Volkswagen September 2026 Offers: కారు కొనాలని ప్లాన్ చేస్తున్న వారికి వోక్స్ వ్యాగన్ సెప్టెంబర్ 2026కు సంబందించి భారీ ఆఫర్లను ప్రకటించింది. టైగన్, టైగువాన్ ఆర్ లైన్, వర్టస్, టైరాన్ మోడళ్లపై అదిరిపోయే బెనిఫిట్స్ అందిస్తుంది. మోడల్, వేరియంట్, మోడల్ ఇయర్ ను బట్టి ఈ ఆఫర్లలో మార్పులు ఉంటాయని కంపెనీ వెల్లడించింది. ఈ మంత్ ఆఫర్ లో భాగంగా క్యాష్ డిస్కౌంట్ తో పాటు ఎక్స్ఛేంజ్, స్క్రాపేజ్, లాయల్టీ బోనస్ లు కూడా ఇందులో ఉన్నాయి. ఇంతకీ ఏ మోడల్ పై ఎంత తగ్గింపు అంటే..
వోక్స్ వ్యాగన్ టైగువాన్ ఆర్-లైన్‌పై ఈ నెలలో అత్యధికంగా రూ.6 లక్షల వరకు బెనిఫిట్స్ అందిస్తోంది. ఇందులో రూ.3.5 లక్షల క్యాష్ తగ్గింపు, రూ.2 లక్షల ఎక్స్ఛేంజ్ బోనస్, రూ.50,000 లాయల్టీ బోనస్ ఉన్నాయి. పాత కారును స్క్రాప్ చేయాలనుకునే కస్టమర్లకు మాత్రం రూ.2 లక్షల ఎక్స్ఛేంజ్ బోనస్ కు బదులుగా రూ.20,000 స్క్రాపేజ్ బెనిఫిట్స్ అందిస్తోంది.
టైగన్ విషయంలో మోడల్ ఇయ ర్‌ను బట్టి ఆఫర్లు మారుతున్నాయి. MY2025 టైగన్ పై రూ.2 లక్షల వరకు నగదు తగ్గింపుతో పాటు రూ.1 లక్ష లిక్విడేషన్ సపోర్ట్ అందుబాటులో ఉంది. దీంతో మొత్తం బెనిఫిట్స్ రూ.3.5 లక్షల వరకు ఉంటుంది. MY2026 మోడళ్లపై రూ.1 లక్ష వరకు నగదు తగ్గింపు ఉంది. కస్టమర్లకు రూ.30,000 ఎక్స్ఛేంజ్ బోనస్ లేదంటే రూ.20,000 స్క్రాపేజ్ బెనిఫిట్ తో పాటు రూ.20,000 లాయల్టీ కూడా అందిస్తోంది. అప్‌డేటెడ్ టైగన్‌పై మాత్రం డిస్కౌంట్ తక్కువగా ఉంది. వేరియంట్‌ను బట్టి రూ.20,000 నుంచి రూ.25,000 వరకు నగదు తగ్గింపు అందిస్తున్నారు. ఎక్స్ఛేంజ్, లాయల్టీ బెనిఫిట్స్ కూడా కొన్ని వేరియంట్లకు అందిస్తుంది.
వోక్స్ వ్యాగన్ వర్టస్ పై కూడా ఈ నెలలో బెస్ట్ ఆఫర్లు ఉన్నాయి. MY2025 కార్లపై రూ.75,000 వరకు నగదు తగ్గింపు, రూ.30,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ.50,000 లాయల్టీ బోనస్ లభిస్తాయి. దీంతో ఎక్కువలో ఎక్కువ రూ.1.55 లక్షలకు లభిస్తుంది. అటు MY2026 టాప్‌లైన్ వేరియంట్లపై రూ.50,000 నగదు తగ్గింపుతో పాటు ఇతర బెనిఫిట్స్ కలిపితే రూ.1.30 లక్షల వరకు బెనిఫిట్స్ పొందే అవకాశం ఉంటుంది.
వోక్స్ వ్యాగన్ టైరాన్ ఆర్ లైన్, లైఫ్ వేరియంట్లపై కూడా రూ.1.5 లక్షల వరకు బెనిఫిట్స్ అందిస్తోంది. ఇందులో ఎలాంటి క్యాష్ డిస్కౌంట్ లేదు. రూ.1 లక్ష ఎక్స్ఛేంజ్ బోనస్, రూ.50,000 లాయల్టీ బోనస్ ఉన్నాయి. అటు ఎక్స్ఛేంజ్ బోనస్ కు బదులుగా రూ.20,000 స్క్రాపేజ్ బెనిఫిట్‌ను ఎంచుకునే అవకాశం కూడా అందిస్తోంది. అయితే ఎక్స్ఛేంజ్, స్క్రాపేజ్ బెనిఫిట్స్ ఒకేసారి పొందే అవకాశం లేదు. లాయల్టీ, కార్పొరేట్ బెనిఫిట్ లో ఒకదానినే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, కారు కొనుగోలు చేసే ముందు అన్ని వివరాలను ముందుగా తెలుసుకోవడం మంచిది.
Read Also: 5 ఏళ్ల తర్వాత పజెరో రీఎంట్రీ.. కొత్త లుక్‌తో మిత్సుబిషి బిగ్ సర్‌ప్రైజ్!