E-Paper
Advertisement

Viral video: ఇన్‌ఫ్లుయెన్సర్‌ రీల్‌.. షేర్‌ చేసిన ప్రధాని మోదీ.. దేని గురించంటే?

Viral video: ఇన్‌ఫ్లుయెన్సర్‌ రీల్‌.. షేర్‌ చేసిన ప్రధాని మోదీ.. దేని గురించంటే?
Advertisement

Viral video: సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ యువరాజ్ దువా చేసిన ఒక సరదా వీడియోపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించిన తీరు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. తన తండ్రి మితిమీరిన తీపి పదార్థాలు (చక్కెర) తింటున్నారని, ఆయనకు నచ్చజెప్పడం తన వల్ల కావడం లేదని యువరాజ్ ఒక రీల్ చేశారు. ‘నేను చెబితే మా నాన్న వినడం లేదు, కనీసం మీరైనా చెప్పండి మోదీ జీ’ అంటూ ప్రధానిని ట్యాగ్ చేస్తూ ఆ వీడియోను పోస్ట్ చేశారు.

సాధారణంగా ఇలాంటి ట్యాగ్‌లకు స్పందన రావడం అరుదు, కానీ ప్రధాని మోదీ ఈ వీడియోను స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ సందర్భంగా యువరాజ్ తండ్రితో పాటు దేశ ప్రజలందరికీ ప్రధాని ఒక ముఖ్యమైన సందేశాన్ని ఇచ్చారు. ‘చక్కెర వాడకాన్ని తగ్గించండి, యోగాను మీ జీవనశైలిలో భాగంగా చేసుకోండి. అప్పుడే ఆరోగ్యంగా ఉండగలరు’ అని ఆయన సూచించారు.

Advertisement

ప్రధాని మోదీ తన వీడియోపై స్పందించడమే కాకుండా, దానిని షేర్ చేయడం పట్ల యువరాజ్ దువా ఎంతో ఉద్వేగానికి లోనయ్యారు. తన చిన్నపాటి అభ్యర్థన దేశ ప్రధాని వరకు చేరుతుందని తాను అస్సలు ఊహించలేదని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ప్రజల ఆరోగ్యం పట్ల ప్రధాని చూపుతున్న శ్రద్ధను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఈ ఘటన సోషల్ మీడియా ప్రభావం ఎంత బలంగా ఉంటుందో మరోసారి నిరూపించింది.

Also Read: పిల్లి పెట్టిన చిచ్చు.. సూసైడ్ చేసుకున్న ఎంబీబీఎస్ విద్యార్దిని..!

Advertisement

Related News

ఇది సాహసమా లేక పిచ్చి తనమా.. కేరళ వరద నీటిలో థార్ జీపుతో డేంజర్ స్టంట్స్!

బస్సులో ఆకతాయి వెర్రి చేష్టలు.. చితకొట్టి చుక్కలు చూపించిన యువతి

చిత్తూరు జిల్లాలో విచిత్రం.. శివలింగంపై నూనె పోస్తే పాలలా మారుతున్న వైనం.. వీడియో వైరల్!

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

Big Stories

Advertisement
×