E-Paper
Advertisement

ప్రిన్స్ మహేష్ బాబుపై ‘అతడు’ విలన్ సంచలన వ్యాఖ్యలు.. కాస్త చూసుకోబడలా..

ప్రిన్స్ మహేష్ బాబుపై ‘అతడు’ విలన్ సంచలన వ్యాఖ్యలు.. కాస్త చూసుకోబడలా..
Advertisement

Mahesh Babu: టాలీవుడ్ ప్రిన్స్, సూపర్‌స్టార్ మహేష్ బాబుపై ప్రముఖ నటుడు రాహుల్ దేవ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. గతంలో మహేష్ బాబు బాలీవుడ్ ఎంట్రీపై చేసిన వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ రాహుల్ దేవ్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలు, దానికి సంబంధించిన వీడియో క్లిప్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. తెలుగులో ‘అతడు’, ‘పౌర్ణమి’ వంటి సూపర్ హిట్ చిత్రాలలో విలన్‌గా నటించి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన రాహుల్ దేవ్.. ఇటీవల ఒక ప్రముఖ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనకు మహేష్ బాబు కెరీర్, ఆయన బాలీవుడ్ వ్యాఖ్యలపై ప్రశ్నలు ఎదురయ్యాయి.

Read also-సాయి పల్లవికి షాక్ ఇచ్చిన ‘రామాయణ’ టీమ్.. ఆ హిందీ మూవీ వల్లే ఇదంతా..

మహేష్ కెరీర్

Advertisement

మహేష్ బాబు సినీ ప్రయాణం గురించి రాహుల్ దేవ్ మాట్లాడుతూ.. ఆయన ఒక ప్రత్యేకమైన శైలి కలిగిన సినిమాలను ఎంచుకుంటూ టాలీవుడ్‌లో తిరుగులేని విజయాన్ని సాధించారని ప్రశంసించారు. ముఖ్యంగా స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో మహేష్ చేసిన సినిమాలను ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. “త్రివిక్రమ్ శ్రీనివాస్ చాలా అద్భుతమైన, సెన్సిబుల్ డైరెక్టర్. కమర్షియల్ ఎలిమెంట్స్‌కు కాస్త అర్థాన్ని జోడించి సినిమాలు తీయడం ఆయన శైలి. అలాంటి జోనర్ సినిమాలు ప్రస్తుత హిందీ చిత్ర పరిశ్రమలో లేవు. బాలీవుడ్‌లో రామ్ గోపాల్ వర్మ లేదా అనురాగ్ కశ్యప్ మార్క్ సినిమాలు ఒక వైపు ఉంటే, హాలీవుడ్ చిత్రాలను రీమేక్ చేయడం మరొక వైపు ఉంది. కానీ మహేష్, త్రివిక్రమ్ ల కాంబినేషన్ జోనర్ వేరు” అని రాహుల్ దేవ్ విశ్లేషించారు.

“ఆయనకు హిందీ రాదు, అదే నిజం”

అయితే, ఇంటర్వ్యూ ముందుకు సాగుతున్న క్రమంలో.. గతంలో మహేష్ బాబు బాలీవుడ్ గురించి చేసిన “బాలీవుడ్ నన్ను భరించలేదు” (Bollywood can’t afford me) అనే వ్యాఖ్యలను యాంకర్ ప్రస్తావించారు. దీనిపై రాహుల్ దేవ్ స్పందిస్తూ.. “ఆయనకు హిందీ భాష మాట్లాడటం రాదు, అదే అసలు నిజం” అంటూ నవ్వుతూ అన్నారు. ఆయన కేవలం సరదాగా మాత్రమే ఆ మాట అన్నారని కొందరు నెటిజన్లు భావిస్తున్నప్పటికీ, మహేష్ బాబు అభిమానులు మాత్రం ఈ వ్యాఖ్యలపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. మహేష్ బాబుకు హిందీ చాలా స్పష్టంగా అనర్గళంగా మాట్లాడటం వచ్చు అని, దానికి సంబంధించిన పాత ఇంటర్వ్యూల వీడియోలను అభిమానులు సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తూ రాహుల్ దేవ్‌కు కౌంటర్లు ఇస్తున్నారు.

Advertisement

Read also-జోన్ బెర్త్నల్ ‘ది పనిషర్: వన్ లాస్ట్ కిల్’ రివ్యూ.. ఎక్కడ చూడాలంటే?

మహేష్ బాబు ఏమన్నారు?

మే 2022లో జరిగిన ఒక సినిమా ఈవెంట్‌లో మహేష్ బాబు తన బాలీవుడ్ ఎంట్రీపై స్పందిస్తూ.. “నేను చెప్పేది కాస్త అహంకారంగా అనిపించవచ్చు. నాకు హిందీలో చాలా ఆఫర్లు వచ్చాయి. కానీ, బాలీవుడ్ నన్ను భరించలేదు అని నేను నమ్ముతాను. అందుకే అక్కడ నటించి నా సమయాన్ని వృథా చేసుకోవడం నాకు ఇష్టం లేదు” అని వ్యాఖ్యానించారు. అప్పట్లో ఈ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సౌత్ వర్సెస్ నార్త్ సినిమా పరిశ్రమల మధ్య పెద్ద చర్చకు దారితీశాయి. మరో సారీ ఈ వివాదం తెరపైకి రావడంతో ఏం జరుగుతుందో అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Related News

కృష్ణుడిగా రామ్ చరణ్.. సూపర్ హిట్ సినిమా రీమేక్ చేయనున్నారా?

టాక్సిక్ సినిమాకు రేటింగ్ మహేష్ బాబు కొడుకు గౌతమ్ రేటింగ్.. ఇంత రారుణమా?

మై లిటిల్ ప్యారడైజ్..కొడుకుతో క్యూట్ ఫోటోలను షేర్ చేసిన నాని..

యాంకర్ గా స్రవంతి ఉంటే సినిమా హిట్టే.. డైరెక్టర్ ప్రశంశలు..సుమ క్రేజ్ తగ్గిందా?

లెనిన్ హిట్.. మెగా హీరోతో ఛాన్స్ కొట్టేసిన భాగ్య శ్రీ?

మధ్యం మానేశాను.. హృదయ విదారకమైన బాధ అంటున్న కొండన్న!

ఆర్ట్ డైరెక్టర్ కొడుకు అరెస్ట్.. పవన్ కళ్యాణ్ స్పందిస్తారా?

యశ్ ఎదుగుదల చూసి ఏడుస్తున్నారు… ట్రోల్స్ పై సుమలత ఫైర్!

Big Stories

Advertisement
×