E-Paper
Advertisement

Car AC Cooling Tips: సమ్మర్ లో కారు ఏసీ కూలింగ్ పెరగాలంటే, ఈ 5 టిప్స్ పాటించండి!

Car AC Cooling Tips: సమ్మర్ లో కారు ఏసీ కూలింగ్ పెరగాలంటే, ఈ 5 టిప్స్ పాటించండి!
Advertisement

Summer Car AC Cooling Tips: సమ్మర్ ప్రారంభం అయిన నేపథ్యంలో కారు లోపల వేడి ఈజీగా ఫామ్ అవుతుంది. లోపలికి వెళ్లాలంటే కష్టంగా అనిపిస్తుంది. అందుకే, చాలా మంది కారు లోపలికి వెళ్లి వెంటనే ఏసీ ఆన్ చేస్తారు. అయితే, కారు లోపల త్వరగా కూల్ కావాలంటే అలా చేయడం కరెక్ట్ కాదు. కూలింగ్ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి డ్రైవర్లు వెంటనే ఏసీని ఆన్ చేయకూడదు. దానికి బదులుగా కిటికీలను దించడం ద్వారా వేడి గాలిని బయటకు వెళ్లేలా చేయాలి. వేడి గాలిని బయటకు పంపడానికి ఫ్యాన్‌ ను ఉపయోగించడం ద్వారా కారులో వెంటిలేషన్ కలిగించవచ్చు. నీడ ఉన్న ప్రదేశాలలో పార్క్ చేయడం,  రిఫ్లెక్టివ్ సన్‌ షేడ్‌ లను ఉపయోగించడం కూడా కూలింగ్ ను పెంచడంలో సాయపడుతాయి. సమ్మర్ లో మంచి ఏసీని ఆస్వాదించాలంటే కొన్ని టిప్స్ పాటించాలి. అవేంటంటే..

⦿ ముందుగా వెంటిలేషన్ కల్పించాలి:  కారులోకి వెళ్లగానే దానిని చల్లబరచడానికి నేరుగా స్టార్ట్ చేయకూడదు. కొద్ది దూరం విండోస్ ఓపెన్ చేసి వెళ్లాలి. లోపల ఉన్నన వేడిగాలి బయటకు వెళ్లేలా సాయపడతుంది. లేదంటే ఆ గాలిని బయటకు పంపడానికి ఫ్యాన్‌ ను ఆన్ చేయాలి. ఆ తర్వాత, మీరు మీ ఏసీని ఆన్ చేయాలి. త్వరగా కూల్ అవుతుంది.

Advertisement

⦿ కారును నీడలో పార్క్ చేయాలి: ఎండా కాలంలో కారును నీడలో పార్క్ చేయాలి. ఎండ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. నీడ అందుబాటులో లేకపోతే, విండ్‌ షీల్డ్ కోసం రిఫ్లెక్టివ్ సన్‌ షేడ్‌ ను ఉపయోగించాలి. ఇది సూర్యరశ్మి నుంచి వచ్చే 80% వేడిని రిఫ్లెక్ట్ చేస్తుంది.

⦿ ఎయిర్ ఫిల్టర్లను శుభ్రం చేయండి: ఏసీ చక్కగా వచ్చేందుకు క్యాబిన్ ఎయిర్ ఫిల్టర్లను ప్రతి ఏటా మార్చాలి. వాటిని క్రమం తప్పకుండా శుభ్రం చేయాలి. మురికిగా ఉన్న ఫిల్టర్లు గాలి ప్రవాహాన్ని పరిమితం చేస్తాయి. ఫలితంగా కారు సరిగా కూల్ కాదు.

Advertisement

⦿ రీసర్క్యులేషన్ మోడ్‌ను ఉపయోగించండి:  మంచి కూలింగ్ కోసం కారును రీసర్క్యులేషన్ మోడ్‌ లో ఉంచాలి. ఈ మోడ్ క్యాబిన్ నుంచి గాలిని తీసుకుని దానిని తిరిగి ప్రసరింపజేస్తుంది. లోపలి వేడి గాలిని బయటకు పంపి, బయటి గాలిని లోపలికి తీసుకెళ్తుంది. ఫలితంగా కారు ఈజీగా కూల్ అవుతుంది.

Read Also: రివోల్ట్ బంపర్ ఆఫర్, ఎలక్ట్రిక్ బైక్స్ పై ఏకంగా రూ.25 వేలు తగ్గింపు !

⦿ AC సిస్టమ్‌కు సర్వీసింగ్ చేయించండి:  కారు AC సమర్థవంతంగా పనిచేయకపోతే, దానికి ప్రొఫెషనల్ సర్వీసింగ్ అవసరం కావచ్చు. రిఫ్రిజెరెంట్ లెవెల్స్ తక్కువగా ఉండటం, కంప్రెసర్ సమస్యలు, కండెన్సర్ కాయిల్స్ మురికిగా ఉండటం కూలింగ్ సామర్థ్యాన్ని తగ్గించగలవు. సాధారణ AC సర్వీస్‌ లో సాధారణంగా రిఫ్రిజెరెంట్ టాప్ అప్, లీక్ చెక్‌లు,  కీలక భాగాలను శుభ్రపరచడం వంటివి ఉంటాయి. రెగ్యులర్ సర్వీసింగ్ సిస్టమ్ అత్యుత్తమ పనితీరుతో పనిచేసేలా చేస్తుంది. రానున్న పెద్ద సమస్యలను నివారిస్తుంది.

Read Also: ఏథర్ 450 అపెక్స్ vs సుజుకి ఇ-యాక్సెస్, రెండింటిలో ఏది బెస్ట్?

Related News

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

లాంచ్‌కు ముందే క్రేజీ డీటైల్స్ లీక్.. కొత్త బ్రెజ్జాలో ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

టీవీఎస్ నుంచి సూపర్ సర్‌ ప్రైజ్.. ఒకేసారి 3 మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

కొత్త బ్రెజ్జా To హిలక్స్.. 10 రోజుల్లో 3 క్రేజీ మోడల్స్ ఎంట్రీ!

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

EV బ్యాటరీల్లో ఏది సేఫ్? కొనుగోలు చేసే ముందు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

Big Stories

Advertisement
×