E-Paper
Advertisement

Suzuki Gixxer: అదిరిపోయే రంగుల్లో కొత్త సుజుకి బైక్స్, చూస్తే వావ్ అనాల్సిందే!

Suzuki Gixxer: అదిరిపోయే రంగుల్లో కొత్త సుజుకి బైక్స్, చూస్తే వావ్ అనాల్సిందే!
Advertisement

సుజుకి మోటార్‌ సైకిల్ ఇండియా సరికొత్త బైక్స్ ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. కొత్త రంగులు, రిఫ్రెష్డ్  గ్రాఫిక్స్‌ తో సుజుకి జిక్సర్ SF 250, జిక్సర్ 250 కొత్త వెర్షన్‌ ను విడుదల చేసింది. రంగులు, గ్రాఫిక్స్ మాత్రమే కాకుండా, బైక్స్ లోని ఇతర టెక్నికల్ అంశాల్లోనూ మార్పులు చేసింది.

ఇంజిన్ గురించి..

జిక్సర్ SF 250, జిక్సర్ 250 250cc సింగిల్ సిలిండర్‌తో పాటు సింగిల్ ఓవర్‌ హెడ్ కామ్‌ షాఫ్ట్ డిజైన్‌ను కలిగి ఉన్నాయి.  ఇవి 9,300 rpm దగ్గర 26.5 Ps పవర్ అవుట్‌ పుట్‌ను, 7,300rpm వద్ద 22.2 Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తున్నాయి. ఈ రెండు బైక్స్ అత్యాధునిక సుజుకి ఎకో పెర్ఫార్మెన్స్ (SEP) టెక్నాలజీతో వస్తున్నాయి. ఇంజిన్‌ లోని సుజుకి ఆయిల్ కూలింగ్ సిస్టమ్ తక్కువ ప్యూయెల్ వినియోగంతో పాటు మంచి రైడింగ్ అనుభూతిని అందిస్తుంది. దృఢమైన, తేలికైన చట్రం మీద బిల్డ్ చేయబడిన ఈ బైక్స్ సౌకర్యవంతమైన ఎర్గోనామిక్స్‌ ను అందిస్తాయి.

సరికొత్త రంగుల్లో..

Advertisement

సరికొత్త జిక్సర్ SF 250 ఇప్పుడు రెండు కొత్త రంగులలో అందుబాటులో ఉంది.  గ్లాస్ స్పార్కిల్ బ్లాక్ , పెర్ల్ గ్లేసియర్ వైట్, మెటాలిక్ మ్యాట్ ప్లాటినం సిల్వర్,  ఇప్పటికే ఉన్న మెటాలిక్ ట్రిటాన్ బ్లూ, పెర్ల్ గ్లేసియర్ వైట్ రంగుల్లో లభిస్తున్నాయి. మస్క్యులర్ డిజైన్, చురుకైన పనితీరుకు ప్రసిద్ధి చెందిన జిక్సర్ 250 ఇప్పుడు మూడు కొత్త కలర్ ఆప్షన్స్ ను అందిస్తుంది.  పెర్ల్ గ్లేసియర్ వైట్, మెటాలిక్ మ్యాట్ ప్లాటినం సిల్వర్, మెటాలిక్ ట్రైటన్ బ్లూ, గ్లాస్ స్పార్కిల్ బ్లాక్, గ్లాస్ స్పార్కిల్ బ్లాక్ లో అందుబాటులో ఉంది. .

సరికొత్త రంగులు వినియోగదారులను మరింత ఆకట్టుకుంటాయని సుజుకి మోటార్ సైకిల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సేల్స్, మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ దీపక్ ముట్రేజా వెల్లడించారు. లేటెస్ట్ కలర్స్ పాలెట్, గ్రాఫిక్స్‌ తో, జిక్సర్ SF 250, జిక్సర్ 250  స్పోర్టీ క్యారెక్టర్‌ను పెంచే అద్భుతమైన విజువల్ అప్పీల్‌ను పొందుతాయన్నారు. ఈ మోటార్‌ సైకిళ్ల పనితీరు, అధునాతన ఇంజనీరింగ్‌ను మిక్స్ చేసి అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. స్పోర్టీ అయినప్పటికీ సౌకర్యవంతమైన రైడింగ్ అనుభవాన్ని కోరుకునే రైడర్లకు ఈ బైక్స్ అనుకూలంగా ఉంటాయని చెప్పుకొచ్చారు.

ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

Advertisement

యూరోపియన్ ప్రేరేపిత స్ట్రెయిట్ అహెడ్ స్పోర్ట్స్ బైక్ డిజైన్ LED లైటింగ్, సుజుకి రైడ్ కనెక్ట్‌ తో బ్లూటూత్ ఎనేబుల్డ్ మల్టీ ఫంక్షన్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ సహా పలు లేటెస్ట్ ఫీచర్లను కలిగి ఉన్నాయి. బ్రష్డ్ ఫినిషింగ్, సుజుకి ఈజీ స్టార్ట్ సిస్టమ్‌తో కొత్తగా అభివృద్ధి చేయబడిన 10 స్పోక్ అల్లాయ్ వీల్స్ డిజైన్ రైడింగ్ అనుభూతిని మరింత పెంచుతాయి.

Read Also: ఇండియాలో టాప్ రేంజ్ ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే, ఒక్కోటి ఎంత దూరం వెళ్తాయంటే?

ధర ఎంత అంటే?

జిక్సర్ SF 250 ధర రూ. 1,89,768 కాగా, సుజుకి జిక్సర్ 250 ధర రూ. 1,81,517గా కంపెనీ నిర్ణయించింది.

Read Also: వోక్స్‌ వ్యాగన్ నుంచి క్రేజీ కారు, టేరాన్ R-లైన్ లాంచింగ్ ఎప్పుడంటే?

Related News

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

లాంచ్‌కు ముందే క్రేజీ డీటైల్స్ లీక్.. కొత్త బ్రెజ్జాలో ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

టీవీఎస్ నుంచి సూపర్ సర్‌ ప్రైజ్.. ఒకేసారి 3 మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

కొత్త బ్రెజ్జా To హిలక్స్.. 10 రోజుల్లో 3 క్రేజీ మోడల్స్ ఎంట్రీ!

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

EV బ్యాటరీల్లో ఏది సేఫ్? కొనుగోలు చేసే ముందు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

Big Stories

Advertisement
×