E-Paper
Advertisement

EV Battery Life: ఈవీ కారు బ్యాటరీ లైఫ్ పెంచుకోవాలంటే, సింపుల్ గా ఈ టిప్స్ పాటించండి!

EV Battery Life: ఈవీ కారు బ్యాటరీ లైఫ్ పెంచుకోవాలంటే, సింపుల్ గా ఈ టిప్స్ పాటించండి!

Electric Car Battery Tips: భారత్ లో ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లు భారీగా పెరుగుతున్నాయి. కాలుష్య రహిత ప్రయాణాల పట్ల ప్రజలు ఆసక్తి చూపించడం, ఛార్జింగ్ మౌలిక సదుపాయాలు పెరగడం, ఒకే ఛార్జ్ తో ఎక్కువ రేంజ్ అందించే మోడల్స్ రావడంతో చాలా మంది ఈవీలను కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారు. నగరాలతో పాటు పట్టణాల్లోనూ EVలను రోజువారీ అవసరాలకు ఉపయోగిస్తున్నారు. అయితే, ఈవీలలో బ్యాటరీ అనేది అత్యంత కీలకం. ఈవీ కారులో అత్యంత ఖరీదైన భాగం బ్యాటరీ. బ్యాటరీ చెడిపోతే ఎక్కువ మొత్తంలో డబ్బులు ఖర్చు అవుతాయి. అందుకే, ఈవీ కారు బ్యాటరీ లైఫ్ పెంచుకోవాలంటే కొన్ని జాగ్రత్తలను తీసుకోవాలి.

EV బ్యాటరీని కాపాడే కీలక అలవాట్లు   

తీవ్రమైన వేడి, చలికి గురికాకుండా చూసుకోవాలి. ఒకవేళ చలికి, వేడికి గురైతే బ్యాటరీ కెమిస్ట్రీ దెబ్బతింటుంది. ఫలితంగా రేంజ్ తగ్గుతుంది. చల్లని ప్రాంతాలలో నివసిస్తే, వాహనాన్ని ప్రీకండిషన్ చేయడం వల్ల బ్యాటరీపై ఒత్తిడి తగ్గి,  ప్రయాణ పరిధి పెరుగుతుంది. గ్యారేజ్ లో లేదంటే నీడ ఉన్న ప్రాంతాలలో పార్కింగ్ చేయడం వల్ల వెదర్ నుంచి కాపాడుకోవచ్చు. డ్రైవింగ్ విధానం కూడా బ్యాటరీ లైఫ్ ను ఎఫెక్ట్ చేస్తుంది. హార్డ్ యాక్సిలరేషన్, ఎమర్జెన్సీ బ్రేకింగ్ బ్యాటరీపై అదనపు భారాన్నీ పెంచుతుంది.  దీని వలన అధిక పవర్ డ్రా షార్ట్ బరస్ట్‌ లు ఏర్పడతాయి. సున్నితమైన యాక్సిలరేషన్, బ్రేకింగ్ బ్యాటరీపై ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి.

ఛార్జింగ్ చేసే పద్ధతులు

20 శాతం నుంచి 80 శాతం మధ్య ఛార్జ్ చేయడం వల్ల బ్యాటరీ హెల్తీగా ఉంటుంది. 100 శాతానికి ఛార్జ్ చేయకూడదు. పూర్తి ఛార్జింగ్‌లు లిథియం-అయాన్ సెల్స్ పై అదనపు ఒత్తిడిని కలిగిస్తాయి. అయితే 20 శాతం కంటే తక్కువ డిశ్చార్జ్‌ లు బ్యాటరీ సామర్థ్యాన్ని, ఛార్జ్‌ ను నిలుపుకునే సామర్థ్యాన్ని క్రమంగా తగ్గించేలా చేస్తాయి. నెమ్మదిగా బ్యాటరీ క్షీణిస్తుంది.

ఎక్కువ రోజులు నడపకుండా ఉంచకండి!

కొంత మంది తమ ఎలక్ట్రిక్ కారును ఎక్కువగా వాడరు. రోజుల తరబడి పార్క్ చేసి ఉంచుతారు. ఎక్కువ రోజులు నడపకపోవడం వల్ల బ్యాటరీ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ఎలక్ట్రిక్ వాహనాన్ని ఎక్కువ రోజు ఉపయోగించకుండా ఉంచడం వల్ల క్రమంగా బ్యాటరీ సామర్థ్యం తగ్గుతుంది.

DC ఫాస్ట్ ఛార్జింగ్‌ వద్దు!  

DC ఫాస్ట్ ఛార్జింగ్ సమయాన్ని ఆదా చేస్తుంది. కానీ, బ్యాటరీపై వేడి, ఒత్తిడి పెరుగుతుంది. ఇది నేరుగా సెల్స్ కు శక్తిని అందిస్తుంది. సాధారణంగా ఫాస్ట్ ఛార్జింగ్‌ను పరిమితం చేయాలని, 7.2kW AC ఛార్జర్‌లపై ఎక్కువగా ఆధారపడాలని నిపుణులు సలహా ఇస్తారు. ఇవి గ్రిడ్ నుంచి ఆల్టర్నేటింగ్ కరెంట్‌ను ఉపయోగిస్తాయి. బ్యాటరీని నెమ్మదిగా, మరింత నియంత్రిత రేటుతో ఛార్జ్ చేస్తాయి.  ఈ టిప్స్ పాటించడం వల్ల బ్యాటరీ ఎక్కువ కాలం హెల్తీగా ఉంటుంది.

Read Also: ఎలక్ట్రిక్ స్కూటర్ vs పెట్రోల్ స్కూటర్, ట్యాక్సీ బిజినెస్ కు ఏది బెస్ట్?

Related News

ఇండియన్ మార్కెట్ లోకి యమహా NMax 155 ఎంట్రీ, ఫీచర్లు చూస్తే షాక్!

టీవీఎస్, బజాజ్ జోరు.. ఓలా బేజారు.. ఈవీ స్కూటర్ అమ్మకాల్లో టాప్ 5 మోడల్స్ ఇవే!

ఒకే ఇంజిన్.. రెండు బైక్స్.. బుల్లెట్ 650 vs క్లాసిక్ 650 డిఫరెన్స్ ఇవే!

అవెంజర్ లవర్స్ కు గుడ్ న్యూస్.. రెండు రంగుల్లో స్ట్రీట్ 220 మళ్లీ ఎంట్రీ!

95 కి.మీ క్లెయిమ్.. కానీ, నిజంగా ఇ-యాక్సెస్ ఇచ్చిన రేంజ్ ఎంతో తెలుసా?

టాటా మోటార్స్ మాస్టర్ ప్లాన్.. అవిన్యా X లాంచింగ్ డేట్ ఫిక్స్!

మహీంద్రాను దాటేసిన టాటా.. మే 2026 ఈవీ అమ్మకాల్లో సరికొత్త రికార్డు!

పెట్రోల్‌ తో పాటు ఇథనాల్‌ తోనూ పరుగులు.. కొత్త వాగన్ ఆర్ ఫ్లెక్స్ ఫ్యూయల్‌ ప్రత్యేకతలు ఇవే!

Big Stories

×