E-Paper
Advertisement

ఓరి దేవుడా.. భారీగా తగ్గిన గెలాక్సీ Z Fold 7 ధర.. కొనుగోలుకు ఇదే బెస్ట్ టైమ్!

ఓరి దేవుడా.. భారీగా తగ్గిన గెలాక్సీ Z Fold 7 ధర.. కొనుగోలుకు ఇదే బెస్ట్ టైమ్!
Advertisement

Galaxy Z Fold 7 Offer: శాంసంగ్ తన కొత్త ఫ్లాగ్‌షిప్ మోడల్ గెలాక్సీ Z ఫోల్డ్ 8ను తాజాగా భారత్‌లో విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దాని మునుపటి మోడల్ అయిన గెలాక్సీ Z ఫోల్డ్ 7 ధర గణనీయంగా తగ్గింది. శాంసంగ్ ఇండియా తన అధికారిక వెబ్‌సైట్‌లో ఈ ఫోన్‌పై అనేక రకాల డిస్కౌంట్లు, బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లను ప్రకటించింది. ఆ విశేషాలేంటో ఈ కథనంలో చూద్దాం.

ఆఫర్లు ఎలా ఉన్నాయంటే?

శాంసంగ్ ఇండియా అధికారిక వెబ్‌సైట్ ప్రకారం.. నిర్దేశిత బ్యాంకుల క్రెడిట్, డెబిట్ కార్డులను ఉపయోగించి కొనుగోలు చేస్తే.. గెలాక్సీ Z ఫోల్డ్ 7పై రూ. 7,000 తక్షణ డిస్కౌంట్ లభించనుంది. దీనివల్ల 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 1,67,999కి తగ్గుతుంది. అదే సమయంలో వినియోగదారులు ఎక్స్ఛేంజ్ ఆఫర్ ఎంచుకుంటే.. రిటర్న్ చేసే ఫోన్ కండిషన్ ను బట్టి రూ.99,999 వరకు Z ఫోల్డ్ 7 ధరను తగ్గించుకోవచ్చు. ఎక్స్చేంజ్ బోనస్ కింద మరో రూ.7000 సైతం రాయితీ పొందొచ్చు.

శాంసంగ్ రిఫరల్ కోడ్

Advertisement

మరోవైపు శాంసంగ్ రిఫరల్ కోడ్‌ని ఉపయోగిస్తే అదనంగా మరో రూ. 6,000 వరకు డిస్కౌంట్ పొందే వీలుంది. దీనికి తోడు కొనుగోలుపై రూ. 3,500 విలువైన శాంసంగ్ రివార్డ్ పాయింట్లు కూడా కస్టమర్లకు శాంసంగ్ ఆఫర్ చేస్తోంది. ఒకవేళ సరిపడనంత డబ్బు లేకపోతే.. నెలవారీ వాయిదాల్లో చెల్లించేందుకు రూ.15,222 ప్రారంభ ఈఎంఐ (EMI)ను సైతం శాంసంగ్ ఆఫర్ చేస్తోంది.

ఆఫర్ల తర్వాత ధర వివరాలు..

ఆఫర్ల ప్రభావంతో ప్రస్తుతం శాంసంగ్ ఇండియా స్టోర్‌లో గెలాక్సీ Z ఫోల్డ్7 ధర గతంతో పోలిస్తే తగ్గాయి. రూ. 1,74,999 ధర కలిగిన 12 జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ వేరియంట్.. బ్యాంక్ ఆఫర్లతో రూ.1,67,999 అందుబాటులోకి వచ్చింది. 12GB RAM + 512GB వేరియంట్ రూ. 1,86,999కి లభిస్తోంది. 16GB RAM + 1TB స్టోరేజ్ వేరియంట్.. పరిమిత స్టాక్ తో మాత్రమే ఆన్ లైన్ లో సేల్ అవుతోంది. ఈ ఫోన్లను మింట్, బ్లూ షాడో, జెట్‌బ్లాక్, సిల్వర్ షాడో రంగులలో కొనుగోలు చేయవచ్చు.

Advertisement

Also Read: జియో ‘ఫ్రీడమ్ ప్యాక్’ ఆఫర్.. 100 Mbps స్పీడ్, 1000+ ఛానెళ్లు.. ఫ్రీగా 12 ఓటీటీలు!

గెలాక్సీ Z ఫోల్డ్ 7 ఫీచర్లు..

ఫోల్డ్ ఫోన్ ప్రధాన ఫీచర్ల విషయానికి వస్తే.. 8 అంగుళాల మెయిన్ ఫోల్డబుల్ స్క్రీన్‌ ను ఇది కలిగి ఉంది. 200 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, స్నాప్‌డ్రాగన్ ఫ్లాగ్‌షిప్ ప్రాసెసర్, 4,400mAh బ్యాటరీ, గెలాక్సీ ఏఐ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. అలాగే శాంసంగ్ కేర్+ సపోర్ట్ ను దీనికి అందించారు. శాంసంగ్ ప్రీమియం ఫోల్డబుల్ ఫోన్ కొనాలని భావించే వారికి ఇదే మంచి ఛాన్స్ అని టెక్ వర్గాలు పేర్కొంటున్నాయి.

Also Read: బంగారు ఆభరణాలపై ఈ సీక్రెట్ కోడ్స్ గమనించారా? ఈ 916, 750, 585 నెంబర్లకు అర్థమేంటి?

Related News

బాక్స్ ఓపెన్ చేయగానే మైండ్ పోయింది.. ఐఫోన్ ప్లేస్‌లో ఆయిల్ డబ్బా, ఫ్లిప్‌కార్ట్‌కు ఇచ్చిపడేసిన కోర్టు!

రూ.18 వేలకే క్యూఎల్ఈడీ, ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీలు.. లైనప్‌లో బెస్ట్ ఆప్షన్స్ ఇవే!

జియో ‘ఫ్రీడమ్ ప్యాక్’ ఆఫర్.. 100 Mbps స్పీడ్, 1000+ ఛానెళ్లు.. ఫ్రీగా 12 ఓటీటీలు!

సామాన్యుల స్పెషల్.. BSNL నుంచి మరో చౌకైన ప్లాన్.. 72 రోజులు రచ్చ రంబోలా!

జియో మరో క్రేజీ ప్లాన్.. రూ. 1,748 కే 11 నెలల వ్యాలిడిటీ.. ఫ్రీ కాల్స్, డేటా, లైవ్ ఛానల్స్!

జియో మైండ్ బ్లోయింగ్ ప్లాన్స్.. రూ. 400 లోపే అన్‌లిమిటెడ్ 5G డేటా.. వివరాలివే!

రూ. 26,999 లకే 55 ఇంచుల 4K టీవీ.. బిగ్ స్క్రీన్ లవర్స్‌కు బెస్ట్ ఆప్షన్

Big Stories

Advertisement
×