E-Paper
Advertisement

సింగిల్ ఛార్జ్‌ తో 145 కి.మీ రేంజ్.. హోండా నయా ఈవీని చూస్తే మతిపోవాల్సిందే!

సింగిల్ ఛార్జ్‌ తో 145 కి.మీ రేంజ్.. హోండా నయా ఈవీని చూస్తే మతిపోవాల్సిందే!
Advertisement

Honda QC3 Electric Scooter: హోండా..  ఎలక్ట్రిక్ టూవీలర్ శ్రేణిని మరింత విస్తరించేందుకు రెడీ అవుతోంది. ఇప్పటికే QC1, యాక్టివా e: మార్కెట్లో ఉండగా, ఇప్పుడు QC3 పేరుతో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ ను పరిచయం చేసింది. ఎక్కువ రేంజ్, పెద్ద బ్యాటరీ, ఆధునిక ఫీచర్లతో ఈ స్కూటర్‌ ను రూపొందించింది. దీంతో హోండా ఎలక్ట్రిక్ స్కూటర్ లైనప్‌ లో ఇది ప్రీమియం మోడల్‌ గా నిలవనుంది.

సింగిల్ ఛార్జ్ తో 145 కి.మీ రేంజ్

కొత్త QC3లో 3kWh బ్యాటరీని అందించారు. ఈ స్కూటర్ ఒక్కసారి పూర్తి ఛార్జ్ చేస్తే 145 కిలోమీటర్ల IDC రేంజ్ ఇస్తుంది. ప్రస్తుతం హోండా నుంచి లభిస్తున్న ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఇదే అత్యధిక రేంజ్ అందించే మోడల్‌ కానుంది. బ్యాటరీ ఛార్జింగ్ విషయంలో కూడా మంచి పనితీరు కనిపిస్తుంది. 0 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ కావడానికి సుమారు 2 గంటల 40 నిమిషాలు పడుతుంది. పూర్తిగా ఛార్జ్ కావడానికి సుమారు 4 నుంచి 5 గంటల సమయం అవసరమని కంపెనీ తెలిపింది.

ఫీచర్ల గురించి..

Advertisement

QC3లో TFT డిజిటల్ డిస్‌ ప్లేను ఏర్పాటు చేశారు. ఇందులో హోండా రోడ్‌ సింక్ కనెక్టివిటీ, టర్న్ బై టర్న్ నావిగేషన్, స్మార్ట్‌ ఫోన్ కనెక్టివిటీ లాంటి అత్యాధునిక సదుపాయాలు ఉన్నాయి. ఈ ఫీచర్లు QC1 కంటే ఈ స్కూటర్‌ ను మరింత ప్రీమియంగా నిలబెట్టనున్నాయి.

ప్రస్తుతం హోండా భారత మార్కెట్లో రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయిస్తోంది. QC1 కంపెనీకి అత్యంత సరసమైన మోడల్. దీని ప్రారంభ ధర రూ.90,708. ఇందులో 1.5kWh బ్యాటరీ ఉండగా, ఒకసారి ఛార్జ్ చేస్తే 80 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. గరిష్ట వేగం 50 కిలోమీటర్లు. మరోవైపు యాక్టివా e: లో రెండు 1.5kWh రిమూవబుల్ బ్యాటరీలు ఉంటాయి. మొత్తం బ్యాటరీ సామర్థ్యం 3kWh. ఈ స్కూటర్ 102 కిలోమీటర్ల IDC రేంజ్ అందిస్తుంది. దీని ప్రారంభ ధర రూ.1.20 లక్షలు. ఈ రెండు మోడళ్లతో పోలిస్తే QC3 ఎక్కువ రేంజ్, మెరుగైన ఫీచర్లు, పెద్ద బ్యాటరీతో వస్తోంది. అందువల్ల దీని ధర కూడా ప్రస్తుత మోడళ్ల కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.

QC3 విడుదల ఎప్పుడు?

Advertisement

హోండా ఇప్పటి వరకు QC3 మోటార్ పవర్, టాప్ స్పీడ్, అధికారిక ధర, విడుదల తేదీ లాంటి వివరాలను ప్రకటించలేదు. ప్రస్తుతం QC1, యాక్టివా e: మాదిరిగానే ఈ స్కూటర్‌ ను కూడా మొదట కొన్ని నగరాల్లో మాత్రమే అందుబాటులోకి తీసుకువచ్చి, ఆ తర్వాత దేశవ్యాప్తంగా విడుదల చేసే అవకాశం ఉంది. ఎక్కువ రేంజ్, వేగవంతమైన ఛార్జింగ్, స్మార్ట్ కనెక్టివిటీ ఫీచర్లు కోరుకునే వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని హోండా QC3ను రూపొందించింది. అధికారిక ధర ప్రకటించిన తర్వాత భారత ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లో ఈ మోడల్ టీవీఎస్, ఏథర్, బజాజ్ వంటి బ్రాండ్లకు గట్టి పోటీ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది.

Read Also: 158 కి.మీ రేంజ్‌తో టీవీఎస్ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. ఫీచర్లు చూస్తే షాక్ అవుతారు!

Related News

సింపుల్ ఎనర్జీ సూపర్ జోష్.. ఏడాదిలో 10 వేలకుపైగా ఈవీ స్కూటర్ల సేల్!

ఈవీ రంగంలో హీరో దూకుడు.. నంబర్ వన్ కోసం అదిరిపోయే ప్లాన్!

నల్లగొండ జిల్లాలో ఎలక్ట్రిక్ వెహికల్స్ జోరు, ఏడాదిలో 11 వేలకు పైగా కొనుగోళ్లు!

432 కి.మీ రేంజ్.. అరగంటలో ఛార్జింగ్.. 11 వేల కి.మీ నడిపిన తర్వాత క్రెటా EV రివ్యూ!

జావా 42 బాబర్‌కు అదిరిపోయే లుక్.. ఆల్ స్టార్స్ ఎడిషన్ ఏముంది భయ్యా!

ఆగస్టులో అదరగొట్టిన టాప్ 5 కార్లు.. నంబర్ వన్‌ ఏదంటే?

టాటా ఈవీలపై కళ్లు చెదిరే ఆఫర్లు.. హారియర్ పై ఏకంగా రూ.2.75 లక్షల తగ్గింపు!

మహీంద్రా పేరు వెనుక ఇంత పెద్ద కథ ఉందా? కంపెనీ అసలు పేరు ఏంటో తెలిస్తే షాకవ్వాల్సిందే!

Big Stories

Advertisement
×