E-Paper
Advertisement

Hyundai Exter facelift: హ్యుందాయ్ నుంచి కొత్త ఎక్స్టర్ ఫేస్‌లిఫ్ట్.. ధర జస్ట్ రూ. 5.80 లక్షలు!

Hyundai Exter facelift: హ్యుందాయ్ నుంచి కొత్త ఎక్స్టర్ ఫేస్‌లిఫ్ట్.. ధర జస్ట్ రూ. 5.80 లక్షలు!
Advertisement

Hyundai Exter facelift launched: దిగ్గజ ఆటో మోబైల్ సంస్థ హ్యుందాయ్ మోటార్ ఇండియా.. సరికొత్త  ఎక్స్టర్ ఫేస్‌లిఫ్ట్ ను లాంచ్ చేసింది. ఈ కారు ప్రారంభం ధరను రూ. 5.80 లక్షలు(ఎక్స్ షోరూమ్) గా నిర్ణయించింది. హైఎండ్ కారు ధర రూ. 9.42 లక్షల వరకు ఉంటుంది. అప్‌ డేట్ చేసిన ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీ,  ప్రస్తుత పవర్‌ ట్రెయిన్ ఆప్షన్లను అలాగే ఉంచుతూ, డిజైన్, ఇంటీరియర్స్, ఫీచర్లు, భద్రతకు సంబంధించి పలు కీలక మార్పులు చేసింది. పట్టణ కొనుగోలుదారులు, యువతను ఆకట్టుకునేలా కొత్త ఎక్స్టర్ 25కు పైగా మార్పులతో తీసుకొచ్చినట్లు హ్యుందాయ్ వెల్లడించింది.

ఎక్స్టర్ ఫేస్‌లిఫ్ట్ డిజైన్

ఎక్స్టర్ ఫేస్‌లిఫ్ట్ ముందు భాగాన్ని పెద్ద గ్రిల్, కొత్త సెంటర్ గార్నిష్, అప్‌ డేట్ చేసిన బంపర్లను తీసుకొచ్చారు. ఇది మరింత బలమైన రూపాన్ని అందిస్తుంది. వెనుక వైపు, కొత్త టెయిల్‌ గేట్, సి పిల్లర్ గార్నిష్‌లు, షార్ప్, స్పోర్టియర్ లుక్ ను  అందిస్తాయి. అదే సమయంలో వింగ్ టైప్ స్పాయిలర్ మరింత లుక్ తో ఆకట్టుకుంటుంది.  ఈ SUV 15 అంగుళాల డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్, మరింత స్పష్టమైన వీల్ ఆర్చ్ క్లాడింగ్‌ను కలిగి ఉంటుంది. క్యాబిన్ స్పేస్, సౌకర్యాని అనుకూలంగా ఉంటుంది.

ఇంటీరియర్ డిజైన్

Advertisement

క్యాబిన్ లోపల, ఎక్స్టర్ మరింత ప్రీమియం లుక్ ను కలిగి ఉంటుంది. డ్యూయల్ టోన్ నేవీ బ్లూ, గ్రే ఇంటీరియర్ థీమ్‌ను కలిగి ఉంది. డాష్‌ బోర్డ్‌ పై కొత్త 3D కార్బన్ ప్యాటర్న్ ఫినిషింగ్ ఉంటుంది. డి కట్ స్టీరింగ్ వీల్, సెగ్మెంట్‌ లో మొదటిసారిగా మెటల్ పెడల్స్‌ తో క్యాబిన్ మరింత స్పోర్టీగా కనిపిస్తుంది. ఫోల్డింగ్ డ్రైవర్ ఆర్మ్‌ రెస్ట్, సవరించిన సీట్ అప్‌హోల్స్టరీ, మెరుగైన ఎర్గోనామిక్స్ తో సౌకర్యం, ప్రాక్టికాలిటీ అనుకూలంగా ఉంటుంది. ఈ ఎస్‌యూవీ 391 లీటర్ల బూట్ స్పేస్‌తో పాటు విశాలమైన క్యాబిన్‌ను కలిగి ఉంటుంది.

ఫీచర్లు

ఈ సెగ్మెంట్‌ లో మొదటిసారిగా డాష్‌ క్యామ్‌ను తీసుకొచ్చింది. అదనపు భద్రత, సౌకర్యాన్ని అందిస్తుంది. ఈ ఎస్‌యూవీ వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ ప్లేతో పాటు, వెనుక ప్రయాణీకుల కోసం టైప్ సి యూఎస్‌బి పోర్ట్‌ ను కూడా అందిస్తుంది.  హ్యుందాయ్, ఎక్స్‌ టర్‌ లో బ్లూలింక్ ద్వారా 60కి పైగా కనెక్టెడ్ కార్ ఫీచర్లను, అలాగే ఇంటర్నెట్ కనెక్టివిటీ లేకుండా కూడా పనిచేయగల 300కు పైగా ఇన్ బిల్ట్ వాయిస్ కమాండ్స్ ను పొందుపరిచింది. ఎలక్ట్రిక్ సన్‌ రూఫ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, మ్యాప్స్, ఇన్ఫోటైన్‌మెంట్ కోసం OTA అప్‌డేట్స్ లాంటి ఇప్పటికే ఉన్న ఫీచర్లు కొనసాగుతున్నాయి.

పవర్‌ ట్రెయిన్, భద్రత

Advertisement

మెకానికల్‌గా, ఎక్స్‌ టర్‌ లో ఎలాంటి మార్పులు లేవు. ఇది 1.2-లీటర్, నాలుగు-సిలిండర్ల కప్పా పెట్రోల్ ఇంజన్‌తో పనిచేస్తుంది. ఇది మాన్యువల్, AMT ట్రాన్స్‌ మిషన్ ఆప్షన్లతో అందుబాటులో ఉంది. కొత్త ఎక్స్టర్‌లో భద్రతను మరింత పటిష్టం చేశారు.  హ్యుందాయ్ మొత్తం 45కు పైగా భద్రతా ఫీచర్లను అందిస్తోంది. అదనపు ఫీచర్లలో ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ స్టార్ట్ అసిస్ట్ కంట్రోల్ ప్రామాణికంగా ఉన్నాయి. అన్ని వేరియంట్లలో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్నాయి.

Read Also: అమ్మకాల్లో దుమ్మురేపిన మారుతి డిజైర్.. 30 లక్షల సేల్స్ వెనుక సీక్రెట్ ఏంటి?

Related News

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

EV బ్యాటరీల్లో ఏది సేఫ్? కొనుగోలు చేసే ముందు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

వర్షాకాలంలో ఎలక్ట్రిక్ కారు కొనాలనుకుంటున్నారా? ఈ 4 మోడల్స్ బెస్ట్ ఛాయిస్!

కియా సైరోస్ EV vs కియా సైరోస్ ICE.. ఏది బెస్ట్? పూర్తి పోలిక ఇదే!

16 ఏళ్ల తర్వాత నిస్సాన్ మాస్టర్‌ పీస్.. కొత్త ఎల్గ్రాండ్ వచ్చేసింది!

భారత మార్కెట్ లోకి చౌకైన 7-సీటర్‌.. ఏంటీ.. ధర మరీ అంత తక్కువా?

MG కొత్త EV వచ్చేస్తోంది.. 600 కి.మీ రేంజ్‌తో అదిరే ఎంట్రీ!

సింగిల్ ఛార్జ్ తో 500 కి.మీ ప్రయాణం.. మార్కెట్ లో దుమ్మురేపబోతున్న హ్యుందాయ్ ఈవీ!

Big Stories

Advertisement
×