E-Paper
Advertisement

హోండా ఫ్యాన్స్‌ కు గుడ్‌న్యూస్.. ఎలివేట్, సిటీ, అమేజ్‌పై అదిరిపోయే డిస్కౌంట్లు!

హోండా ఫ్యాన్స్‌ కు గుడ్‌న్యూస్.. ఎలివేట్, సిటీ, అమేజ్‌పై అదిరిపోయే డిస్కౌంట్లు!
Advertisement

Honda Car Discounts September 2026:  కొత్త కారు కొనాలని చూస్తున్న వారికి హోండా గుడ్‌న్యూస్ చెప్పింది. సెప్టెంబర్ 2026 నెలకు సంబంధించి పలు మోడళ్లపై స్పెషల్ ఆఫర్లను ప్రకటించింది. హోండా అమేజ్, సిటీ, ఎలివేట్ కార్లపై పలు రకాల డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ బెనిఫిట్స్, లాయల్టీ, కార్పొరేట్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఈ ఆఫర్లు సెప్టెంబర్ 1 నుంచి 30 వరకు మాత్రమే లభిస్తాయని కంపెనీ తెలిపింది.

ఎలివేట్‌పై రూ.1.79 లక్షల వరకు..

హోండా ఎలివేట్ కొనుగోలు చేయాలనుకునే వారికి సెప్టెంబర్‌లో గరిష్ఠంగా రూ.1.79 లక్షల వరకు బెనిఫిట్స్ లభిస్తున్నాయి. ఈ ఆఫర్లు MY25, MY26 మోడళ్లకు వర్తిస్తాయి. ఇందులో రూ.60,000 వరకు క్యాష్ డిస్కౌంట్, రూ.4,000 లాయల్టీ బెనిఫిట్, రూ.10,000 వరకు కార్పొరేట్ డిస్కౌంట్ ఉన్నాయి. వీటితో పాటు ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద రూ.1.05 లక్షల వరకు బెనిఫిట్స్ పొందవచ్చు. మొత్తంగా చూస్తే ఎలివేట్‌పై రూ.1.79 లక్షల వరకు తగ్గింపు లభిస్తోంది. అంతేకాదు, 7 సంవత్సరాల ఎక్స్‌ టెండెడ్ వారంటీపై 50 శాతం డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు. ప్రస్తుతం ఎలివేట్ ధర రూ.11.81 లక్షల నుంచి రూ.16.78 లక్షల వరకు ఉంది.

హోండా సిటీపై పెరిగిన ఆఫర్లు

Advertisement

హోండా సిటీ కొనుగోలుదారులకు ఈ నెలలో రూ.1.30 లక్షల వరకు బెనిఫిట్స్ అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా టాప్ వేరియంట్లపై ఈ ఆఫర్లు వర్తిస్తాయి. క్యాష్ డిస్కౌంట్‌గా రూ.60,000 వరకు, లాయల్టీ బెనిఫిట్‌గా రూ.4,000 వరకు లభిస్తుంది. ఎక్స్ఛేంజ్ బెనిఫిట్ రూ.56,000 వరకు ఉండగా, కార్పొరేట్ డిస్కౌంట్ రూ.10,000 వరకు ఉంది. అలాగే 7 సంవత్సరాల ఎక్స్‌ టెండెడ్ వారంటీపై 50 శాతం తగ్గింపు ఇస్తున్నారు. దీంతో వారంటీ ధర రూ.16,900కి తగ్గుతుంది. హోండా సిటీ ధర ప్రస్తుతం రూ.12.08 లక్షల నుంచి రూ.21.44 లక్షల మధ్య ఉంది.

అమేజ్‌పై రూ.50 వేల బెనిఫిట్స్

అమేజ్ విషయంలో ఆగస్టులో ఉన్న ఆఫర్లనే సెప్టెంబర్‌లో కూడా కొనసాగిస్తున్నారు. సెకెండ్ జెనరేషన్ అమేజ్‌పై రూ.40,000 వరకు బెనిఫిట్స్ లభిస్తాయి. దీనికి అదనంగా 7 సంవత్సరాల ఎక్స్‌టెండెడ్ వారంటీపై 50 శాతం డిస్కౌంట్ అందిస్తున్నారు. దీంతో వారంటీ ధర రూ.14,600గా ఉంటుంది. థర్డ్ జెనరేషన్ అమేజ్‌లో ఎంపిక చేసిన వేరియంట్లపై రూ.15,000 వరకు క్యాష్ డిస్కౌంట్, రూ.4,000 లాయల్టీ బెనిఫిట్, రూ.10,000 వరకు కార్పొరేట్ ఆఫర్ లభిస్తున్నాయి. అలాగే రూ.21,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా ఉంది. సెకెండ్ జెనరేషన్ అమేజ్ ధర రూ.5.99 లక్షల నుంచి రూ.7.80 లక్షల వరకు ఉండగా, థర్డ్ జెనరేషన్ అమేజ్ ధర రూ.7.65 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఉంది. ఈ డిస్కౌంట్లు వేరియంట్, స్టాక్, డీలర్, ఎక్స్ఛేంజ్ లాంటి అంశాల వారీగా మారే అవకాశం ఉంటుంది. కారు కొనుగోలు చేసే ముందు  హోండా డీలర్ దగ్గర  ప్రస్తుత ఆఫర్లను చెక్ చేసుకోవడం మంచిది.

Advertisement

Read Also: వోక్స్‌ వ్యాగన్ కార్లపై కళ్లు ఆఫర్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ.6 లక్షల తగ్గింపు!

Tags

Related News

కియా సోరెంటో వచ్చేసింది.. ఫార్చ్యూనర్‌ కు ఇక చుక్కలే!

హిమాలయన్ 440 వచ్చేసింది.. ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

టాటా కర్వ్‌ లో కొత్త సిరీస్ X.. తక్కువ ధరలోనే అదిరిపోయే ఫీచర్లు!

వోక్స్‌ వ్యాగన్ కార్లపై కళ్లు ఆఫర్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ.6 లక్షల తగ్గింపు!

సింగిల్ ఛార్జ్ తో 243 కి.మీ రేంజ్.. సింపుల్ వేవ్ సూపర్ స్కూటర్ వచ్చేసింది!

2027లో కొత్త నెక్సాన్.. డిజైన్ నుంచి ఇంజిన్ వరకు అన్నీ మారనున్నాయా?

5 ఏళ్ల తర్వాత పజెరో రీఎంట్రీ.. కొత్త లుక్‌తో మిత్సుబిషి బిగ్ సర్‌ప్రైజ్!

Big Stories

Advertisement
×