ సిస్టమ్‌, ఆధునిక ఫీచర్లతో ఆకట్టుకుంటాయి. అదే సమయంలో ధర కూడా ప్రీమియం స్థాయిలో కాకుండా ఎక్కువ మంది ఈ సెగ్మెంట్ వైపు చూస్తున్నారు. ముఖ్యంగా రోజువారీ ప్రయాణంతో పాటు వీకెండ్ హైవే రైడ్స్‌ చేయాలనుకునే వారికి ఇవి బెస్ట్ ఆప్షన్‌ గా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న బెస్ట్ 5 మోడల్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

⦿ Hero Xtreme 160R

150–200cc సెగ్మెంట్‌ లో తక్కువ ధరలో మంచి గుర్తింపు బైక్‌ లలో హీరో ఎక్స్ ట్రీమ్ 160R ఒకటి. 163cc ఇంజన్‌ తో వచ్చే ఈ బైక్ సుమారు 15hp పవర్ అందిస్తుంది. స్పోర్టీ లుక్‌ తో పాటు లైట్ వెయిట్ బాడీ కారణంగా సిటీ రైడింగ్‌ కు సులభంగా ఉంటుంది. తక్కువ ధరలో మంచి పనితీరు కావాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్ గా చెప్పుకోవచ్చు.

⦿ Honda Unicorn

Advertisement

మరో బెస్ట్ మోడల్ హోండా యూనికార్న్. ఈ బైక్ గత రెండు దశాబ్దాలుగా భారత మార్కెట్లో సత్తా చాటుతోంది. 162cc ఇంజన్‌ తో మంచి మైలేజ్‌, సాఫ్ట్ రైడింగ్ అనుభూతిని ఇస్తుంది. ముఖ్యంగా కంఫర్ట్‌, డ్యూరబిలిటీ కోరుకునే కమ్యూటర్ రైడర్లకు ఫేవరెట్ బైక్‌ గా కొనసాగుతోంది.

⦿ TVS Apache RTR 160 2V

స్పోర్టీ కమ్యూటర్ సెగ్మెం ట్‌ లో టీవీఎస్ ఆపాచీ RTR 160 2V గురించి స్పెషల్ గా చెప్పుకోవాలి. 160cc ఇంజన్‌ తో మంచి పవర్‌, మూడు రైడ్ మోడ్‌ లు, డిజిటల్ క్లస్టర్ లాంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. యంగ్ రైడర్లు ఎక్కువగా ఈ బైక్‌ ను ఇష్టపడతారు. ఎందుకంటే పర్ఫార్మెన్స్, స్టైల్ రెండింటినీ కలిపి ఉంటుంది.

⦿ Honda SP160

Advertisement

ఇక హోండా నుంచి వచ్చిన హోండా SP160 ఆధునిక ఫీచర్లతో ఆకట్టుకుంటోంది. TFT డిస్‌ ప్లే, బ్లూటూత్ కనెక్టివిటీ, USB టైప్-C ఛార్జింగ్, ABS వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. యూనికార్న్ కంటే కొంచెం స్పోర్టీ డిజైన్‌తో రావడం అదనపు ఆకర్షణగా చెప్పుకోవచ్చు.

⦿ Bajaj Pulsar N160

బజాజ్ పల్సర్ N160 స్టైలిష్ ఆప్షన్‌గా చెప్పొచ్చు. 164cc ఇంజన్‌ తో మంచి టార్క్‌, రైడింగ్ మోడ్‌లు, నావిగేషన్ ఫీచర్లు లాంటి ఆధునిక టెక్నాలజీ ఇందులో ఉన్నాయి. ముఖ్యంగా డ్యూయల్ ఛానల్ ABS వేరియంట్ సేఫ్టీ పరంగా మంచి ఆప్షన్ గా భావిస్తున్నారు. మొత్తంగా 150–200cc సెగ్మెంట్ బైక్‌ లు ఇప్పుడు పనితీరు, మైలేజ్‌, ఫీచర్ల మధ్య మంచి బ్యాలెన్స్ అందిస్తున్నాయి.

Read Also: తక్కువ ధరలో ఎక్కువ మైలేజ్.. టాప్ కమ్యూటర్ బైక్‌ల జాబితా!

Related News

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

EV బ్యాటరీల్లో ఏది సేఫ్? కొనుగోలు చేసే ముందు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

వర్షాకాలంలో ఎలక్ట్రిక్ కారు కొనాలనుకుంటున్నారా? ఈ 4 మోడల్స్ బెస్ట్ ఛాయిస్!

కియా సైరోస్ EV vs కియా సైరోస్ ICE.. ఏది బెస్ట్? పూర్తి పోలిక ఇదే!

16 ఏళ్ల తర్వాత నిస్సాన్ మాస్టర్‌ పీస్.. కొత్త ఎల్గ్రాండ్ వచ్చేసింది!

భారత మార్కెట్ లోకి చౌకైన 7-సీటర్‌.. ఏంటీ.. ధర మరీ అంత తక్కువా?

MG కొత్త EV వచ్చేస్తోంది.. 600 కి.మీ రేంజ్‌తో అదిరే ఎంట్రీ!

సింగిల్ ఛార్జ్ తో 500 కి.మీ ప్రయాణం.. మార్కెట్ లో దుమ్మురేపబోతున్న హ్యుందాయ్ ఈవీ!

Big Stories

Advertisement
×