E-Paper
Advertisement

హ్యుందాయ్ బేయాన్ ధర రేపే విడుదల.. బేసిక్ మోడల్ రేటు ఎంత ఉండొచ్చంటే?

హ్యుందాయ్ బేయాన్ ధర రేపే విడుదల.. బేసిక్ మోడల్ రేటు ఎంత ఉండొచ్చంటే?
Advertisement

Hyundai Bayon Price: హ్యుందాయ్ మోటార్ ఇండియా నుంచి కొత్త SUV కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్. హ్యుందాయ్ బేయాన్ ధరలను కంపెనీ అక్టోబర్ 26న వెల్లడించనుంది. ఈ SUV ప్రారంభ ధర రూ.9.5 లక్షల వరకు ఉండొచ్చని  తెలుస్తోంది. టాప్ వేరియంట్ ధర రూ.15.5 లక్షల వరకు ఉండే అవకాశం ఉంది. అయితే, కంపెనీ అధికారికంగా ప్రకటించిన తర్వాతే అసలు ధరలపై క్లారిటీ వస్తుంది.

ఐదు వేరియంట్లలో హ్యుందాయ్ బేయాన్

హ్యుందాయ్ బేయాన్ ఐదు వేరియంట్లలో అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. అవి HX2, HX4, HX6, HX8, HX10. బేస్ వేరియంట్ HX2 ధర సుమారు రూ.9.5 లక్షలు ఉండొచ్చని అంచనా. HX4 ధర రూ.10.5 లక్షల వరకు ఉండవచ్చు. HX6 ధర రూ.12.5 లక్షల నుంచి రూ.13.5 లక్షల మధ్య, HX8 ధర రూ.13.5 లక్షల నుంచి రూ.14.5 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంది. టాప్ వేరియంట్ HX10 ధర రూ.15.5 లక్షల వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.

బుకింగ్స్, డెలివరీలు ఎప్పటి నుంచి?

Advertisement

కొత్త హ్యుందాయ్ బేయాన్‌ను రూ.11,000 టోకెన్ మొత్తంతో ప్రీ బుక్ చేసుకోవచ్చు. ఆన్‌ లైన్‌ తో పాటు హ్యుందాయ్ డీలర్‌ షిప్‌ లలోనూ బుకింగ్ చేసుకునే అవకాశం ఉంది. డెలివరీలు 2026 నవంబర్ మొదటి వారంలో ప్రారంభమవుతాయని తెలుస్తోంది. అయితే, బుకింగ్స్, డెలివరీలకు సంబంధించిన వివరాలను కంపెనీ అధికారికంగా ప్రకటించనుంది.

ఇంజిన్, గేర్‌ బాక్స్ వివరాలు..

భారత మార్కెట్ కోసం బేయాన్‌లో 1.5 లీటర్ నాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌ను అందించనున్నట్లు తెలుస్తోంది. ఈ ఇంజిన్ 115 PS పవర్, 144 Nm టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 6 స్పీడ్ మాన్యువల్, IVT ఆటోమేటిక్ గేర్‌ బాక్స్ ఎంపికలు ఉండొచ్చు. ఎకో, నార్మల్, స్పోర్ట్ అనే మూడు డ్రైవ్ మోడ్‌లు కూడా ఉండనున్నట్లు తెలుస్తోంది. భవిష్యత్తులో CNG వెర్షన్‌ను తీసుకొచ్చే అవకాశం ఉంది.

డిజైన్ ప్రత్యేకతలు..

Advertisement

హ్యుందాయ్ బేయాన్ పొడవు 4,245 మి.మీ., వెడల్పు 1,810 మి.మీ., ఎత్తు 1,605 మి.మీ. వీల్‌బేస్ 2,600 మి.మీ. కాగా, గ్రౌండ్ క్లియరెన్స్ 205 మి.మీ. బూట్ స్పేస్ 505 లీటర్లుగా ఉండనుంది. షార్ప్ బాడీ లైన్లు, LED లైట్లు, చతురస్రాకార వీల్ ఆర్చ్‌ లు ఈ SUVకి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.

టెక్నాలజీ, భద్రతా ఫీచర్లు

ఈ SUVలో డ్యూయల్ 12.3 అంగుళాల స్క్రీన్లు, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, సన్‌రూఫ్, బోస్ 8-స్పీకర్ ఆడియో సిస్టమ్ లాంటి ఫీచర్లు ఉండొచ్చని సమాచారం. అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ అసిస్ట్, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్‌తో కూడిన లెవెల్ 2 ADAS కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. 360 డిగ్రీల కెమెరా, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ESC, TPMS లాంటి భద్రతా ఫీచర్లు కూడా అందించనున్నట్లు తెలుస్తోంది.

Read Also: మారుతి విక్టోరిస్ ఆరం ఎడిషన్ వచ్చేసింది.. జస్ట్ రూ.22,990కే కొత్త యాక్సెసరీస్ కిట్!

Tags

Related News

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ పడిపోదు.. భారత్‌లో కొత్త BMW మోడల్ కు పేటెంట్!

సింపుల్ వేవ్ ఈవీలపై సూపర్ ఫెస్టివ్ ఆఫర్లు, బాబోయ్.. అంత తగ్గింపా?

డెంజా లాంచ్ డేట్ ఫిక్స్.. 600 కి.మీ. రేంజ్‌ తో అదరగొట్టేలా!

మారుతి విక్టోరిస్ ఆరం ఎడిషన్ వచ్చేసింది.. జస్ట్ రూ.22,990కే కొత్త యాక్సెసరీస్ కిట్!

సింగిల్ ఛార్జింగ్‌తో 343 కి.మీ రేంజ్.. కొత్త ఎలక్ట్రిక్ బైక్ వచ్చేసింది!

డుకాటి ఫార్ములా 73 విడుదల, లుక్ చూస్తే మతిపోవాల్సిందే!

TFT డిస్‌ ప్లే, క్విక్‌షిఫ్టర్‌.. అదిరిపోయే ఫీచర్లతో పల్సర్ NS200 గ్రాండ్ ఎంట్రీ!

Big Stories

Advertisement
×