E-Paper
Advertisement

Car Mileage Tips: మీ కారు ఎక్కువ మైలేజ్ ఇవ్వాలా.. ఇలా చేయండి భయ్యా.. వద్దన్నా వెళ్తుంది!

Car Mileage Tips: మీ కారు ఎక్కువ మైలేజ్ ఇవ్వాలా.. ఇలా చేయండి భయ్యా.. వద్దన్నా వెళ్తుంది!

తక్కువ పెట్రోల్ తో ఎక్కువ దూరం ప్రయాణించాలని చాలా మంది కారు యజమానులు కోరుకుంటారు. అయితే, ఇవ్వాల్సిన మైలేజ్ కంటే తక్కువ మైలేజ్ ఇస్తుందని చాలా మంది బాధపడుతుంటారు. వాహన సాంకేతికత పెరిగినా, డ్రైవింగ్ విధానాలు,  ట్రాఫిక్ రద్దీ, సరైన మెయింటెనెన్స్ లేకపోవడం, అదనపు లోడ్ లాంటి కారణాలతో మైలేజ్ తక్కువగా వస్తుంది. అయితే, డ్రైవింగ్ స్టైల్ లో చిన్న మార్పులు, క్రమం తప్పకుండా సర్వీసింగ్ చేయించడం సహా కొన్ని టిప్స్ పాటిస్తే, చక్కటి మైలేజ్ పొందే అవకాశం ఉంటుంది.

⦿ స్మూత్ డ్రైవింగ్ తో మెరుగైన మైలేజ్

కారు మైలేజ్ పెరగాలంటే స్మూత్ డ్రైవింగ్ అనేది చాలా ముఖ్యం. వేగంతా తీసుకెళ్లడం, సడెన్ గా బ్రేకులు వేయడం లాంటి పద్దతులను పూర్తిగా నివారించాలి. హార్డ్ బ్రేకింగ్ అనేది ఫ్యూయెల్ ను వేస్ట్ చేస్తుంది. స్థిరమైన వేగాన్ని కొనసాగించడం, ట్రాఫిక్ కు అనుగుణంగా కారును నడపడం వల్ల ఎక్కువ మైలేజ్ వస్తుంది. బ్రేకులు వేయడానికి బదులుగా, యాక్సిలరేటర్‌ మీద కాలు తీయడం ద్వారా ఇంధన వినియోగాన్ని తగ్గించే అవకాశం ఉంటుంది.

⦿ టైర్ ప్రెజర్‌ చెక్ చేసుకోండి!

కంపెనీ సూచించిన టైర్ ప్రెజర్‌ ను మెయింటెయిన్ చేయాలి. సరైన టైర్ ప్రెజర్ అనేది ఇంధన సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుతుంది. తక్కువ గాలితో కూడిన టైర్లు రోలింగ్ నిరోధకతను పెంచుతాయి. ఇంజిన్ మీద ఎక్కువ భారం పడుతుంది. ఎక్కువ ఇంధనాన్ని వినియోగించేలా చేస్తాయి. ముఖ్యంగా స్టాప్ అండ్ గో సిటీ ట్రాఫిక్‌లో ఇబ్బంది అవుతుంది. రెగ్యులర్ టైర్ ప్రెజర్ చెకింగ్ అనేది మైలేజీ పెంచడంలో సాయపడుతుంది.

⦿ రెగ్యులర్ సర్వీసింగ్  

రెగ్యులర్ గా కారు సర్వీసింగ్ చేయించడం వల్ల ఇంధన సామర్థ్యం పెరుగుతుంది. మొత్తం పనితీరును మెరుగుపరచడంలో సాయపడుతుంది. సకాలంలో ఇంజిన్ ఆయిల్ మార్పులు ఇంజిన్ ను స్మూత్ గా ఉంచేలా చేస్తాయి. అయితే, శుభ్రమైన ఎయిర్ ఫిల్టర్లు వాయు ప్రవాహాన్ని కొనసాగించడం వల్ల మంచి మైలేజ్ లభిస్తుంది. రొటీన్ సర్వీసింగ్ చిన్న సమస్యలను ముందుగానే గుర్తించడంలో సహాయపడుతుంది.

⦿ అనవసరమైన మార్పులు వద్దు

పెద్ద, వెడల్పు టైర్లను అమర్చడంతో పాటు స్పాయిలర్లు లాంటి ఆఫ్టర్ మార్కెట్ యాక్సెసరీస్ ను యాడ్ చేయడం వల్ల కారు ఇంధన సామర్థ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. వాహనం కోసం ప్రత్యేకంగా రూపొందించబడని స్పాయిలర్లు తరచుగా గాలి ప్రవాహాన్ని మెరుగుపరచడానికి బదులుగా అంతరాయం కలిగిస్తాయి. ఏరోడైనమిక్ డ్రాగ్‌ను పెంచుతాయి. ఇంజిన్‌ మీద భారం పడేలా చేస్తాయి. పెద్ద, వెడల్పు టైర్లు రోలింగ్ నిరోధకత పెంచుతాయి. ఫలితంగా మైలేజ్ తగ్గుతుంది.

⦿ అదనపు బరువును తగ్గించండి!

కారులో అదనపు బరువును తగ్గించండి. బూట్‌ లోని అనవసరమైన వస్తువులు లోడ్‌ పడేలా చేస్తాయి. ఇంధన వినియోగాన్ని పెంచుతుంది. రూఫ్ క్యారియర్‌ లు, రూఫ్ మౌంటెడ్ లగేజ్ ముఖ్యంగా హైవే వేగంతో ఏరోడైనమిక్ డ్రాగ్‌ను జోడించడం ద్వారా సామర్థ్యాన్ని మరింత తగ్గిస్తాయి. అందుకే, వీలైనంత వరకు బరువు తక్కువగా ఉండేలా చూసుకోండి.

Read Also: ఈవీ కారు బ్యాటరీ లైఫ్ పెంచుకోవాలంటే, సింపుల్ గా ఈ టిప్స్ పాటించండి!

Related News

ఇండియన్ మార్కెట్ లోకి యమహా NMax 155 ఎంట్రీ, ఫీచర్లు చూస్తే షాక్!

టీవీఎస్, బజాజ్ జోరు.. ఓలా బేజారు.. ఈవీ స్కూటర్ అమ్మకాల్లో టాప్ 5 మోడల్స్ ఇవే!

ఒకే ఇంజిన్.. రెండు బైక్స్.. బుల్లెట్ 650 vs క్లాసిక్ 650 డిఫరెన్స్ ఇవే!

అవెంజర్ లవర్స్ కు గుడ్ న్యూస్.. రెండు రంగుల్లో స్ట్రీట్ 220 మళ్లీ ఎంట్రీ!

95 కి.మీ క్లెయిమ్.. కానీ, నిజంగా ఇ-యాక్సెస్ ఇచ్చిన రేంజ్ ఎంతో తెలుసా?

టాటా మోటార్స్ మాస్టర్ ప్లాన్.. అవిన్యా X లాంచింగ్ డేట్ ఫిక్స్!

మహీంద్రాను దాటేసిన టాటా.. మే 2026 ఈవీ అమ్మకాల్లో సరికొత్త రికార్డు!

పెట్రోల్‌ తో పాటు ఇథనాల్‌ తోనూ పరుగులు.. కొత్త వాగన్ ఆర్ ఫ్లెక్స్ ఫ్యూయల్‌ ప్రత్యేకతలు ఇవే!

Big Stories

×