E-Paper
Advertisement

Bike Service: మీ బైక్ కు సర్వీస్ అవసరమా? లేదా? సింపుల్ గా ఇలా తెలుసుకోండి!

Bike Service: మీ బైక్ కు సర్వీస్ అవసరమా? లేదా? సింపుల్ గా ఇలా తెలుసుకోండి!
Advertisement

బైక్ చాలా కాలం పాటు ఎలాంటి సమస్య లేకుండా పని చేయాలంటే, ప్రతి రోజూ శుభ్రంగా తుడవడంతో పాటు కంపెనీ   షెడ్యూల్ ప్రకారం సర్వీసింగ్ చేయించాలి. అప్పుడే బైక్ పనితీరు బాగుంటుంది. స్మూత్ గా డ్రైవ్ చేసే వారితో పోల్చితే, రఫ్ అండ్ టఫ్ గా డ్రైవ్ చేసే వారికి తరచుగా సర్వీసింగ్ చేయించాల్సి రావచ్చు. సర్వీసింగ్ అనేది ప్రొఫెషనల్ సర్వీస్ సెంటర్ లో చేయించుకోవడం మంచిది అంటున్నారు ఆటో నిపుణులు. ఇంతకీ బైక్ సర్వీసింగ్ ఎప్పుడు చేయించుకోవాలో చెప్పేందుకు కొన్ని సంకేతాలు ఉన్నాయంటున్నారు. అవేంటంటే..

⦿ కొంత కాలంగా ఆయిల్ మార్చకపోవడం  

బైక్ కు ఇంజిన్ అనేది గుండె లాంటిది. బైక్ ఎలాంటి సమస్య లేకుండా పని చేయాలంటే ఇంజిన్ హెల్తీగా ఉండేలా చూసుకోవాలి. ఇంజిన్ భద్రంగా ఉండేందుకు ఆయిల్ చాలా ముఖ్యం. క్రమం తప్పకుండా ఆయిల్ ఛేంజ్ చేయడం వల్ల బైక్ స్మూత్ గా చక్కగా పని చేస్తుంది. ఇంజిన్ ఆయిల్ ఇంజిన్‌ను అధిక వేడి సహా ఇతర ప్రభావాల నుంచి కాపాడుతుంది. ఆయిల్ ఇంజిన్‌ ను లూబ్రికేట్ చేస్తుంది. ఘర్షణ కారణంగా కలిగే వేడి నుంచి చల్లబరుస్తుంది. ఇంజిన్ ఆయిల్ నిర్ణీత సమయంలో మందంగా మారిపోతుంది. అప్పుడు మార్చాల్సి ఉంటుంది. అలా చేయకపోతే ఇంజిన్ చెడిపోయే అవకాశం ఉంటుంది. అందుకే రెగ్యులర్ గా ఇంజిన్ ఆయిల్ మార్చాలి.

⦿ అరిగిపోయిన స్ప్రాకెట్, చైన్   

Advertisement

స్ప్రాకెట్ గేర్‌ బాక్స్‌ లో ఒక ముఖ్యమైన భాగం. ఇది రెండు షాఫ్ట్‌ ల మధ్య కదలికకు సాయపడుతుంది. వెనుక చక్రంలోని స్ప్రాకెట్ నుంచి చైన్ తీసి, దాని పరిస్థితిని చెక్ చేయాలి. వాటి టీత్ సగం వరకు అరిగిపోతే, చైన్ పని చేయదని అర్థం చేసుకోవాలి. వెంటనే దాని స్థానంలో కొత్త చైన్ వేయించుకోవాలి. కొత్త చైన్ అనేది స్ప్రాకెట్ చుట్టూ సురక్షితంగా చుట్టబడి బైక్ కు రక్షణ కలిగిస్తుంది.

⦿ ఎయిర్ ఫిల్టర్లు మురికిగా మారితే

ఎయిర్ ఫిల్టర్లు అనేవి శుభ్రంగా ఉండాలి. ఇవి శుభ్రంగా ఉంటే మురికి గాలి ఇంజిన్ లోకి వెళ్లకుండా కాపాడుతాయి. మురికి, అనవసర గాలి కణాలను ఫిలర్ట్ చేయడం ద్వారా ఇంజన్ లో ఎలాంటి సమస్యలు తలెత్తవు.

⦿ బ్రేక్ ఫ్లూయిడ్స్ తగ్గితే

Advertisement

రైడర్ భద్రత కు బ్రేక్ ఫ్లూయిడ్స్ అనేవి చాలా ముఖ్యం. బైక్ సజావుగా పని చేయడానికి బ్రేక్ ఆయిల్ అవసరం. అందుకే తరచుగా బ్రేక్ ప్లూయిడ్స్ అందించాలి. నిర్ణీత గడుపు ప్రకారం బైక్ సర్వీసింగ్ చేయించడం, ఆయిల్ ఛేంజ్, ఎయిర్ ఫిల్టర్లు, స్ప్రాకెట్, చైన్, బ్రేక్ ఫ్లూయిడ్స్ వాటిని గమనించడం వల్ల బైక్ చాలా కాలం మన్నికగా ఉంటుంది. బైక్ రైడింగ్ కూడా స్మూత్ గా ఉంటుంది. అందుకే, ఎట్టి పరిస్థితుల్లోనూ సర్వీసింగ్ విషయంలో అటు, ఇటు చేయకూడదు. అలా చేస్తే, ఇంజిన్ దెబ్బతిని, బైక్ త్వరగా పాడైపోయే అవకాశం ఉంటుంది. చాలా మంది బైక్ యజమానులు సర్వీసింగ్ విషయంలో నిర్లక్ష్యం చేస్తున్నారు. అలా చేయకపోవడం మంచిది.

Read Also: ఒక్క ఛార్జ్ తో 250 కిలో మీటర్లు.. ఓలా నుంచి అదిరిపోయే ఈవీ వచ్చేసింది!

Related News

హోండా సిటీ vs హ్యుందాయ్ వెర్నా.. CVTలో ఏది బెస్ట్?

CNG నింపుతుండగా భారీ పేలుడు.. కారు యజమానులు ఈ 3 విషయాల్లో జాగ్రత్త!

కియా కార్లపై అదిరిపోయే పండుగ ఆఫర్లు.. ఏకంగా రూ.1.70 లక్షల వరకు తగ్గింపు!

టాటా కార్లపై కళ్లు చెదిరే అక్టోబర్ ఆఫర్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ.1.25 లక్షల బెనిఫిట్!

సెకెండ్ హ్యాండ్ కారు కొంటున్నారా? మైలేజీతో పాటు ఇవి కూడా చెక్ చేయండి!

భారత్‌లోకి BYD లగ్జరీ బ్రాండ్ డెంజా ఎంట్రీ.. తొలి కార్లు ఇవే!

ఏప్రిలియా నుంచి క్రేజీ మ్యాక్సీ స్కూటర్లు.. చూస్తే మతిపోవాల్సిందే!

అక్టోబర్‌లో అదిరే 5 ఫేస్‌ లిఫ్ట్ కార్లు.. కొత్త లుక్, అదిరిపోయే ఫీచర్లు!

Big Stories

Advertisement
×