E-Paper
Advertisement

River: మనదేశంలో 5 రాష్ట్రాల నుంచి ప్రవహించే ఒకే ఒక నది ఏదో తెలుసా?

River: మనదేశంలో 5 రాష్ట్రాల నుంచి ప్రవహించే ఒకే ఒక నది ఏదో తెలుసా?
Advertisement

మన దేశంలో ఎన్నో వందల నదులు ఉన్నాయి. కానీ వాటిలో అతి ముఖ్యమైనది, ప్రధానమైనది గంగానది. దీని గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. నదిని దైవంతో సమానం చూసే నమ్మకం మనది. అందుకే గంగా కేవలం ఒక నది మాత్రమే కాదు, ఒక దేవద. కోట్లాది మంది ప్రజల జీవనాధారం. తాగునీరు, వ్యవసాయం, చేపల వేట, యాత్రలు… ఇలా ఎన్నో రకాలుగా గంగానదిపై మనం ఆధారపడి బతుకుతున్నాం. అందుకే చాలా మంది గంగాను పవిత్రంగా భావిస్తారు. గంగానది దగ్గర జరిగే పూజలు, స్నానాలు, పండుగలు దేశ సంస్కృతిలో చాలా ముఖ్యమైన భాగంగా మారాయి. ఉత్తర భారతదేశంలో గంగా లేకుండా జీవితం ఊహించలేమని అక్కడి ప్రజలు చెబుతుంటారు.

గంగానది పేరు ఎలా?
గంగానది ప్రయాణం కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఇది హిమాలయాల్లోని గంగోత్రి అనే మంచు కొండల దగ్గర ప్రారంభమవుతుంది. మొదట భగీరథి అనే పేరుతో ప్రవహిస్తుంది. తర్వాత దేవప్రయాగ వద్ద ఆలకనంద అనే మరో నదితో కలిసిన తర్వాతే దానికి గంగానది అనే పేరు వస్తుంది. అక్కడి నుంచి ఉత్తరాఖండ్ నుంచి బయలుదేరి ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ ఇలా మొత్తం ఐదు రాష్ట్రాల గుండా ప్రవహిస్తూ చివరకు బంగాళాఖాతంలో కలుస్తుంది. దాదాపు 2,500 కిలోమీటర్లకుపైగా ప్రయాణం చేసే ఈ నది మార్గంలో కోట్లాది మంది ప్రజలకు జీవనాధారం అవుతోంది.

Advertisement

Also read: Potato Halwa: బంగాళాదుంపలతో చేసే టేస్టీ హల్వా, తక్కువ పదార్థాలతో ఇంట్లో చేసే రుచికరమైన స్వీట్

అతి పెద్ద డెల్టా
గంగానది ప్రత్యేకతలు కూడా చాలా ఉన్నాయి. పశ్చిమ బెంగాల్ ప్రాంతానికి చేరుకున్నాక ఈ నది రెండు భాగాలుగా విడిపోతుంది. ఒక భాగం హుగ్లీగా కోల్‌కతా వైపు వెళ్తే, ఇంకొక భాగం పద్మగా బంగ్లాదేశ్ వైపు సాగుతుంది. బీహార్‌లోని పాట్నా దగ్గర గంగానది చాలా లోతుగా ఉంటుంది. కొన్ని చోట్ల 100 అడుగులకు పైగా లోతు ఉందని చెబుతారు. గంగా, బ్రహ్మపుత్ర నదులు కలిసి సుందర్బన్స్ అనే ప్రపంచంలోనే అతిపెద్ద డెల్టాను ఏర్పరుస్తాయి. అక్కడ ఉన్న అడవులు, పులులు, పక్షులు ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులను ఆకర్షిస్తాయి. అంతేకాదు, గంగానదిలో కనిపించే గంగేటిక్ డాల్ఫిన్ అనే అరుదైన జంతువు కూడా ఈ నదికి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చింది.

Advertisement

Also read: Ginger Prawns: జింజర్ ప్రాన్స్.. ఇలా చేస్తే ప్లేటు ఖాళీ అవ్వాల్సిందే, రెసిపీ ఇదిగో

పర్యాటకంగా చూసినా గంగానది చాలా ముఖ్యమైనది. హరిద్వార్, రిషికేశ్, వారణాసి వంటి పట్టణాలు గంగానది వల్లే ప్రపంచానికి తెలిసాయి. ప్రతి రోజు సాయంత్రం జరిగే గంగా హారతి చూడటానికి వేలాది మంది చేరుతారు. ప్రయాగ్‌రాజ్‌లో జరిగే కుంభమేళా సమయంలో లక్షల మంది ఒకేసారి గంగలో స్నానం చేస్తారు. రైతులకు పంటలకు నీరు అందించడం నుంచి పర్యాటక రంగానికి ఆదాయం రావడం వరకు గంగానది పాత్ర చాలా పెద్దది. అందుకే గంగానది గురించి మాట్లాడినప్పుడు అది కేవలం ఒక నది కథ కాదు… మన దేశ చరిత్ర, సంస్కృతి, జీవన విధానం అన్నీ కలిసిన ఒక చరిత్ర.

Related News

వందే భారత్ రైళ్లలో రొటేటింగ్ సీట్లు తొలగింపు? ఈ 3 సమస్యలే కారణమట!

వందే భారత్ రైలు చక్రాలకు తాళాలు వేసిన లోకో పైలెట్.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 250కి పైగా వందే భారత్ స్లీపర్ రైళ్లు వచ్చేస్తున్నాయ్!

ప్రయాణికులకు అలర్ట్.. 36 రోజుల పాటు రైళ్లకు అంతరాయం!

రైలులో సిగరెట్ తాగిన వేస్ట్ ఫెలో.. ఒక్కసారే రైల్లో అలజడి, ఏమైందా అని చూస్తే..

రూ.50 వేల బడ్జెట్‌లో ఫారిన్ ట్రిప్.. భారతీయుల కోసం ఈ 7 దేశాలు బెస్ట్

200 ఏళ్ల తర్వాత ఆ ఇంట్లో ఆడపిల్ల.. రథంపై ఊరేగించి ఘన స్వాగతం!

అందంగా కనిపిస్తాయి.. కానీ, అడుగు పెడితే అంతే సంగతులు!

Big Stories

Advertisement
×