E-Paper
Advertisement

GHMC: దోమలపై దండోరా.. క్లీన్ సిటీగా హైదరాబాద్.. జీహెచ్ఎంసీ కమిషనర్ దూకుడు!

GHMC: దోమలపై దండోరా.. క్లీన్ సిటీగా హైదరాబాద్.. జీహెచ్ఎంసీ కమిషనర్ దూకుడు!
Advertisement

GHMC: దోమల నిర్మూలన కార్యక్రమాలు మరింత వేగవంతం చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ అధికారులను ఆదేశించారు. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు పారిశుద్ధ్య కార్యక్రమాలను ప్రభావవంతంగా అమలు చేయాలని పేర్కొన్నారు. హైదరాబాద్‌ను క్లీన్ సిటీగా తీర్చిదిద్దడం లక్ష్యంగా అధికారులు కలిసికట్టుగా పని చేయాలని సూచించారు. మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక లో భాగంగా జూబ్లీ హిల్స్ సర్కిల్ లో కమిషనర్ కర్ణన్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించి పారిశుద్ధ్య కార్యక్రమాలను పరిశీలించారు.

ఆకస్మిక తనిఖీలో భాగంగా ఫిల్మ్ నగర్ వద్ద శానిటేషన్ బృందాలతో కలిసి డోర్ టు డోర్ చెత్త సేకరణ ప్రక్రియ జరుగుతున్న తీరును పరిశీలించారు. లోటస్ పాండ్ వద్ద వెక్టర్ కంట్రోల్ చర్యలను సమీక్షించారు. రోడ్ నెం. 25లో కొనసాగుతున్న ఇంజినీరింగ్ పనులను తనిఖీ చేశారు. పారిశుద్ధ్య కార్యక్రమాలను ఎలాంటి లోపాలు లేకుండా సమర్థవంతంగా చేపట్టాలని ఈ సందర్భంగా అధికారులను జీహెచ్ఎంసీ కమిషనర్ ఆదేశించారు. చెత్త సేకరణను క్రమబద్ధంగా నిర్వహించడం, వెక్టర్ కంట్రోల్ చర్యలను మరింత బలోపేతం చేయడం, ఇంజినీరింగ్ పనులను వేగంగా పూర్తి చేయాలని సూచించారు. నగరంలో పరిశుభ్రతను కాపాడటంతో పాటు ప్రజల సమస్యలను తక్షణమే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కమిషనర్ కర్ణన్ ఆదేశించారు.

Advertisement

మరోవైపు మల్కాజ్ గిరి మున్సిపల్ కమిషనర్ టి. వినయ్ కృష్ణా రెడ్డి మంగళవారం శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్స్ (ఎస్ఎఫ్ఏ)లకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నూటికి నూరు శాతం శానిటేషన్ పనులు జరిగేందుకు అనుసరించాల్సిన పద్దతులపై ఆయన దిశా నిర్దేశం చేశారు. ప్రతి ఎస్‌ఎఫ్‌ఏ తమ పరిధిలో స్వచ్ఛ ఆటో టిప్పర్ల ద్వారా చెత్త సేకరణ ప్రక్రియ, చెత్త సేకరించని ఇళ్ల వివరాలను ఖచ్చితంగా నమోదు చేసి ఉంచాలన్నారు. చెత్త ఇవ్వని ఇళ్లలోని కుటుంబాలకు అవగాహన కల్పించి వంద శాతం చెత్తను సేకరించేలా చర్యలు చేపట్టాలన్నారు.

Also Read: Airtel Recharge: సూపర్ డూపర్ ప్లాన్.. 3 నెలల పాటు.. అపరిమిత 5G డేటా, ఫ్రీ నెట్‌ఫ్లిక్స్, కాల్స్!

Advertisement

స్వచ్ఛ ఆటో టిప్పర్ వాహానాలు ప్రతి రోజూ డోర్-టు-డోర్ చెత్త సేకరణను నిరంతరం నిర్వహించేలా పర్యవేక్షించాలని మల్కాజ్ గిరి మున్సిపల్ కమిషనర్ అన్నారు. రోడ్లపై సేకరించిన చెత్తను ఓపెన్ నాలాలు, రోడ్ మధ్య ఉన్న మీడియన్లు, వీధులపై ఎక్కడ కూడా బయట వేయకుండా చర్యలు చేపట్టాలన్నారు. రోడ్ మార్జిన్లు ఎప్పటికప్పుడు శుభ్రంగా, చెత్త లేకుండా ఉండేలా చూసుకోవాలన్నారు. సాధారణ శుభ్రతతో పాటు భవన నిర్మాణ, కూల్చివేత వ్యర్థాలు, ఇతర ప్రత్యేక వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించాలని ఆదేశించారు. పారిశుద్ధ్య పనులు సమర్థవంతంగా నిర్వహించేందుకు అవసరమైన పరికరాలు కొనుగోలు చేయాలని డిప్యూటీ కమిషనర్లకు ఆదేశాలు జారీ చేశారు.

Also Read: Croma Deals: ఇండక్షన్ స్టవ్స్‌పై.. అదిరిపోయే డిస్కౌంట్లు.. ఇప్పుడు కాక‌ ఇంకెప్పుడు!

Related News

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

Big Stories

Advertisement
×