Hyundai Prime Taxi Range Launch: హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ (HMIL) కమర్షియల్ మొబిలిటీ సెగ్మెంట్ లోకి సరికొత్త టాక్సీ మోడల్స్ ను అందుబాటులోకి తీసుకొస్తుంది. అందులో భాగంగానే హ్యుందాయ్ ప్రైమ్ టాక్సీ రేంజ్ కారును లాంచ్ చేసింది. ఈ కారు రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. ప్రైమ్ హ్యాచ్ బ్యాక్(HB), ప్రైమ్ సెడాన్(SD). ఇవి టాక్సీ, ఫ్లీట్ ఆపరేటర్ల కోసం డిజైన్ చేయబడ్డాయి. లో రన్నింగ్ కాస్ట్, హై మైలేజ్, అడ్వాన్స్‌డ్ సేఫ్టీ ఫీచర్లతో అందుబాటులోకి రాబోతున్నాయి.
హ్యుందాయ్ ప్రైమ్ టాక్సీ రేంజ్ డిసెంబర్ 30, 2025న ఇండియాలో లాంచ్ అయింది. బుకింగ్స్ రూ. 5,000తో హ్యుందాయ్ డీలర్‌షిప్ లలో అందుబాటులో ఉన్నాయి.
⦿ ప్రైమ్ HB: రూ. 5.99 లక్షలు (ఎక్స్-షోరూమ్).
⦿ ప్రైమ్ SD: రూ. 6.89 లక్షలు (ఎక్స్-షోరూమ్).
⦿ ఇవి సింగిల్ వేరియంట్‌లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. కంపెనీ-ఫిట్టెడ్ CNGని కలిగి ఉన్నాయి.
⦿ ప్రైమ్ HB: CNG మోడ్ లో 27.32 km/kg ఇస్తుంది. CNG ట్యాంక్ 65 లీటర్ల వాటర్ ఈక్వివలెంట్ (సుమారు 10-12 kg CNG ఫిల్). సో, అంచనా డ్రైవింగ్ రేంజ్ 273-328 km ఉంటుంది. పెట్రోల్ మోడ్‌లో మైలేజ్ 20 kmpl ఉంటుంది. 37 లీటర్ల ట్యాంక్‌తో 740 km వెళ్లే అవకాశం ఉంది.
⦿ ప్రైమ్ SD: CNG మోడ్‌లో 28.40 km/kg ఇస్తుంది. అంచనా రేంజ్ 284-341 km. పెట్రోల్ రేంజ్ తో సమానమైన మైలేజ్ ఇస్తుంది.
⦿ ఇవి సిటీ ఆపరేషన్లకు లో కాస్ట్ ఆఫ్ ఆపరేషన్ అందిస్తాయి. హై మైలేజ్ యూసేజ్ కోసం స్పెషల్ ఎక్స్‌టెండెడ్ వారంటీ అందుబాటులో ఉంటుంది.
హ్యుందాయ్ ప్రైమ్ టాక్సీ రేంజ్ రెండు మోడల్స్ సమానమైన పవ ర్‌ట్రెయిన్, ఫీచర్లు కలిగి ఉన్నాయి. కానీ, డిజైన్‌లో తేడా ఉంది.
⦿ ఇంజిన్: 1.2L కప్పా 4-సిలిండర్ బై-ఫ్యూయల్ (పెట్రోల్ + CNG)లో ఉంటుంది.
⦿ పవర్, టార్క్: 83 PS @ 6000 rpm, 113.8 Nm @ 4000 rpm; CNG: 69 PS @ 6000 rpm, 95.2 Nm @ 4000 rpm ఉంటుంది.
⦿ ట్రాన్స్ మిషన్: 5-స్పీడ్ మాన్యువల్.
⦿ ఫ్యూయల్ ట్యాంక్: పెట్రోల్: 37L; CNG: 65L (వాటర్ ఈక్వివలెంట్)
⦿సీటింగ్: 5 సీట్లు
⦿ ఇన్ఫోటైన్‌మెంట్: 9 ఇంచుల టచ్‌స్క్రీన్ వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే ఉంటుంది.
⦿కంఫర్ట్ ఫీచర్లు: రియర్ AC వెంట్స్, పవర్ విండోస్, డ్రైవర్ సీట్ హైట్ అడ్జస్ట్, టైప్-C చార్జర్, స్టీరింగ్ కంట్రోల్స్ ఉంటాయి.
⦿ సేఫ్టీ: 6 ఎయిర్‌బ్యాగ్స్, ABS+EBD, రియర్ పార్కింగ్ సెన్సార్స్, వెహికల్ లొకేషన్ ట్రాకింగ్, స్పీడ్ లిమిటర్ (80 kmph), సీట్‌బెల్ట్ రిమైండర్ ఉంటాయి.
⦿ కలర్ ఆప్షన్స్: అట్లాస్ వైట్, టైఫూన్ సిల్వర్, అబిస్ బ్లాక్ లో ఉంటాయి.
ఈ మోడల్స్ ఇండియా మార్కెట్‌కు స్పెషల్‌గా డిజైన్ చేయబడ్డాయి.
Read Also: ఓ వైపు మంచు, మరోవైపు ఎండ.. రెండింటి నుంచి కాపాడే క్రేజీ హెల్మెట్!