E-Paper
Advertisement

EV Cars Comparison: హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ vs మారుతి సుజుకి ఈ విటారా.. వీటిలో ఏది బెస్ట్?

EV Cars Comparison: హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ vs మారుతి సుజుకి ఈ విటారా.. వీటిలో ఏది బెస్ట్?
Advertisement

Hyundai Creta Electric vs Maruti Suzuki Evitara:  దేశీయ ఆటో మోబైల్ రంగంలోకి సరికొత్త ఎలక్ట్రిక్ వెహికల్స్(EV) అందుబాటులోకి వస్తున్నాయి. మారుతి సుజుకి తన మొదటి EV ఈవిటారాను త్వరలో విడుదల చేయబోతోంది. ఈ ఏడాది ప్రారంభంలో అందుబాటులోకి వచ్చిన హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ కు గట్టి పోటీ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ రెండు కార్లు పరిమాణంలో సమానంగా ఉన్నా, బ్యాటరీ, పరిధి విషయంలో విభిన్నంగా ఉన్నాయి.  ఇంతకీ ఈ రెండు కార్ల మధ్య ఉన్న తేడాలు ఏంటి? ఏ కారు బెస్ట్? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

⦿ క్రెటా ఎలక్ట్రిక్ vs సుజుకి ఈవిటారా

 

 క్రెటా ఎలక్ట్రిక్:

Advertisement

ఇది రెండు బ్యాటరీ ఆప్షన్స్ లో అందుబాటులోకి వస్తుంది. 42 kWh (420-కిమీ రేంజ్), 51.4 kWh (510 కిమీ రేంజ్)ను కలిగి ఉంటుంది. ఇది ఛార్జింగ్ పోర్ట్‌ తో పిక్సలేటెడ్ ప్యాటర్న్ ఫ్రంట్ గ్రిల్‌ ను కలిగి ఉంటుంది. అల్లాయ్ వీల్ డిజైన్ ప్రత్యేకంగా ఉంటుంది. ఫ్లోర్‌ లో బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఇంజిన్ స్థానంలో మోటారు,  ఫ్రంట్ ట్రంక్ ఉన్నాయి. ఇది డ్యూయల్ స్క్రీన్ సెటప్‌ తో నిర్దిష్ట యూజర్ ఇంటర్‌ఫేస్‌ను కలిగి ఉంటుంది.

eVitara:

ఇది ప్రత్యేకమైన EV ప్లాట్‌ ఫామ్‌ పై నిర్మించబడింది. రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్ తో వస్తుంది. 49 kWh (346-కిమీ రేంజ్), 61 kWh (428 కిమీ రేంజ్)ను కలిగి ఉంటుంది. ఇది క్లోజ్డ్ గ్రిల్,  సన్నని LED హెడ్‌ ల్యాంప్‌ లతో చక్కటి ఫ్రంట్ ఫాసియాను కలిగి ఉంది. ఇది ఫ్లష్ టైప్ డోర్ హ్యాండిల్స్,  బ్లూ యాక్సెంట్లను కలిగి ఉంది. పొడవు 4,275 మిమీ, వీల్‌ బేస్ 2,700 మిమీని కలిగి ఉంటుంది. ఇది వెంటిలేటెడ్ సీట్లు, డ్యూయల్ టోన్ డాష్‌ బోర్డ్, 10.25 అంగుళాల టచ్‌ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్,  ఆండ్రాయిడ్ ఆటో/ఆపిల్ కార్‌ ప్లే, అధునాతన డిజిటల్ క్లస్టర్‌ తో వస్తుంది.

⦿ డ్రైవింగ్

Advertisement

 

క్రెటా ఎలక్ట్రిక్:

ఫ్లోర్‌ లో బ్యాటరీ ప్యాక్ ఉన్నందున, సీటింగ్ పొజిషన్ ఎక్కువగా ఉంటుంది. సస్పెన్షన్ స్ట్రాంగ్ గా ఉంటుంది. గతుకుల రోడ్డు మీద కొంచెం హార్ట్ గా అనిపిస్తుంది.  మృదువైన రోడ్లపై స్మూత్ గా వెళ్తుంది. ఎకో, నార్మల్, స్పోర్ట్ మోడ్‌ లో థ్రాటిల్ రెస్పాన్స్ డిఫరెంట్ గా ఉంటుంది. స్పోర్ట్ మోడ్‌ లో, క్రెటా ఎలక్ట్రిక్ కేవలం 7.9 సెకన్లలో 0-100 కిమీ/గం వేగాన్ని అందుకుంటుంది.

eVitara:

నివేదికల ప్రకారం 61-kWh వేరియంట్ 8.7 సెకన్లలో 0-100 స్ప్రింట్‌ ను అందుకుంటుంది. బహుశా ఇది అత్యంత వేగవంతమైన మారుతి సుజుకి కారుగా గుర్తింపు తెచ్చుకోనుంది. కానీ, క్రెటా ఎలక్ట్రిక్ కంటే నెమ్మదిగా ఉంటుంది.

⦿ ధర

 

క్రెటా ఎలక్ట్రిక్:

42-kWh వేరియంట్‌ ధర రూ. 18.02 లక్షల నుంచి రూ. 22.33 లక్షల వరకు ఉంటుంది. 51.4 kWh వేరియంట్‌ ధర రూ. 19.99 లక్షల నుంచి రూ. 24.69 లక్షల వరకు ఉంది.

eVitara:  

దీని ధర కూడా క్రెటా ఎలక్ట్రిక్ ధరకు కాస్త అటు ఇటుగా ఉంటుందని ఆటో నిపుణులు అంచనా వేస్తున్నారు.

Read Also: క్రాష్ టెస్టులో జీరో రేటింగ్, ఈ కారులో జర్నీ అంటే ప్రాణాలను అరచేతిలో పెట్టుకోవాల్సిందే!

Related News

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

EV బ్యాటరీల్లో ఏది సేఫ్? కొనుగోలు చేసే ముందు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

వర్షాకాలంలో ఎలక్ట్రిక్ కారు కొనాలనుకుంటున్నారా? ఈ 4 మోడల్స్ బెస్ట్ ఛాయిస్!

కియా సైరోస్ EV vs కియా సైరోస్ ICE.. ఏది బెస్ట్? పూర్తి పోలిక ఇదే!

16 ఏళ్ల తర్వాత నిస్సాన్ మాస్టర్‌ పీస్.. కొత్త ఎల్గ్రాండ్ వచ్చేసింది!

భారత మార్కెట్ లోకి చౌకైన 7-సీటర్‌.. ఏంటీ.. ధర మరీ అంత తక్కువా?

MG కొత్త EV వచ్చేస్తోంది.. 600 కి.మీ రేంజ్‌తో అదిరే ఎంట్రీ!

సింగిల్ ఛార్జ్ తో 500 కి.మీ ప్రయాణం.. మార్కెట్ లో దుమ్మురేపబోతున్న హ్యుందాయ్ ఈవీ!

Big Stories

Advertisement
×