E-Paper
Advertisement

Early Morning vs Late Night: ఎర్లీ మార్నింగ్ vs లేట్ నైట్.. ఏ టైమ్ లో డ్రైవింగ్ చేయడం బెస్ట్?

Early Morning vs Late Night: ఎర్లీ మార్నింగ్ vs లేట్ నైట్.. ఏ టైమ్ లో డ్రైవింగ్ చేయడం బెస్ట్?
Advertisement

Best Driving Time: సుదూర ప్రయాణం చేయాలనుకునే వాళ్లు సరైన సమయంలో డ్రైవింగ్ చేయడం మంచిది. అయితే, చాలా మందికి ఏ సమయంలో ప్రయాణాన్ని మొదలు పెట్టాలనే విషయంలో కాస్త క్లారిటీ తక్కువగా ఉంటుంది. సుదూర ప్రయాణాలకు, రాత్రిపూట డ్రైవింగ్ కంటే  తెల్లవారుజామున డ్రైవింగ్ చాలా బాగుంటుందని నిపుణలు చెప్తుంటారు. మెరుగైన విజుబులిటీ, డ్రైవర్ అప్రమత్తత ఎక్కువగా ఉంటుందంటున్నారు. రాత్రిపూట డ్రైవింగ్ తక్కువ ట్రాఫిక్, చల్లని ఉష్ణోగ్రతలను అందిస్తుండగా, విజుబులిటీ సరిగా లేకపోవడం, అలసటతో ప్రమాదాలు పెరిగే అవకాశం ఉందంటున్నారు.

ఎర్లీ మార్నింగ్ vs లేట్ నైట్ డ్రైవింగ్ మధ్య పోలికలు

ఎర్లీ మార్నింగ్ డ్రైవింగ్: తెల్లవారుజాము ప్రయాణాన్ని మొదలు పెట్టడం లేదని చాలా ప్రెష్ గా ఉంటుంది. ఎలాంటి అలసట ఉండదు.  చక్కగా డ్రైవింగ్ ను ఆస్వాదిస్తూ వెళ్లవచ్చు. సహజమైన పగటి వెలుతురు కారణంగాప్రమాదాలు, రహదారి చిహ్నాలు, రోడ్డు పరిస్థితులను స్పష్టంగా తెలుస్తాయి. ఉదయాన్ని ప్రయాణించడం వల్ల ఎలాంటి అలసట ఉండదు. మద్యం సేవించిన డ్రైవర్లు,  మగత లాంటి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉండదు. వాహనానికి ఏదైనా సమస్య ఏర్పడితే పరిష్కరించుకునేందుకు అన్ని మెకానిక్ దుకాణాలు అందుబాటులో ఉంటాయి. ఈ సమయంలో ప్రమాదాలు చాలా తక్కువగా జరుగుతాయి.  తెల్లవారుజామున ప్రయాణం వల్ల కొద్దిగా ట్రాఫిక్ ఇబ్బంది ఉంటుంది.  ప్రయాణం ప్రారంభమైన మొదటి గంట, రెండు గంటలు చీకటిగా ఉంటుంది. కాస్త విజుబులిటీ తక్కువగా ఉంటుంది.

Advertisement

రాత్రి డ్రైవింగ్: రాత్రి 9 గంటల తర్వాత డ్రైవింగ్ చేయాలంటే ఎక్కువ ఏకాగ్రత అవసరం. అయితే, ఈ సమయంలో ప్రధాన రహదారులు తరచుగా రద్దీ లేకుండా ఉంటాయి. వేగవంతమైన ప్రయాణానికి అవకాశం ఉంటుంది. నగరాల్లో ప్రయాణం సులభంగా ఉంటుంది. కొంతమంది డ్రైవర్లు రాత్రి నిశ్శబ్దాన్ని మరింత విశ్రాంతిగా, ప్రశాంతంగా భావిస్తారు.  ఇక రాత్రిపూట ప్రయాణాల వల్ల కొన్ని ఇబ్బందులు కూడా ఉంటాయి. విజుబులిటీ తక్కువగా ఉంటుంది. హెడ్ లైట్స్ ఉన్నప్పటికీ కొంత దూరం వరకే విజుబులిటీ ఉంటుంది. రాత్రిపూట ట్రాఫిక్ తక్కువగా ఉన్నప్పటికీ, పగటిపూట కంటే రాత్రిపూట మరణాల శాతం 3 రెట్లు ఎక్కువగా ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. డ్రైవింగ్ సమయంలో నిద్రపోవాలనే ఫీలింగ్ కలుగుతుంది. అర్ధరాత్రి నుంచి ఉదయం 6 గంటల మధ్య డ్రైవింగ్ చేయడం చాలా ప్రమాదకరం. ఎదురుగా వచ్చే వాహనాల నుండి వచ్చే హై బీమ్‌లు తాత్కాలికంగా బ్లైండ్‌ నెస్, త్తిడిని కలిగిస్తాయి.  తెల్లవారుజామున 2 గంటలకు బ్రేక్‌ డౌన్‌లు అయితే, రిపేర్ చేయించుకోవడం కూడా చాలా కష్టంగా ఉంటుంది.

Read Also: రెనాల్ట్ To మారుతి.. బెస్ట్ స్మాల్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

ఏ టైమ్ లో ప్రయాణం ఎవరిక అనుకూలంగా ఉంటుంది.

Advertisement

సుదూర, కుటుంబ ప్రయాణాలకు తెల్లవారుజామున సమయం మంచిది. ఇది సురక్షితమైనది. మీరు మరింత అప్రమత్తంగా ఉంటారు.  ఉదయం 4:00 – 5:00 గంటలకు బయలుదేరడం మంచిది. ఈ సమయంలో డ్రైవింగ్ మరింత అనుకూలంగా ఉంటుంది.

Read Also: పెట్రోల్ vs డీజిల్ కార్లలో ఏది బెస్ట్? ఎందుకు?

Related News

తక్కువ ధర.. ఎక్కువ మైలేజ్.. మధ్యతరగతి కుటుంబాలకు బెస్ట్ కార్లు!

కార్ల కంపెనీల దగ్గరే చవకగా సెకండ్ హ్యాండ్ కార్లు కొనేయొచ్చు.. జస్ట్ ఇలా చేస్తే చాలు!

హ్యుందాయ్ బౌల్డర్ కు పేటెంట్.. రగ్గడ్ లుక్‌ లో అదిరిపోయిందిగా!

విన్‌ ఫాస్ట్ డబుల్ సర్‌ ప్రైజ్.. కొత్త ఈ-స్కూటర్, ఈ-బైక్‌కు పేటెంట్!

టాటా అవిన్యా X టెస్టింగ్ షురూ.. నెట్టింట వైరల్ అవుతున్న స్పై షాట్స్!

థార్‌ కు నెక్స్ట్ లెవల్ అవతారం.. విజన్ T వచ్చేస్తోంది!

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

Big Stories

Advertisement
×