E-Paper
Advertisement

మారుతి విక్టోరిస్ ఆరం ఎడిషన్ వచ్చేసింది.. జస్ట్ రూ.22,990కే కొత్త యాక్సెసరీస్ కిట్!

మారుతి విక్టోరిస్ ఆరం ఎడిషన్ వచ్చేసింది.. జస్ట్ రూ.22,990కే కొత్త యాక్సెసరీస్ కిట్!
Advertisement

Maruti Victoris Arum Edition: మారుతి సుజుకి మిడ్‌ సైజ్ SUV విక్టోరిస్ కోసం కొత్త ఆరం ఎడిషన్ యాక్సెసరీస్ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. భారత మార్కెట్లో విక్టోరిస్ విడుదలై ఏడాది పూర్తయిన సందర్భంగా స్పెషల్  ప్యాకేజీని తీసుకొచ్చింది. రూ.22,990 ధర కలిగిన ఈ కిట్‌ తో SUVకి మరింత ఆకట్టుకునే లుక్ ఇవ్వడంతో పాటు, క్యాబిన్‌ లో అదనపు సదుపాయాలను అందిస్తోంది. అయితే, ఇది పూర్తిగా కొత్త వేరియంట్ కాదు. విక్టోరిస్ స్ట్రాంగ్ హైబ్రిడ్ మోడళ్లకు అందించే యాక్సెసరీస్ ప్యాకేజీ మాత్రమే.

బయట కాపర్ ఇన్సర్ట్స్.. అడిషనల్ క్రోమ్ హంగులు

విక్టోరిస్ ఆరం ఎడిషన్‌లో ప్రధానంగా కారు బయటి రూపాన్ని మెరుగుపరిచే కాస్మెటిక్ మార్పులపై దృష్టి పెట్టారు. ముందు, వెనుక, పక్క భాగాల్లోని స్కిడ్ ప్లేట్లకు కాపర్ రంగు ఇన్సర్ట్స్‌ ను అందించారు. ఇవి SUVకి ప్రత్యేకమైన లుక్‌ను తీసుకొస్తాయి. దీనితో పాటు గ్రిల్, ఫెండర్లు, బంపర్లు, సైడ్ మౌల్డింగ్‌లు, డోర్ వైజర్లపై అదనపు క్రోమ్ ట్రిమ్‌ను అమర్చుకోవచ్చు. ఈ మార్పుల వల్ల సాధారణ విక్టోరిస్‌తో పోలిస్తే ఆరం ఎడిషన్ మరింత ప్రత్యేకంగా కనిపిస్తుంది.

క్యాబిన్‌ లోనూ అదనపు సదుపాయాలు

Advertisement

బయటి మార్పులతో పాటు ఇంటీరియర్‌ లో కూడా కొన్ని యాక్సెసరీస్‌ ను యాడ్ చేర్చారు. ఆల్ వెదర్ 3D ఫ్లోర్ మ్యాట్స్, 3D బూట్ మ్యాట్, బూట్ సిల్ గార్డ్ ఈ కిట్‌ లో భాగంగా ఉన్నాయి. వర్షాకాలంలో లేదంటే రోజువారీ ప్రయాణాల్లో కారులోకి వచ్చే దుమ్ము, తేమ నుంచి ఫ్లోర్‌ ను రక్షించడంలో ఫ్లోర్ మ్యాట్స్ సాయపడుతాయి. బూట్ మ్యాట్, సిల్ గార్డ్ కూడా లగేజీని లోడ్ చేయడం, దించడం సమయంలో వెనుక భాగాన్ని ప్రొటెక్ట్ చేయడంలో ఉపయోగపడతాయి.

కేవలం స్ట్రాంగ్ హైబ్రిడ్ వేరియంట్లకే..

ఈ ఆరం ఎడిషన్ యాక్సెసరీస్ ప్యాకేజీ విక్టోరిస్ స్ట్రాంగ్-హైబ్రిడ్ వేరియంట్లకు మాత్రమే అందుబాటులో ఉంది. ఈ వేరియంట్ల ఎక్స్‌షోరూమ్ ధరలు రూ.16.43 లక్షల నుంచి రూ.19.99 లక్షల వరకు ఉన్నాయి. కిట్ ధర రూ.22,990 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. కొనుగోలు చేసే ముందు తమ వేరియంట్‌కు ఈ ప్యాకేజీ అందుబాటులో ఉందో లేదో డీలర్ దగ్గర తెలుసుకోవడం మంచిది.

28.65 కిలోమీటర్ల మైలేజ్‌  

Advertisement

విక్టోరిస్ స్ట్రాంగ్-హైబ్రిడ్‌లో 1.5 లీటర్ల, మూడు సిలిండర్ల నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌తో పాటు ఎలక్ట్రిక్ మోటార్, చిన్న బ్యాటరీ ప్యాక్ ఉంటాయి. ఈ హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్ మొత్తం 116hp పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. e-CVT ఆటోమేటిక్ ట్రాన్స్‌ మిషన్ ద్వారా ముందు వీల్స్ కు పవర్ అందుతుంది. ఈ SUV మైలేజ్ లీటరుకు 28.65 కిలోమీటర్లుగా ఉంటుందని మారుతి ప్రకటించింది. స్టైలింగ్‌కు ఇంపార్టెన్స్ ఇచ్చే హైబ్రిడ్ విక్టోరిస్ యజమానులకు ఆరం ఎడిషన్ కిట్ ఒక అడిషనల్ ఆప్షన్ కానుంది.

Read Also: బేయాన్ To 0 ఆల్ఫా.. డిసెంబర్ లో మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనున్న 4 క్రేజీ SUVలు!

Tags

Related News

డెంజా లాంచ్ డేట్ ఫిక్స్.. 600 కి.మీ. రేంజ్‌ తో అదరగొట్టేలా!

సింగిల్ ఛార్జింగ్‌తో 343 కి.మీ రేంజ్.. కొత్త ఎలక్ట్రిక్ బైక్ వచ్చేసింది!

డుకాటి ఫార్ములా 73 విడుదల, లుక్ చూస్తే మతిపోవాల్సిందే!

TFT డిస్‌ ప్లే, క్విక్‌షిఫ్టర్‌.. అదిరిపోయే ఫీచర్లతో పల్సర్ NS200 గ్రాండ్ ఎంట్రీ!

వెదురుతో పెట్రోల్.. 10 నిమిషాల్లోనే తయారీ, లీటర్ ధర ఎంతో తెలుసా?

కార్లలో ఇకపై బ్లాక్ బాక్స్.. ప్రమాదం ఎలా జరిగిందో చెప్పేస్తుందట, ఇదిగో ఇలా..

బేయాన్ To 0 ఆల్ఫా.. డిసెంబర్ లో మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనున్న 4 క్రేజీ SUVలు!

Big Stories

Advertisement
×