E-Paper
Advertisement

Hero Xoom 125: లక్షలోపు ధర, 50 కి.మీ మైలేజ్.. ఈ హీరో స్కూటర్ గురించి తెలుసా?

Hero Xoom 125: లక్షలోపు ధర, 50 కి.మీ మైలేజ్.. ఈ హీరో స్కూటర్ గురించి తెలుసా?
Advertisement

హీరో నుంచి పలు స్కూటర్లు అందుబాటులో ఉన్నాయి. వాటిలో హీరో జూమ్ 125 (Xoom 125) వినియోగదారులను బాగా ఆకట్టుకుంటుంది. ఇది స్పోర్టీ లుక్ లో 125cc స్కూటర్ గా మార్కెట్ కు పరిచయం అయ్యింది. జనవరి 17, 2025న ఇండియాలో లాంచ్ అయింది. స్టైలిష్ డిజైన్, క్విక్ యాక్సిలరేషన్, స్మార్ట్ ఫీచర్స్‌ తో ఫ్యామిలీ, సిటీ రైడ్‌ కు బెస్ట్ ఆప్షన్ గా కొనసాగుతోంది. 125M ఎడిషన్ కూడా అందుబాటులో ఉంది.

Hero Xoom 125 స్పెసిఫికేషన్స్  

ఈ స్కూటర్ 124.6 cc, ఎయిర్-కూల్డ్, 4-స్ట్రోక్ SI ఇంజన్ ను కలిగి ఉంటుంది. 7.3 kW (9.8 PS) @ 7250 rpm పవర్, 10.4 Nm @ 6000 rpm టార్క్ ను అందిస్తుంది. క్లెయిమ్డ్ మైలేజ్ 50.5 kmpl కాగా, వాస్తవంగా45-50 kmpl వస్తుంది. టాప్ స్పీడ్ 95 kmph. బ్రేక్స్ విషయానికి వస్తే, ఫ్రంట్ డిస్క్(ZX వేరియంట్, పీటల్ టైప్), రియర్  డ్రమ్ తో వస్తుంది. సస్పెన్షన్ ఫ్రంట్ టెలిస్కోపిక్ హైడ్రాలిక్, రియర్ యూనిట్ స్వింగ్‌తో స్ప్రింగ్ ను కలిగి ఉంటుంది. ఫ్యూయల్ ట్యాంక్ 5.2 లీటర్ల సామర్థ్యంతో వస్తుంది. బూట్ స్పేస్ 22 లీటర్లు, హెల్మెట్ ఫిట్ అవుతుంది.

వేరియంట్లు , ధర

Advertisement

VX (బేసిక్): రూ.80,494 – కాస్ట్ అలాయ్ వీల్స్, LED వింకర్స్, డిజిటల్ కాన్సోల్.

ZX (టాప్): రూ. 86,025 – M/C అలాయ్ వీల్స్, సీక్వెన్షియల్ LED వింకర్స్, ఫ్రంట్ డిస్క్ బ్రేక్, టర్న్-బై-టర్న్ నావిగేషన్, ఫ్రంట్ స్టోరేజ్, బూట్ ల్యాంప్, ఇల్యూమినేటెడ్ స్టార్ట్ బటన్.

Advertisement

ఆన్ రోడ్ ధర: రూ. 90,000 –రూ.1 లక్ష వరకు ఉంటుంది.

Hero Xoom 125 కలర్స్

ఈ స్కూటర్ ముఖ్యంగా నాలుగు రంగుల్లో అందుబాటులో ఉంది. మ్యాట్ గ్రే, వైబ్రెంట్ బ్లూ మెటాలిక్, మ్యాట్ గియాలో లైమ్, క్యాండీ బ్లేజింగ్ రెడ్ లో ఉంటుంది. (125M ఎడిషన్‌లో స్పెషల్ కలర్స్ ఉంటాయి.

Hero Xoom 125  ఫీచర్స్

LED ప్రాజెక్టర్ హెడ్‌ ల్యాంప్, ఫాల్కన్ ఇన్‌స్పైర్డ్ పొజిషన్ లైట్, సీక్వెన్షియల్ LED వింకర్స్ (ZX) లైటింగ్ ఉంటుంది. డిజిటల్ స్పీడోమీటర్ బ్లూటూత్ కనెక్టివిటీ,  టర్న్ బై టర్న్ నావిగేషన్ (ZX), రియల్ టైమ్ మైలేజ్, డిస్టెన్స్ టు ఎంప్టీ ఆప్షన్స్ ను కలిగి ఉంటుంది. USB చార్జింగ్ పోర్ట్, ఎక్స్‌ టర్నల్ ఫ్యూయల్ లిడ్ విత్ ఓపెన్ బజ్జర్, ఫ్రంట్ స్టోరేజ్ (ZX), బూట్ ల్యాంప్ (ZX) ఉంటుంది.  0-60 kmph 7.6 సెకెన్లలో అందుకుంటుంది. ఫ్రంట్ డిస్క్ బ్రేక్ (ZX), సీట్ బెల్ట్ లాక్, సైడ్ స్టాండ్ ఇండికేటర్, సుపీరియర్ గ్రిప్ టైర్స్ ఉంటాయి.

అనుకూలతలు, ప్రతికూలతలు

స్పోర్టీ లుక్, ప్రీమియం ఫీల్.  ఎక్సిలెంట్ మైలేజ్,  పవర్ బ్యాలెన్స్. స్మార్ట్ ఫీచర్స్,  విలైట్ ఫర్ మనీ. ఈజీ హ్యాండ్లింగ్ అనుకూలతలుగా చెప్పుకోవచ్చు. ప్రతికూలతల విషయానికి వస్తే, బేసిక్ వేరియంట్‌లో కొన్ని ప్రీమియం ఫీచర్స్ లేవు. రైడర్ సీట్ కొంచెం షార్ప్, లాంగ్ రైడ్స్‌ కు కాస్త అసౌకర్యం ఉంటుంది. కాంపిటీటర్స్ హోండా యాక్టివా, TVS జుపిటర్  కంటే బూట్ స్పేస్ తక్కువ ఉంటుంది. ఇది ఫస్ట్ టైమ్ స్కూటర్ బైయర్స్, ఫ్యామిలీ యూజ్‌కు పర్ఫెక్ట్ గా చెప్పుకోవచ్చు.

Read Also:  జస్ట్ రూ. 1.9 లక్షలు.. చీపెస్ట్ ఇండియన్ మేడ్ ఎలక్ట్రిక్ కారు వచ్చేస్తోంది!

Related News

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

లాంచ్‌కు ముందే క్రేజీ డీటైల్స్ లీక్.. కొత్త బ్రెజ్జాలో ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

టీవీఎస్ నుంచి సూపర్ సర్‌ ప్రైజ్.. ఒకేసారి 3 మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

కొత్త బ్రెజ్జా To హిలక్స్.. 10 రోజుల్లో 3 క్రేజీ మోడల్స్ ఎంట్రీ!

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

EV బ్యాటరీల్లో ఏది సేఫ్? కొనుగోలు చేసే ముందు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

Big Stories

Advertisement
×