E-Paper
Advertisement

రాప్తాడు వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి సోదరుడి అరెస్ట్.. కొత్తమలుపు తిరిగిన హత్య కేసు ఘటన

రాప్తాడు వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి సోదరుడి అరెస్ట్..  కొత్తమలుపు తిరిగిన హత్య కేసు ఘటన
Advertisement

Anantapur District: అనంతపురం జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. తాజాగా ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. రాప్తాడు వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి సోదరుడు, రాజశేఖర్ రెడ్డిని అనంతపురం పోలీసులు అరెస్టు చేశారు. ఓ యువకుడి హత్య కేసులో ఆయన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

రాప్తాడు వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి సోదరుడి అరెస్ట్

Advertisement

తోపుదుర్తి మహేశ్వర్ రెడ్డి అనుమానాస్పద మృతి కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి సోదరుడు రాజశేఖర్ రెడ్డి మంగళవారం అనంతపురం జిల్లా రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. దర్యాప్తు తర్వాత అనుమానాస్పద మృతి కేసును హత్య కేసుగా మార్చారు పోలీసులు. అసలు ఈ కేసులో ఏం జరిగింది?

2025 లో జరిగిన ఘటన ఇది. ఈ కేసు పూర్తి వివరాల్లోకి ఒక్కసారి వెళ్దాం. సోషల్ మీడియాలో అప్పటి ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి వర్గానికి వ్యతిరేకంగా కొన్ని పోస్టులు పెట్టాడు మృతుడు మహేశ్వర్ రెడ్డి. ఈ క్రమంలో తోపుదుర్తి సోదరుడు రాజశేఖర్ రెడ్డి.. ఆ యువకుడిని తీవ్రంగా బెదిరించినట్లు ఆరోపణలు లేకపోలేదు. బెదిరింపులు తట్టుకోలేక మహేశ్వర్ రెడ్డి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.

Advertisement

కొత్త మలుపు తిరిగిన హత్య కేసు ఘటన

ఈ వ్యవహారంపై మృతుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మాజీ ఎమ్మెల్యే సోదరుడు రాజశేఖర్ రెడ్డి తనపై కొడుకుపై బెదిరింపులకు దిగినట్టు కొన్ని డిజిటల్ ఆధారాలను పోలీసులకు సమర్పించారు. వాటిని క్షుణ్నంగా పరిశీలించారు పోలీసులు. మొదట రైల్వే పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేశారు.

కేసు తీవ్రత దృష్ట్యా దాన్ని అనంతపురం రూరల్-రాప్తాడు పోలీసులు సంయుక్తంగా విచారణ చేపట్టారు. విచారణలో లభించిన ఆధారాల మేరకు మంగళవారం నిందితులు తోపుదుర్తి రాజశేఖర్ రెడ్డి, అనుచరుడు జైపాల్ రెడ్డిలను అరెస్ట్ చేశారు. తోపుదుర్తి వ్యవహారం ఉమ్మడి అనంతపురం జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది.

ALSO READ: అన్నపైనే పడి ఏడుస్తావా? షర్మిలకు రాచమల్లు కౌంటర్.. బాబు మాటేంటి?

Related News

స్థానిక ఎన్నికల వేల నేతలకు సీఎం చంద్రబాబు వార్నింగ్.. ఎమన్నారంటే?

ఎంపీ మిథున్ రెడ్డికి బిగ్ షాక్.. ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేసే చాన్స్..?

ఏపీలో తీవ్ర విషాదం.. అమలాపురం మాజీ ఎంపీ బుచ్చిబాబు కన్నుమూత!

తెలుగుదేశం పార్టీ రెండో జాబితా విడుదల.. ఇందులోను మహిళలదే హవా!

పులివెందులలో హైటెన్షన్.. నామినేషన్ కేంద్రం వద్ద కాల్పులు జరిపిన పోలీసులు!

సాలూరు జనసేనలో భగ్గుమన్న చైర్మన్ టికెట్ వివాదం.. కేడర్ తీవ్ర ఆగ్రహం!

రాజంపేటలో ఉద్రిక్తత.. వైసీపీ ఎమ్మెల్యే అమర్‌నాథ్ రెడ్డి ఇంటిపై దాడి!

ఏపీలో స్థానిక ఎన్నికల ఘర్షణలు.. వైఎస్ షర్మిల సంచలన కామెంట్స్!

Big Stories

Advertisement
×