E-Paper
Advertisement

Hyundai i20 Price: వినియోగదారులకు గుడ్ న్యూస్, హ్యుందాయ్ i20 ధర తగ్గిందోచ్!

Hyundai i20 Price: వినియోగదారులకు గుడ్ న్యూస్, హ్యుందాయ్ i20 ధర తగ్గిందోచ్!
Advertisement

హ్యుందాయ్ మోటార్ ఇండియా వినియోగదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఎంపిక చేసిన వేరియంట్లలో ధరలను సవరించింది. i20 హ్యాచ్‌ బ్యాక్‌ అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం i20 ధర రూ. 5.99 లక్షల (ఎక్స్ షోరూమ్) నుంచి ప్రారంభం అవుతుంది. ఈ నిర్ణయంతో ప్రీమియం హ్యాచ్‌ బ్యాక్ విభాగంలో మారుతి సుజుకి బాలెనో, టాటా ఆల్ట్రోజ్ లాంటి కార్లతో i20 మరింత బలంగా పోటీ పడనుంది.

హ్యుందాయ్ ఎంట్రీ పాయింట్ గా i20

అటు హ్యుందాయ్ i20 ఎరా కొత్త ఎంట్రీ పాయింట్ గా మరింది. కారు ధర తగ్గించినప్పటికీ, హ్యుందాయ్ కారులో అవసరమైన ఏ యాక్సెసరీస్ ను తొలగించలేదు. గతంలో మాదిరిగానే ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. ఎరా వేరియంట్‌ లో ఆరు ఎయిర్‌ బ్యాగ్‌లు, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, బాడీ కలర్డ్ ORVMలు, డోర్ హ్యాండిల్స్, ముందు, వెనుక స్కిడ్ ప్లేట్లు, టైప్-C USB ఛార్జర్, టెలిస్కోపిక్ స్టీరింగ్ ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే బేసిస్ స్థాయిలో కూడా ప్రీమియం అనుభూతిని, బలమైన భద్రతను అందిస్తుంది.

మరో రెండు కార్ల ధరల సవరణ

Advertisement

హ్యుందాయ్ మాగ్నా ఎగ్జిక్యూటివ్, మాగ్నా వేరియంట్ల ధరలను కూడా సవరించింది. ప్రస్తుతం వీటి ధరలు వరుసగా రూ. 6.74 లక్షలు, రూ. 6.99 లక్షలు (ఎక్స్ షోరూమ్)గా ఉన్నాయి. మాగ్నా ఎగ్జిక్యూటివ్ వేరియంట్ అత్యాధునిక సాంకేతికత, భద్రతపై దృష్టి పెడుతుంది. ఇందులో డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, TPMS, ఆటోమేటిక్ హెడ్‌ ల్యాంప్‌ లు, కీలెస్ ఎంట్రీ, ఎలక్ట్రికల్‌ గా అడ్జెస్ట్ చేయగలిగే ORVMలు, స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో, బ్లూటూత్ కంట్రోల్స్, షార్క్ ఫిన్ యాంటెన్నా, టెలిస్కోపిక్ స్టీరింగ్ ఉన్నాయి.

ఇక మాగ్నా వేరియంట్‌ కు  ఎలక్ట్రిక్ సన్‌ రూఫ్, LED DRLలు, వెనుక AC వెంట్లు,  స్టోరేజ్ తో కూడిన ఫ్రంట్ ఆర్మ్‌ రెస్ట్ లాంటి  లక్షణాలతో సౌకర్యం, సౌలభ్యాన్ని అందిస్తుంది. హై ట్రిమ్‌ల లోకి వెళ్లకుండా మరింత ఖరీదైన అనుభవాన్ని కోరుకునే కొనుగోలుదారులకు ఇది ఉపయోగపడుతుంది.

Advertisement

మంచి లుక్ కు తోడు, హ్యుందాయ్ వైర్‌ లెస్ ఆపిల్ కార్‌ ప్లే, ఆండ్రాయిడ్ ఆటోతో కూడిన 10.1 అంగుళాల టచ్‌ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ ను డీలర్ ఇన్‌స్టాల్ చేసిన ఆప్షన్ గా, బ్యాక్ కెమెరాతో పాటు అందిస్తోంది. రూ. 14,999 ధరతో కూడిన ఈ ప్యాకేజీకి మూడు సంవత్సరాల వారంటీ ఉంది. ఇది కొనుగోలుదారులకు సరసమైన అప్‌గ్రేడ్‌గా మారుతుంది.

i20 ఎరా ఇంజిన్ గురించి..

హ్యుందాయ్ i20 1.2-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ ఫోర్-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌ ను కలిగి ఉంటుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌ బాక్స్ CVTతో జత చేయబడింది. ఇంజిన్ 83bhp పవర్, 114.7Nm టార్క్‌ను అందిస్తుంది. మెరుగైన సామర్థ్యం కోసం ఇంటిగ్రేటెడ్ స్టార్టర్ జనరేటర్‌ ను కలిగి ఉంటుంది.

Read Also: మార్కెట్ లోకి OSM Vextra ఎలక్ట్రిక్ స్కూటర్, ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

Related News

వోక్స్‌ వ్యాగన్ కార్లపై కళ్లు ఆఫర్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ.6 లక్షల తగ్గింపు!

సింగిల్ ఛార్జ్ తో 243 కి.మీ రేంజ్.. సింపుల్ వేవ్ సూపర్ స్కూటర్ వచ్చేసింది!

2027లో కొత్త నెక్సాన్.. డిజైన్ నుంచి ఇంజిన్ వరకు అన్నీ మారనున్నాయా?

5 ఏళ్ల తర్వాత పజెరో రీఎంట్రీ.. కొత్త లుక్‌తో మిత్సుబిషి బిగ్ సర్‌ప్రైజ్!

EV కొనేముందు ఈ విషయం చెక్ చేశారా? లేదంటే ఇబ్బందులు తప్పవు!

టాటా దూకుడు.. మహీంద్రా జోరు! ఆగస్టు అమ్మకాల్లో ఎవరు టాప్?

హోండా కొత్త ఈ-స్కూటర్‌కు పేటెంట్.. స్పీడ్ ఎంతో తెలిస్తే వావ్ అనాల్సిందే!

100 కి.మీ స్పీడ్.. 200 కి.మీ రేంజ్.. ఆంపియర్ కొత్త ఎలక్ట్రిక్ బైక్‌కు పేటెంట్!

Big Stories

Advertisement
×