E-Paper
Advertisement

10 Minute Helmet Video: 10 నిమిషాల్లో హెల్మెట్ చలానా నుంచి తప్పించుకోవడం ఎలా? వీడు ఏం చేశాడో చూడండి

10 Minute Helmet Video: 10 నిమిషాల్లో హెల్మెట్ చలానా నుంచి తప్పించుకోవడం ఎలా? వీడు ఏం చేశాడో చూడండి
Advertisement

10 Minute Helmet Video: హెల్మెట్ లేదని ఆపిన ట్రాఫిక్ పోలీసులకు వాహనదారుడు షాక్ ఇచ్చాడు. క్షణాల్లోనే ఆన్ లైన్ లో ఆర్డర్ పెట్టి, హెల్మెట్ పెట్టుకుని ట్రాఫిక్ ఫైన్ తప్పించుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో ఆన్ లైన్ లో వైరల్ అవుతుంది. హెల్మెట్ లేకుండా వాహనం నడుపుతున్నందుకు ఓ వ్యక్తిని ట్రాఫిక్ పోలీసులు ఆపారు. ఫైన్ కట్టడానికి బదులుగా, అక్కడికక్కడే బ్లింకిట్ అనే క్విక్-కామర్స్ యాప్‌ను ఉపయోగించి హెల్మెట్‌ను ఆర్డర్ చేశాడు. కొంత సేపటికే, ఒక డెలివరీ బాయ్ అక్కడికి చేరుకుని హెల్మెట్‌ను డెలివరీ చేశాడు. అక్కడ ఉన్న కొందరు ఈ ఘటనను వీడియో తీశారు. ప్రస్తుతం ఈ వీడియో ఆన్ లైన్ లో వైరల్ అవుతుంది.

వైరల్ వీడియోపై నెటిజన్ల రియాక్షన్

ఈ వీడియో నెటిజన్లు స్పందిస్తూ.. అతడి ఆలోచనను, డెలివరీ సేవలను ప్రశంసిస్తున్నారు. మరికొందరు ఈ పనిని ట్రాఫిక్ నిబంధనలను దెబ్బతీస్తుందని విమర్శించారు. హెల్మెట్ పెట్టుకోవడం కేవలం ట్రాఫిక్ జరిమానాలను తప్పించుకోవడానికే కాకుండా వ్యక్తిగత భద్రతకు సంబంధించినదని అని నెటిజన్లు అభిప్రాయపడ్డారు. మరికొందరు ఇవి తెలివితేటలు కాదు, ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించడమనే అంటున్నారు. హెల్మెట్ 10 నిమిషాల్లో వస్తుంది, కానీ బైక్ స్టార్ట్ చేయడానికి ముందే ఈ బుద్ది ఉండాలని మరికొందరు చురకలు అంటించారు. ఈ పని చూడటానికి తెలివిగా కనిపిస్తుంది, కానీ ఇది తెలివితేటల ముసుగులో చివరి నిమిషంలో నష్ట నివారణ మాత్రమే అని వ్యాఖ్యానించారు.

Advertisement

‘హెల్మెట్ ఇలా కొనుకున్నంత మాత్రానా ఫైన్ పడలేదని కాదు. నిబంధనలు ఉల్లంఘిస్తూ పట్టుబడితే జరిమానా విధిస్తారు’ అని మరొకరు వ్యాఖ్యానించారు. “హెల్మెట్ మన రక్షణకు ఉపయోగించేది చలాన్ల నుండి తప్పించుకోవడానికి కొనే వస్తువు కాదు’ అని మరో వ్యక్తి అన్నారు. మరోవైపు, సాంకేతికత రోజువారీ జీవితాన్ని ఎలా అప్లై చేయాలో ఈ సంఘటన ఒక నిదర్శనమని కొందరు అభిప్రాయపడ్డారు. నిజానికి ట్రాఫిక్ జరిమానా విధించే బదులు, మొదటిసారి తప్పు చేసిన వారికి జరిమానా డబ్బులతో హెల్మెట్ ఇవ్వాలని ఓ వ్యక్తి కామెంట్ చేశాడు.

Advertisement

Also Read:  సమ్మర్ లో కారు ఏసీ కూలింగ్ పెరగాలంటే, ఈ 5 టిప్స్ పాటించండి!

Related News

వోక్స్‌ వ్యాగన్ కార్లపై కళ్లు ఆఫర్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ.6 లక్షల తగ్గింపు!

సింగిల్ ఛార్జ్ తో 243 కి.మీ రేంజ్.. సింపుల్ వేవ్ సూపర్ స్కూటర్ వచ్చేసింది!

2027లో కొత్త నెక్సాన్.. డిజైన్ నుంచి ఇంజిన్ వరకు అన్నీ మారనున్నాయా?

5 ఏళ్ల తర్వాత పజెరో రీఎంట్రీ.. కొత్త లుక్‌తో మిత్సుబిషి బిగ్ సర్‌ప్రైజ్!

EV కొనేముందు ఈ విషయం చెక్ చేశారా? లేదంటే ఇబ్బందులు తప్పవు!

టాటా దూకుడు.. మహీంద్రా జోరు! ఆగస్టు అమ్మకాల్లో ఎవరు టాప్?

హోండా కొత్త ఈ-స్కూటర్‌కు పేటెంట్.. స్పీడ్ ఎంతో తెలిస్తే వావ్ అనాల్సిందే!

100 కి.మీ స్పీడ్.. 200 కి.మీ రేంజ్.. ఆంపియర్ కొత్త ఎలక్ట్రిక్ బైక్‌కు పేటెంట్!

Big Stories

Advertisement
×