E-Paper
Advertisement

తక్కువ టైమ్‌ లో ఫుల్ ఛార్జ్.. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉన్న టాప్ EV స్కూటర్లు ఇవే!

తక్కువ టైమ్‌ లో ఫుల్ ఛార్జ్..  ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉన్న టాప్ EV స్కూటర్లు ఇవే!
Advertisement

Best EV Scooters with Fast Charging: ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకునే వాళ్లు గమనించాల్సిన ముఖ్యమైన విషయం  ఫాస్ట్ ఛార్జింగ్. బ్యాటరీ త్వరగా ఛార్జ్ అయితేనే రోజువారీ ప్రయాణం ఈజీగా ఉంటుంది. గంటల కొద్దీ ఎదురు చూడాల్సిన అవసరం లేకుండా, తక్కువ సమయంలోనే స్కూటర్ మళ్లీ రోడ్డు మీదికి వెళ్లేలా ఉండాలి. ఈ నేపథ్యంలో దేశీ మార్కెట్‌ లో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉన్న క్రేజీ ఈవీ స్కూటర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

⦿ సింపుల్ ఎనర్జీ

ఇది ప్రీమియం సెగ్మెంట్‌ కు చెందిన స్కూటర్. పనితీరు చాలా బలంగా ఉంటుంది. ముఖ్యంగా, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో  సుమారు 2 గంటల 15 నిమిషాల్లోనే 0 నుంచి 80% వరకు ఛార్జ్ అవుతుంది. త్వరగా ఛార్జ్ అయ్యే స్కూటర్ కోసం చూస్తున్నవారికి ఇది మంచి ఆప్షన్.

⦿ ఏథర్ 450 సిరీస్

Advertisement

ఆ తర్వాత ఏథర్ 450 సిరీస్ ఉంది. ఏథర్ ఇప్పటికే మార్కెట్‌లో మంచి పేరు సంపాదించుకుంది. 450S, 450X లాంటి మోడళ్లు వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి. వీటిలో 2.9 kWh నుంచి 3.7 kWh వరకు బ్యాటరీ ఆప్షన్స్ ఉన్నాయి. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉన్నప్పటికీ, 0 నుంచి 80% వరకు ఛార్జ్ కావడానికి దాదాపు 4 గంటల 30 నిమిషాలు పడుతుంది. అయితే, 8 సంవత్సరాల వరకు బ్యాటరీ వారంటీ ఇవ్వడంతో వినియోగదారులు ఎక్కువగా ఇష్టపడుతున్నారు.

⦿ టీవీఎస్ ఐక్యూబ్ సిరీస్

టీవీఎస్ ఐక్యూబ్ సిరీస్ కూడా మార్కెట్‌ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. స్టాండర్డ్ వేరియంట్‌లో 2.2 kWh బ్యాటరీ ఉంటుంది. పూర్తి ఛార్జ్‌ పై దాదాపు 90 కి.మీ పైగా రేంజ్ ఇస్తుంది. ఫాస్ట్ ఛార్జింగ్ ద్వారా 0 నుంచి 80% వరకు ఛార్జ్ కావడానికి సుమారు 2 గంటల 45 నిమిషాలు పడుతుంది. ఇది నగర ప్రయాణాలకు చాలా అనుకూలంగా ఉంటుంది.

⦿ బజాజ్ చేతక్

Advertisement

బజాజ్ చేతక్ C2501 కూడా ఈ జాబితాలో బెస్ట్ ఆప్షన్ గా చెప్పుకోవచ్చు. ఇది సరసమైన ధరలో లభిస్తుంది. 2.5 kWh బ్యాటరీతో వచ్చే ఈ స్కూటర్ ఒకసారి ఛార్జ్ చేస్తే 100 కి.మీ పైగా ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది. సుమారు 2 గంటల 25 నిమిషాల్లోనే ఎక్కువ భాగం ఛార్జ్ అవుతుంది. అందుకే ఇది ఫాస్ట్ ఛార్జింగ్ స్కూటర్లలో ఒకటిగా నిలుస్తోంది.

⦿ ఓలా ఎస్1 ప్రో ప్లస్

ఓలా ఎస్1 ప్రో ప్లస్ లాంగ్ రేంజ్ కోసం బాగా పాపులర్ అయ్యింది. 4 kWh, 5.2 kWh బ్యాటరీ ఆప్షన్లతో వస్తుంది.  పూర్తి ఛార్జ్‌తో 300 కి.మీ పైగా ప్రయాణం చేయవచ్చు. ఫాస్ట్ ఛార్జింగ్ విషయంలో కూడా ఇది ముందుంటుంది. 15 నిమిషాల్లోనే సుమారు 50 కి.మీ రేంజ్ అందిస్తుంది. త్వరగా బయటకు వెళ్లాల్సిన పరిస్థితుల్లో ఇది చాలా ఉపయోగపడుతుంది.

Read Also: మడతపెట్టే ఈవీ స్కూటర్ వచ్చేసింది.. బరువు జస్ట్ 20 కేజీలే!

Related News

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

లాంచ్‌కు ముందే క్రేజీ డీటైల్స్ లీక్.. కొత్త బ్రెజ్జాలో ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

టీవీఎస్ నుంచి సూపర్ సర్‌ ప్రైజ్.. ఒకేసారి 3 మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

కొత్త బ్రెజ్జా To హిలక్స్.. 10 రోజుల్లో 3 క్రేజీ మోడల్స్ ఎంట్రీ!

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

EV బ్యాటరీల్లో ఏది సేఫ్? కొనుగోలు చేసే ముందు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

Big Stories

Advertisement
×