E-Paper
Advertisement

India’s Cheapest EV Car: జస్ట్ రూ. 1.9 లక్షలు.. చీపెస్ట్ ఇండియన్ మేడ్ ఎలక్ట్రిక్ కారు వచ్చేస్తోంది!

India’s Cheapest EV Car: జస్ట్ రూ. 1.9 లక్షలు.. చీపెస్ట్ ఇండియన్ మేడ్ ఎలక్ట్రిక్ కారు వచ్చేస్తోంది!
Advertisement

India’s Cheapest Electric Car: భారతీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాల ఫ్లో పెరుగుతోంది. ఈ విభాగంలో ఆయా కంపెనీల నుంచి సరికొత్త మోడల్స్ అందుబాటులోకి వస్తున్నాయి. ఎప్పటికప్పుడు అప్ డేట్ చేస్తూ, తక్కువ ధరలో ఎక్కువ మైలేజ్ ఇచ్చే ఈవీలను విడుదల చేస్తున్నాయి. పెద్ద కంపెనీలకు సవాల్ విసిరేలా స్టార్టప్ కంపెనీలు మరింత తక్కువ ధరలు ఈవీలను తయారు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. తాజాగా వింగ్స్ EV (Wings EV) అనే ఇండోర్ స్టార్టప్ దేశంలో తొలి ఎలక్ట్రిక్ మైక్రో కార్ (క్వాడ్రిసైకిల్ కేటగిరీ)గా పరిచయమవుతోంది.

ప్రకాష్ దండేకర్, ప్రణవ్ దండేకర్ అనే ఇద్దరు తండ్రీ కొడుకులు ఈ సంస్థను స్థాపించారు. తాజాగా ఈ కంపెనీ రాబిన్ EVని తయారు చేసింది. ఇది బైక్ సైజులో ఉండే చిన్న ఎలక్ట్రిక్ కారు. ఇంకా చెప్పాలంటే టాటానానోతో పోల్చితే సగం ఉంటుంది. ఈ EV కేవలం 2.25 మీటర్ల పొడవు, 945 మిమీ వెడల్పు, 1,560 మిమీ ఎత్తులో ఉంటుంది. ఇది మోటార్ సైకిల్ కు అవసరమైనంత స్థలాన్ని మాత్రమే తీసుకుంటుంది. సిటీ డ్రైవ్, టాఫిక్ లో సులభంగా నడిపేలా రూపొందించారు. 2025లో లాంచ్ అయ్యింది. డెలివరీలు కూడా ప్రారంభం కాబోతున్నాయి.

ఫీచర్లు, స్పెసిఫికేషన్స్

Advertisement

ఇది టూ-సీటర్ ఎలక్ట్రిక్ మైక్రో-కారు (క్వాడ్రిసైకిల్) గా వస్తుంది. 5.6 kWh LFP (లిథియం ఐరన్ ఫాస్ఫేట్) బ్యాటరీ  ప్యాక్ ను కలిగి ఉంటుంది. 65-90 కి.మీ (వేరియంట్ పై ఆధారపడి) రేంజ్ అందిస్తుంది. సాధారణ 16A ప్లగ్‌తో 5 గంటల్లో ఫుల్ ఛార్జ్ అవుతుంది. 6 kW (రెండు BLDC హబ్ మోటార్లు) పవర్, 282 Nm టార్క్ అందిస్తుంది. AC, సీట్ బెల్ట్స్, హెడ్‌ల్యాంప్స్, టైల్ ల్యాంప్స్, స్టీరింగ్, బ్రేక్స్ ఉంటాయి. ARAI 7 సేఫ్టీ టెస్టుల్లో పాస్ అయ్యింది. 3 వేరియంట్లు, ప్రతి ఒక్కటి 3 కలర్స్‌ లో లభిస్తుంది.

ధర ఎంత అంటే?

రాబిన్ EVని బేసిక్ వేరియంట్ ధర రూ. 1.99 లక్షలు ఉంటుంది. మిడ్ రేంజ్ వేరియంట్ రూ. 2.5 లక్షలు ఉంటుంది. లగ్జరీ వేరియంట్ రూ. 3 లక్షలు ఉంటుంది.

రాబిన్ EVని అనుకూలతలు, ప్రతికూలతలు

Advertisement

చాలా  చౌక ధరకు లభిస్తుంది.  బైక్ ధరకే కారు దొరుకుతుంది. సిటీలో పార్కింగ్ సులభం, ట్రాఫిక్‌ లోనూ ఈజీగా వెళ్లిపోవచ్చు. జీరో పొల్యూషన్, లో మెయింటెనెన్స్ ఉంటుంది. AC ఉండటం వల్ల మన వాతావరణానికి పర్ఫెక్ట్ గా ఉంటుంది. రేంజ్ తక్కువ కాబట్టి సిటీ యూజ్‌కు మాత్రమే బెస్ట్. హైవే స్పీడ్ లిమిటెడ్(క్వాడ్రిసైకిల్ కేటగిరీ కాబట్టి)గా ఉంటుంది.

ప్రీ బుకింగ్స్ ఓపెన్

రాబిన్ EVకి సంబంధించి ప్రీ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌ సైట్ wingsev.com చూడండి. టెస్ట్ డ్రైవ్ కోసం బుక్ చేసుకోవచ్చు. మొదటి సంవత్సరం 3000 యూనిట్లు సేల్ టార్గెట్ గా కంపెనీ పని చేస్తుంది. ఒకవేళ మీకు కూడా బడ్జెట్ ఈవీ కావాలంటే ఇది సూపర్ ఆప్షన్ గా చెప్పుకోవచ్చు.

Read Also: సియోర్రా To అవిన్యా.. 2026లో లాంచ్ కాబోతున్న టాటా ఈవీలు ఇవే!

Related News

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

లాంచ్‌కు ముందే క్రేజీ డీటైల్స్ లీక్.. కొత్త బ్రెజ్జాలో ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

టీవీఎస్ నుంచి సూపర్ సర్‌ ప్రైజ్.. ఒకేసారి 3 మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

కొత్త బ్రెజ్జా To హిలక్స్.. 10 రోజుల్లో 3 క్రేజీ మోడల్స్ ఎంట్రీ!

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

EV బ్యాటరీల్లో ఏది సేఫ్? కొనుగోలు చేసే ముందు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

Big Stories

Advertisement
×