E-Paper
Advertisement

Honda Activa: అమ్మకాల్లో హోండా యాక్టివా నయా రికార్డు, ఒకే రాష్ట్రంలో 50 లక్షల యూనిట్లు సేల్!

Honda Activa: అమ్మకాల్లో హోండా యాక్టివా నయా రికార్డు, ఒకే రాష్ట్రంలో 50 లక్షల యూనిట్లు సేల్!
Advertisement

Honda Activa Hits 50 Lakh Sales: ఇండియన్ టూవీలర్ మార్కెట్ లో హోండా యాక్టివా సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఈ స్కూటర్ ను ప్రారంభించి 25 వసంతాలు పూర్తి అయిన నేపథ్యంలో కంపెనీ కీలక ప్రకటన చేసింది. దేశ వ్యాప్తంగా లక్షలాది యాక్టివా స్కూటర్లను అమ్మినట్లు తెలిపింది. అయితే, ఇందులో ఒకే రాష్ట్రంలో ఏకంగా 50 లక్షల యూనిట్లను సేల్ చేసినట్లు ప్రకటించింది. ఇప్పటి వరకు ఏ కంపెనీకి సాధ్యంకాని ఘనతను తాము సాధించినట్లు వివరించింది.

మహారాష్ట్రలో 50 లక్షల యాక్టివా అమ్మకాలు

హోండా మోటార్ సైకిల్ & స్కూటర్ ఇండియా తన యాక్టివా స్కూటర్ 25 సంవత్సరాలలో మహారాష్ట్రలో 50 లక్షల యూనిట్ల యాక్టివా అమ్మకాలను చేరుకున్నట్లు తెలిపింది. దేశంలోని అతిపెద్ద ద్విచక్ర వాహన మార్కెట్లలో ఒకటైన ఈ మోడల్ నాటి నుంచి నేటి వరకు అద్భుతమైన ప్రజాదరణతో దూసుకెళ్తుందని వెల్లడించింది. పూణే, ముంబై, థానే, నాగ్‌పూర్, నవీ ముంబై లాంటి ప్రధాన పట్టణ కేంద్రాల్లో ఎక్కువ డిమాండ్ ఉన్నట్లు తెలిపింది. ఈ సిటీలు తమ టూవీలర్ వినియోగంలో ఎక్కువ వాటాను కలిగి ఉన్నట్లు వివరించింది. ముఖ్యంగా రోజువారీ ప్రయాణానికి ఎక్కువగా వాడుతున్నట్లు చెపపింది. ప్రస్తుతం మహారాష్ట్ర అంతటా 700 పైగా సేల్, సర్వీస్ పాయింట్లను నిర్వహిస్తున్నట్లు తెలిపింది.

సంతోషం వ్యక్తం చేసిన కంపెనీ చీఫ్

Advertisement

మహారాష్ట్రలో యాక్టివా 50 లక్షల యూనిట్ల అమ్మకాల మైలురాయిని దాటడం పట్ల  హోండా మోటార్‌ సైకిల్ & స్కూటర్ ఇండియా సేల్స్, మార్కెటింగ్ డైరెక్టర్ ముట్సువో ఉసుయ్ సంతోషం వ్యక్తం చేశారు. “మహారాష్ట్రలో 5 మిలియన్ల యాక్టివా అమ్మకాలను దాటడం గత 25 సంవత్సరాలుగా బ్రాండ్‌పై కస్టమర్లు ఉంచిన నమ్మకాన్ని ప్రతిబింబిస్తుంది. మహారాష్ట్ర అత్యంత డైనమిక్ మార్కెట్లలో ఒకటిగా ఉంది. ఈ విజయం రోజువారీ ప్రయాణానికి తమ స్కూటర్ ఎంతగా ఉపయోగపడుతుందో సూచిస్తుంది. కస్టమర్ అనుభవాన్ని బలోపేతం చేయడం, మంచి సర్వీస అందించడం ద్వారానే సాధ్యం అయ్యింది” అని వివరించారు.

కొత్త అప్ డేట్స్ తో పోర్ట్‌ ఫోలియో విస్తరణ

ఇక యాక్టివా లైనప్ కు కంపెనీ ఎప్పటికప్పుడు సరికొత్త అప్ డేట్స్ చేస్తోంది. కొత్త ఫీచర్లతో పాటు సాంకేతిక మార్పులతో తీసుకొస్తుంది. ప్రస్తుతం  పలు ఇంజిన్ ఎంపికలలో అందుబాటులో ఉంచింది. ఎలక్ట్రిక్ వాహనాలకు మార్కెట్ లో మంచి డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో రీసెంట్ గా యాక్టివా ఎలక్ట్రిక్ వెర్షన్‌ను కూడా తీసుకొచ్చింది.

Advertisement

ఇక యాక్టివాతో పాటు HMSI పలు ఇంజిన్ సామర్థ్యం గల విభాగాలలో స్కూటర్లు, మోటార్‌ సైకిళ్ల అమ్మకాలను కొనసాగిస్తుంది అధిక సామర్థ్యం గల మోటార్‌ సైకిళ్లు బిగ్‌ వింగ్ నెట్‌ వర్క్ ద్వారా రిటైల్ చేయబడుతున్నాయి. కమ్యూటర్ మోడల్స్ ఎక్కువగా అమ్మకాలు కొనసాగిస్తున్నాయి. ఒకే రాష్ట్రంలో ఒకే మోడల్ కు సంబంధించి 50 లక్షల యూనిట్లు అమ్మడం అంత ఈజీ వ్యవహారం కాదంటున్నారు నిపుణులు. మార్కెట్లో బ్రాండ్ మీద ఉన్న నమ్మకానికి నిదర్శనం అంటున్నారు.

Read Also: పెట్రోల్ కార్లు ఇక ఎలక్ట్రిక్ వెర్షన్ లో.. విన్ ఫాస్ట్ క్రేజీ ఆఫర్!

Related News

వోక్స్‌ వ్యాగన్ కార్లపై కళ్లు ఆఫర్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ.6 లక్షల తగ్గింపు!

సింగిల్ ఛార్జ్ తో 243 కి.మీ రేంజ్.. సింపుల్ వేవ్ సూపర్ స్కూటర్ వచ్చేసింది!

2027లో కొత్త నెక్సాన్.. డిజైన్ నుంచి ఇంజిన్ వరకు అన్నీ మారనున్నాయా?

5 ఏళ్ల తర్వాత పజెరో రీఎంట్రీ.. కొత్త లుక్‌తో మిత్సుబిషి బిగ్ సర్‌ప్రైజ్!

EV కొనేముందు ఈ విషయం చెక్ చేశారా? లేదంటే ఇబ్బందులు తప్పవు!

టాటా దూకుడు.. మహీంద్రా జోరు! ఆగస్టు అమ్మకాల్లో ఎవరు టాప్?

హోండా కొత్త ఈ-స్కూటర్‌కు పేటెంట్.. స్పీడ్ ఎంతో తెలిస్తే వావ్ అనాల్సిందే!

100 కి.మీ స్పీడ్.. 200 కి.మీ రేంజ్.. ఆంపియర్ కొత్త ఎలక్ట్రిక్ బైక్‌కు పేటెంట్!

Big Stories

Advertisement
×