Apple Watch: స్మార్ట్‌వాచ్ అనగానే చాలామందికి మొదట గుర్తొచ్చేది యాపిల్ వాచ్. ప్రీమియం లుక్, అద్భుతమైన ఫీచర్ల వల్ల దీనికి క్రేజ్ ఎక్కువ. అయితే కొత్త మోడల్స్ ధరలు ఎక్కువగా ఉండటంతో.. చాలామంది తక్కువ ధరకు వచ్చే పాత లేదా సెకండ్ హ్యాండ్ యాపిల్ వాచ్‌లు కొనడానికి ఆసక్తి చూపుతుంటారు. కానీ అలా పాత మోడల్స్ కొనడం నిజంగా లాభమేనా అంటే? ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కాదనే చెప్పాలి.
యాపిల్ ఇటీవల తమ కొత్త వాచ్ ఓఎస్ అప్‌డేట్లలో చాలా పాత మోడళ్లకు సపోర్ట్ నిలిపివేసింది. కొత్తగా వస్తున్న ఏఐ ఫీచర్లు, సిరి కెపాసిటీని పాత మోడల్స్ తట్టుకోలేకపోవడమే దీనికి కారణం. సీరీస్ 9, ఎస్ఈ 3, అల్ట్రా 2 లేదా అంతకంటే కొత్త మోడళ్లకు మాత్రమే ఇప్పుడు సరైన సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ లభిస్తున్నాయి. సీరీస్ 8 లేదా అంతకంటే పాత వాచ్‌లు వాడితే, కొత్త ఫీచర్లు రావు సరిగా పనిచేయవు.
Also Read: మెకానికల్ కీబోర్డ్ కొనేముందు ఈ 5 విషయాలు తెలుసుకోకపోతే తిప్పలు తప్పవు!
కొత్త మోడళ్లపై యాపిల్ అందిస్తున్న ఆఫర్లు, నెలవారీ ఈఎమ్‌ఐ లీసింగ్ ప్లాన్ల వల్ల కొత్త వాచ్ కొనడం చాలా తేలికైంది. కొద్దిగా డబ్బు ఆదా చేయడానికి పాత వాచ్ కొంటే.. దాని స్క్రీన్‌పై గీతలు ఉండటమే కాకుండా బ్యాటరీ హెల్త్ కూడా చాలా తగ్గిపోయి ఉంటుంది. ఒకవేళ మీరు మళ్లీ కొత్త బ్యాటరీ వేయించాల్సి వస్తే, ఆదా చేసిన డబ్బులన్నీ దానికి సరిపోతాయి. అందుకే పాతది కొనే బదులు కొత్తది తీసుకోవడమే తెలివైన పని.
యాపిల్ వాచ్ ముఖ్య ఉద్దేశం మన పనులను వేగంగా పూర్తి చేయడం. మెసేజ్‌లకు రిప్లై ఇవ్వడం, నోటిఫికేషన్లు చూడటం, వర్కవుట్స్ ట్రాక్ చేయడం వంటివి క్షణాల్లో జరిగిపోవాలి. పాత మోడళ్లలో ప్రాసెసింగ్ స్పీడ్ తక్కువగా ఉండి, స్టోరేజ్ సామర్థ్యం కూడా 16GB లేదా 32GB మాత్రమే ఉంటుంది. దీనివల్ల వాచ్ స్లో అవ్వడం, మ్యూజిక్ లేదా పోడ్‌కాస్ట్‌లు సేవ్ చేసుకోవడానికి స్పేస్ లేకపోవడం వంటి ఇబ్బందులు ఎదురవుతాయి.
ఒకవేళ మీరు ఎలాగైనా సెకండ్ హ్యాండ్ యాపిల్ వాచ్ కొని తీరాలనుకుంటే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. ఆ వాచ్ బ్యాటరీ హెల్త్ కనీసం 85% కంటే ఎక్కువ ఉందో లేదో చెక్ చేసుకోండి. అలాగే సాధ్యమైనంత వరకు సీరీస్ 9 లేదా అంతకంటే పై మోడళ్లను మాత్రమే ఎంచుకోండి. పాత మోడల్స్ మీ ఐఫోన్‌కి కనెక్ట్ అయినా, ఫ్యూచర్‌లో కనెక్టివిటీ సమస్యలు వచ్చే అవకాశం ఉందని గుర్తుంచుకోండి.
Also Read: Huawei Watch GT 7 సిరీస్ లాంచ్.. 21 రోజుల బ్యాటరీ, అద్భుతమైన ఫీచర్లు!