E-Paper
Advertisement

జస్ట్ రూ. 2 లక్షల పెట్టుబడి, లక్షల్లో సంపాదన!

జస్ట్ రూ. 2 లక్షల పెట్టుబడి, లక్షల్లో సంపాదన!
Advertisement

EV Charging Business in India: ఈ రోజుల్లో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం రోజు రోజుకు మరింత పెరుగుతోంది. పెట్రోల్ ధరలు పెరగడం, పర్యావరణంపై అవగాహన కలగడంతో చాలా మంది ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో, చాలా మంది EV ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు మొగ్గు చూపుతున్నారు. తక్కువ ఖర్చుతో ఈవీ స్టేషన్ ను ఏర్పాటు చేసి మంచి వ్యాపార అవకాశంగా మార్చుకుంటున్నారు. కేవలం రూ. 2 లక్షలతో కూడా ఈ వ్యాపారాన్ని ప్రారంభించడం ఇప్పుడు సాధ్యం అవుతుంది. ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం..

తక్కువ పెట్టుబడితో చిన్న ఈవీ స్టేషన్ ఏర్పాటు

చిన్న స్థాయిలో EV ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేయాలంటే పెద్దగా భూమి అవసరం లేదు. ఇంటి ముందు, షాప్ దగ్గర, రోడ్డుకు ఆనుకుని ఉన్న చిన్న స్థలం సరిపోతుంది. ముఖ్యంగా 2-వీలర్, 3 వీలర్ EVలకు ఛార్జింగ్ సదుపాయం కల్పిస్తే ప్రారంభంలోనే మంచి ఆదాయం పొందవచ్చు.

ఈవీ స్టేషన్ కు అయ్యే ఖర్చులు

Advertisement

ఈవీ ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటు అయ్యే ఖర్చులను పరిశీలిస్తే, ఒక సాధారణ AC ఛార్జర్ ధర సుమారు రూ. 50,000 నుంచి రూ. 1 లక్ష వరకు ఉంటుంది.  విద్యుత్ కనెక్షన్, వైరింగ్, మీటర్, చిన్న షెడ్ ఏర్పాటు లాంటి పనులకు మరో రూ. 50,000 నుంచి రూ. 1 లక్ష వరకు ఖర్చవుతుంది. మొత్తం మీద రూ. 2 లక్షలలోపే ఒక చిన్న EV ఛార్జింగ్ పాయింట్ ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటుంది.

కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహకాలు

కేంద్ర ప్రభుత్వం ఈవీ ఛార్జింగ్ రంగాన్ని ప్రోత్సహించేందుకు పలు పథకాలు అందిస్తోంది. ముఖ్యంగా FAME లాంటి పథకాల ద్వారా EV మౌలిక వసతులకు సపోర్టు చేస్తుంది. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సబ్సిడీలు, విద్యుత్ చార్జీలపై రాయితీలు అందిస్తున్నాయి. ఆయా రాష్ట్రాలకు సంబంధించిన EV పాలసీని పరిశీలిస్తే, వాటికి అనుగుణంగా ఎక్కువ ప్రయోజనాలు పొందే అవకాశం ఉంటుంది.

ఆదాయం ఎంత వస్తుందంటే?

Advertisement

ఈవీ స్టేషన్ నుంచి మంచి ఆదాయాన్ని పొందే అవకాశం ఉంటుంది. యూనిట్‌(kWh) ఆధారంగా ఛార్జింగ్ ఫీజు వసూలు చేసుకోవాలి. సాధారణంగా ఒక యూనిట్‌కు రూ. 10 నుంచి రూ. 20 వరకు తీసుకుంటారు. ఒక రోజు 20–30 వాహనాలు వచ్చినా, రోజుకు రూ. 500 నుంచి రూ. 1000 వరకు ఆదాయం రావచ్చు. నెలకు ఇది రూ. 15,000 నుంచి రూ. 30,000 వరకు చేరే అవకాశం ఉంది. ఒకవేళ స్టేషన్ రద్దీ ప్రాంతంలో ఉంటే,  లేదంటే హైవే దగ్గర ఉంటే ఆదాయం మరింత పెరుగుతుంది. భవిష్యత్తులో EVల సంఖ్య పెరుగుతుండటంతో ఈ ఆదాయం కూడా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది.

సో, తక్కువ పెట్టుబడితో, పెద్దగా రిస్క్ లేకుండా ప్రారంభించే మంచి బిజినెస్ ఐడియా ఈవీ ఛార్జింగ్ స్టేషన్. సరైన ప్రదేశం, సరైన ప్లానింగ్ ఉంటే EV ఛార్జింగ్ స్టేషన్ ద్వారా లక్షల్లో ఆదాయం పొందే అవకాశం ఉంటుంది.

Read Also: తక్కువ టైమ్‌ లో ఫుల్ ఛార్జ్.. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉన్న టాప్ EV స్కూటర్లు ఇవే!

Related News

విడా నుంచి కొత్త ఎలక్ట్రిక్ బైక్.. జస్ట్ 100 యూనిట్లే!

కొత్త రెనాల్ట్ డస్టర్ హైబ్రిడ్ వచ్చేసింది, మైలేజ్ ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 650 హైపర్‌ షిఫ్ట్ విడుదల.. ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

ఆడి Q3 అదిరిపోయే ఎంట్రీ.. సేఫ్టీ ఫీచర్లు చూస్తే షాకవ్వాల్సిందే!

టీఎఫ్‌టీ డిస్‌ప్లే, ట్రాక్షన్ కంట్రోల్.. హీరో ఎక్స్‌ ట్రీమ్ 250ఆర్ కార్బన్ అదిరింది గురూ!

ఇండియన్ మార్కెట్ లో ఇక ఈ కారు కనిపించదు, MG ఎందుకు ఈ నిర్ణయం తీసుకుందంటే?

హీరో ఎక్స్‌ ట్రీమ్ 160R 4V కొత్త మోడల్ వచ్చేసింది, ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

హోండా 0 ఆల్ఫా SUV లాంచ్ డేట్ ఫిక్స్.. రేంజ్, ఫీచర్లు చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

Big Stories

Advertisement
×