E-Paper
Advertisement

ఒకే ఛార్జ్ తో 1400 కి.మీ రేంజ్, హువావే హైటెక్ లగ్జరీ కారు ఏముంది భయ్యా!

ఒకే ఛార్జ్ తో 1400 కి.మీ రేంజ్, హువావే హైటెక్ లగ్జరీ కారు ఏముంది భయ్యా!
Advertisement

Huawei AITO M9: చైనీస్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ హువావే ఎప్పటికప్పుడు సరికొత్త కార్లు అందుబాటులోకి తీసుకొస్తుంది. తాజాగా ఈ కంపెనీ ఐటో M9 అనే ప్రీమియం లగ్జరీ SUVని విడుదల చేసింది. ప్రస్తుతం చైనా మార్కెట్‌ లో ఈ కారు మంచి గుర్తింపు తెచ్చుకుంది. పూర్తిగా హైటెక్ ఫీచర్లతో ఈ కారు ఆకట్టుకుంటుంది. ఈ కారు రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఒకటి పూర్తిగా ఎలక్ట్రిక్ (EV) కాగా, మరొకటి రేంజ్ ఎక్స్‌ టెండెడ్ వెహికల్ (EREV).

ఇంతకీ ఈ కారు ప్రత్యేకత ఏంటంటే?

ఈ SUVలో హువావే ప్రత్యేకంగా అభివృద్ధి చేసిన హార్మోనీOS సిస్టమ్ ఉపయోగించారు. ఇది వాహనంలోని అన్ని ఫంక్షన్లను స్మార్ట్‌గా నియంత్రించడానికి సాయపడుతుంది. హువావే ADS డ్రైవింగ్ అసిస్టెన్స్ టెక్నాలజీ వల్ల డ్రైవింగ్ మరింత సురక్షితంగా, సౌకర్యవంతంగా ఉంటుంది. రోడ్లపై స్మార్ట్‌  పనితీరును కనబరుస్తుంది. ఈ సిస్టమ్ డ్రైవర్‌ కు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

ఆకట్టుకునేలా డిజైన్

Advertisement

డిజైన్ పరంగా ఐటో M9 పెద్ద,  ఆకర్షణీయమైన SUVగా కనిపిస్తుంది. లోపల ఆరుగురు కూర్చునే విధంగా సీటింగ్ ఉంటుంది. ముఖ్యంగా జీరో గ్రావిటీ సీట్లు ప్రయాణికులకు అత్యంత సౌకర్యాన్ని అందిస్తాయి. హై క్వాలిటీ లెదర్ మెటీరియల్, పెద్ద స్క్రీన్లు, లేటెస్ట్ డాష్‌ బోర్డ్ తో ప్రీమియం ఫీలింగ్‌ను ఇస్తాయి.

ఫీచర్ల గురించి..

ఇందులో ఉన్న టెక్నాలజీ ఫీచర్ల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. 12.3 ఇంచ్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 15.6-ఇంచ్ సెంట్రల్ టచ్‌ స్క్రీన్, అలాగే ప్యాసింజర్ కోసం అదనపు స్క్రీన్ ఉంటుంది. పెద్ద AR-HUD డిస్‌ ప్లే డ్రైవర్‌ కు ముఖ్యమైన సమాచారాన్ని చూపిస్తుంది. వెనుక సీట్ల కోసం ఆప్షనల్ గా ప్రొజెక్టర్ స్క్రీన్ కూడా ఉంటుంది. ఇది కదిలే కారులో థియేటర్ అనుభూతిని అందిస్తుంది. ప్రయాణాన్ని మరింత ఎంటర్‌ టైన్‌మెంట్‌ గా మార్చుతుంది.

ఒకే ఛార్జ్ తో 1400 కి.మీ రేంజ్

Advertisement

ఈ కారు పనితీరు విషయానికి వస్తే, EREV మోడల్‌ లో 1.5 లీటర్ టర్బో ఇంజిన్ బ్యాటరీకి సపోర్టుగా పనిచేస్తుంది. ఇది చాలా ఎక్కువ రేంజ్‌ను అందిస్తుంది. సుమారు 1400 కి.మీ వరకు ప్రయాణించే అవకాశం ఉంటుంది. అలాగే, 4WD సిస్టమ్ ఉండటం వల్ల రోడ్డు పరిస్థితులు ఎలా ఉన్నా మంచి గ్రిప్, కంట్రోల్ లభిస్తుంది.

పటిష్టమైన భద్రత..

భద్రతా ఫీచర్ల విషయంలోనూ ఈ SUV ముందుంటుంది. ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, ఇంటెలిజెంట్ బాడీ కంట్రోల్ లాంటి ఫీచర్లు ప్రమాదాలను తగ్గించడంలో సహాయపడతాయి. ఛార్జింగ్ కూడా వేగంగా పూర్తవుతుంది. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో జస్ట్ 15 నిమిషాల్లోనే 80 శాతం ఛార్జ్ చేసుకునే అవకాశం ఉంటుంది.

Read Also: టాటా మోటార్స్ సర్ప్రైజ్.. 7 సీటర్ ఎలక్ట్రిక్ సఫారీ వచ్చేస్తోంది!

Related News

వోక్స్‌ వ్యాగన్ కార్లపై కళ్లు ఆఫర్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ.6 లక్షల తగ్గింపు!

సింగిల్ ఛార్జ్ తో 243 కి.మీ రేంజ్.. సింపుల్ వేవ్ సూపర్ స్కూటర్ వచ్చేసింది!

2027లో కొత్త నెక్సాన్.. డిజైన్ నుంచి ఇంజిన్ వరకు అన్నీ మారనున్నాయా?

5 ఏళ్ల తర్వాత పజెరో రీఎంట్రీ.. కొత్త లుక్‌తో మిత్సుబిషి బిగ్ సర్‌ప్రైజ్!

EV కొనేముందు ఈ విషయం చెక్ చేశారా? లేదంటే ఇబ్బందులు తప్పవు!

టాటా దూకుడు.. మహీంద్రా జోరు! ఆగస్టు అమ్మకాల్లో ఎవరు టాప్?

హోండా కొత్త ఈ-స్కూటర్‌కు పేటెంట్.. స్పీడ్ ఎంతో తెలిస్తే వావ్ అనాల్సిందే!

100 కి.మీ స్పీడ్.. 200 కి.మీ రేంజ్.. ఆంపియర్ కొత్త ఎలక్ట్రిక్ బైక్‌కు పేటెంట్!

Big Stories

Advertisement
×